E-Paper
Advertisement

Epstein Files Code Words: పిజ్జా అంటే అమ్మాయి.. మరి, చీజ్.. ఐస్‌క్రీమ్.. పాస్తా అంటే? ఎప్‌స్టీన్ కోడ్ వర్డ్స్‌కు అర్థాలివేనా?

Epstein Files Code Words: పిజ్జా అంటే అమ్మాయి.. మరి, చీజ్.. ఐస్‌క్రీమ్.. పాస్తా అంటే? ఎప్‌స్టీన్ కోడ్ వర్డ్స్‌కు అర్థాలివేనా?

ప్రపంచ దిగ్గజాలను వణికిస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎప్‌స్టీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులతో స్నేహం ఉంది. అలాగే ప్రభుత్వాల్లో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులతో కూడా ఎప్‌స్టీన్ నిత్యం టచ్‌లో ఉండేవాడు. తన వాణిజ్య అవసరాల కోసం ప్రభుత్వ పెద్దలను, అధికారులను ప్రలోభాలకు గురిచేసేవాడు. లైంగిక కోరికలు కలిగిన వ్యక్తులతే ఈజీగా ఎప్‌స్టీన్ ట్రాప్‌లో పడిపోయేవారు. వారికి ఎప్‌స్టీన్.. 18 ఏళ్లు కూడా నిండని అమ్మాయిలను సప్లై చేసేవాడు. ముందుగా తన కోరిక తీర్చుకుని.. ఆ తర్వాత మిగతావారికి ఆఫర్ చేసేవాడు.

పాపం ఎప్పటికైనా పండాల్సిందే అన్నట్లు.. ఓ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. అతడి నేరాలు తెలుసుకుని.. అప్పటివరకు దోస్తులనుకున్న ప్రభుత్వ అధికారులు, పెద్దలు కూడా అతడికి సాయం చేయలేదు. ఫలితంగా కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. కానీ, జైల్లోనే అనుమానస్పదంగా చనిపోయాడు. అయితే, ప్రభుత్వం ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడని చెబితే.. జనాలు మాత్రం పక్కా ప్లానింగ్‌తో లేపేశారని అంటున్నారు. కొందరైతే.. అసలు ఎప్‌స్టీన్ చనిపోలేదని.. అండర్ ‌గ్రౌండ్‌కు పంపేసి డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు.

అమ్మాయిల సప్లైకి కోడ్ వర్డ్స్

ఎప్‌స్టీన్ ఒక భారీ వ్యభిచార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రపంచవాప్తంగా ఉన్న బడా బాబులకు, రాజకీయ పెద్దలకు, సెలబ్రిటీలకు అమ్మాయిలను సప్లై చేసేవాడు. వారిలో కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా ఉండేవారట. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా.. వారికి కొన్ని ఆహారాల పేర్లను పెట్టాడు. ముఖ్యంగా పిజ్జా, హాట్ డాగ్, చీజ్, పాస్తా, ఐస్ క్రీమ్, వాల్‌నట్, మ్యాప్, సాస్ వర్డ్స్‌ను వాడేవాడు. ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకారం.. పిజ్జా అనే పదాన్ని సుమారు 900 సార్లు వాడినట్లు తెలిసింది. ఎందుకంటే.. పిజ్జా అంటే అమ్మాయికి పెట్టిన కోడ్ వర్డ్‌గా భావిస్తున్నారు. వాస్తవానికి ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఈ పదాలకు అర్థాలేవీ వివరించలేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఒక ఫొటో వైరల్ అవుతోంది. అందులో ఆ పదాలకు అర్థాలను వివరించారు. ఆ పదాలను ఒక మాజీ FBI అధికారి డికోడ్ చేశారని చెబుతున్నారు.

ఆ కోడ్ వర్డ్స్‌కు అర్థాలివేనా?

hotdog (హాట్ డాగ్) = boy (అబ్బాయి)
pizza (పిజ్జా) = girl (అమ్మాయి)
cheese (చీజ్) = little girl (చిన్న అమ్మాయి – బాలిక)
pasta (పాస్తా) = little boy (చిన్న అబ్బాయి – బాలుడు)
ice cream (ఐస్ క్రీమ్) = male prostitute (మగ వ్యభిచారి)
walnut (వాల్ నట్) = person of colour (వ్యక్తి రంగు)
map (మ్యాప్) = semen (వీర్యం)
sauce (సాస్) = orgy (గ్రూప్ సె*)

విచారణ అధికారులు ఏమంటున్నారు?

