ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడైన జెఫ్రీ ఎప్‌స్టీన్.. చేసిన దారుణాలు చూసి యావత్తు ప్రపంచమే బిత్తరపోయింది. పిల్లల నుంచి టీనేజ్ అమ్మాయిల వరకు.. ఎవరినీ వదలని ఈ కామాంధుడితో ప్రపంచ దిగ్గజాలకు మాంచి సంబంధాలున్నాయనే విషయం మరింత చర్చనీయమైంది. దీంతో అతడి నేరాల్లో వారికి కూడా భాగస్వామ్యం ఉండి ఉండవచ్చే అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచ పెద్దలంతా.. ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, మరో కలవరపరిచే విషయం ఏమిటంటే.. ఎప్‌స్టీన్ కేవలం అమ్మాయిల లైగింక వేధింపులు, అక్రమ రవాణా చేయడమే కాదట, అతడి పార్టీల్లో వీఐపీలకు.. మనుషుల మాంసాన్ని విందుగా పెట్టేవాడనే రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతోంది.
ఓ మహిళ.. ‘‘వాళ్లు మనుషులు కాదు.. రాక్షసులు, పిల్లలను తింటున్నారు’’ అంటూ ఏడుస్తూ మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే, అది ఏ సందర్భంలో తీసిన వీడియో అనేది తెలియరాలేదు. మరి, నిజంగానే ఎప్‌స్టీన్ అలాంటి విందు ఇచ్చేవాడా? వీఐపీలు ఇష్టంగా ఆ ఆహారాన్ని తినేవారా? ఇందులో నిజం ఏమిటీ?
జెఫ్రీ ఎప్‌స్టీన్, అతడి ఫ్రెండ్ గిస్లైన్ మాక్స్వెల్ కలిసి అమ్మాయిలను లైంగికంగా వేధించేవారు. మహిళలను అక్రమంగా రవాణా చేసేవారు. ఇతర వ్యక్తులకు కూడా అమ్మాయిలను సరఫరా చేసేవారు. మొదట్లో ఒకసారి ఎప్‌స్టీన్ లైంగిక ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. రిలీజ్ తర్వాత అసలైన దందా మొదలుపెట్టాడు. తనలాంటి పెద్దవాళ్లను టచ్ కూడా చేయలేరనే ధైర్యంతో అమ్మాయిల బిజినెస్‌ను మరింత విస్తరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ, అతడు 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎప్‌స్టీన్ ఫ్రెండ్ గిస్లైన్ మాత్రం ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఈ కేసుల విచారణలో భాగంగా పోలీసులు ఎప్‌స్టీన్ లాప్‌టాప్, మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అతడి మెయిల్స్, మెసేజ్‌లు ప్రతి ఒక్కటీ సేకరించారు. వాటి నుంచి సేకరించిన మిలియన్లల కొద్ది డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలను ఇటీవలే ప్రభుత్వ ఆదేశాలతో బయట పెట్టారు. వాటినే ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ అని అంటున్నారు. ఈ ఫైల్స్‌లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తోపాటు చాలామంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
ఎప్‌స్టీన్‌కు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ విమానం ఉంది. అలాగే అతడికి ఒక ప్రైవేట్ ద్వీపం కూడా ఉంది. అక్కడికి సాధారణ ప్రజలను అనుమతించరు. పోలీసులు కూడా ఎప్‌స్టీన్ అనుమతి లేకుండా ప్రవేశించకూడదు. అందుకే ఎప్‌స్టీన్ ఏ నేరాలు చేసిన బయటకు తెలిసేది కాదు. ఎప్‌స్టీన్ అక్కడ 18 ఏళ్లు కూడా నిండని టీనేజ్ అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాడని, తన పార్టీకి వచ్చిన అతిథులకు కూడా వారిని ఆఫర్ చేసేవాడని సమాచారం. అయితే, అతడు ఇచ్చిన పార్టీల్లో నరమాంసం తినేవారా.. లేదా అనడానికి ఆధారాలేవీ లేవు. కానీ, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మాత్రం.. వివిధ సందర్భాల్లో ‘నరమాంసం’ అనే పదాలు 58 సార్లు కనిపించాయ్. అయితే, వారు మనిషి మాంసం తిన్నారు అని చెప్పే ఆధారాలేవీ లేవు. కేవలం అవి సంభాషనల్లో వచ్చిన పదాలే. దీంతో పొగలేనిదే నిప్పు రాదు కదా అని జనాలు అంటున్నారు.
ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అయ్యింది. అది 2009లో మెక్సికోలో జరిగిన ఘటన అది. గాబ్రియేలా రికో జిమెనెజ్ అనే మెక్సికన్ మోడల్.. భయంతో వణికిపోతూ, కేకలు పెడుతూ.. ‘‘పవర్‌ఫుల్ వ్యక్తులు నరమాంసం తింటున్నారు. పిల్లలను తింటున్నారు’’ అని పేర్కొంది. ఆ వీడియోను ఇప్పుడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు లింక్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే, అప్పట్లో ఆ పార్టీని నిర్వహించింది ఎప్‌స్టీనా, కాదా అని చెప్పడానికి ఆధారాల్లేవు. ఆ ఆరోపణల తర్వాత పోలీసులు ఆమెను మెంటల్ హాస్పిటల్‌లో చేర్చారు. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అందుకే ఆమె అలా మాట్లాడిందని స్వయంగా ఆమె కుటుంబ సభ్యులే తెలిపారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. గాబ్రియెలా ఆచూకీ లేదు. అసలు ఆమె ఏమైంది? అనేది ఇప్పటికీ మిస్టరీనే.
“They ate human flesh”
In 2019, 21-year-old Gabriela Rico Jimenez made statements alleging extreme abuse connected to Jeffrey Epstein
Newly released Epstein-related documents show that some elements she referenced were already known to investigators, though they stop short of… pic.twitter.com/Y0D8GEgHQO
— HOT SPOT (@HotSpotHotSpot) January 31, 2026
ఎప్స్టీన్ పార్టీల్లో చిన్న పిల్లలు ఉండేవారని.. ఆ పిల్లల్ని హింసిస్తూ ఆనందించేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే, ఆ పార్టీల్లో పాల్గొన్న పెద్దలు.. మలాన్ని తినేవారనే రూమర్స