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న ఈ కోడ్ వర్డ్స్‌పై విచారణ అధికారులు స్పందిస్తూ.. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఈ లిస్టును ఎవరూ ధృవీకరిచలేదని, అవి విచారణకు తప్పుతోవ పట్టించేలా ఉన్నాయని ప్రకటించారు. అయితే, 3 మిలియన్ పేజీల్లో పిజ్జా అనే పదం సుమారు 900కు పైగా ప్రస్తావనకు వచ్చింది. అందుకే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన ‘పిజ్జా’ వర్డ్ సుమారు 911 సార్లు కనిపించింది. ఆ తర్వాత సుమారు 60 రిఫరెన్సులను అధికారులు ఫైల్స్ నుంచి తొలగించారు. కానీ, ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకారం.. ఈ వర్డ్స్‌ను అతడు ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది.

ఇదిగో ఇలా సంభాషించేవాడు

ఒక సంపన్న వ్యక్తి పిజ్జా డెలివరీ చేస్తానంటే మీకు ఎలా అనిపిస్తుంది? వింతగా ఉంటుంది కదూ. అందుకే ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోని ఈ సంభాషనుల పలు అనుమానాలు దారి తీస్తున్నాయ్. ఊదాహరణకు.. ‘‘ఏ సమయానికి నీకు పిజ్జా, ద్రాక్ష సోడా కావాలి’’ అని ఎప్‌స్టీన్ అడిగేవాడు. దీనికి అవతలి వ్యక్తి నుంచి ఇలా రిప్లై వచ్చింది. ‘‘నీ పిజ్జా చాలా యమ్మీ యమ్మీగా ఉంది. ఇది చైనా కుకీస్ కంటే చాలా బాగుంది. ఈసారి కూడా పిజ్జా, ద్రాక్ష సోడా కావాలి’’ అని రిప్లయ్ ఇచ్చాడు. అయితే, అలాంటి సంభాషణలను ఆధారంగా చేసుకుని నేరాన్ని నిర్ధారించలేమని అధికారులు అంటున్నారు. వారు ఏ సందర్భాల్లో ఆ విషయాలు మాట్లాడుకున్నారో కూడా పరిశీలించాల్సి ఉంటుందన్నారు.

ఎప్‌స్టీన్.. పిజ్జాగేట్ సిద్ధాంతం పాటించాడా?

‘పిజ్జాగేట్’ సిద్ధాంతమా? ఇదేంటీ కొత్తగా అని అనుకుంటున్నారా? 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉద్భవించిన కుట్ర కథనం ఇది. వాషింగ్టన్ డీసీలోని కామెట్ పింగ్ పాంగ్ అనే పిజ్జా రెస్టారెంట్ నుంచి ప్రముఖ రాజకీయ నేతలు, వాణిజ్య దిగ్గజాలు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. అది నిజమని భావించిన 28 ఏళ్ల వ్యక్తి ఎడ్గార్ వెల్చ్ ఏఆర్-15 రైఫిల్‌తో కామెంట్ పింగ్ పాంగ్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ రెస్టారెంట్ బేస్మెంట్‌లో బంధించారని భావించి.. లోపలికి చొరబడ్డాడు. లక్కీగా ఆ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.

Also Read: ఎప్‌స్టీన్ ఫైల్స్.. వాళ్లంతా నరమాంసం తిన్నారా? ఏకంగా పిల్లలనే అలా.. ఇందులో నిజమెంత?

ఆ ఘటన తర్వాత పోలీసులు రెస్టారెంటులో సోదాలు జరిపారు. అక్కడ అస్సలు బేస్మెంటే లేదని నిర్ధరించారు. అందుకే.. దానికి పిజ్జాగేట్ సిద్ధాంతమని పేరు పెట్టారు. అయితే, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఎఫ్‌బీఐ స్పష్టం చేసింది. అయితే, కొందరు దీన్ని ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు లింక్ చేశారు. ఎప్‌స్టీన్ తన మెసేజులు, సంభాషనల్లో పిజ్జా పదాన్ని వాడటానికి కారణం ఇదే కావచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఆన్‌లైన్‌లో జరిగిన తప్పుడు ప్రచారం వల్ల ఎలాంటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×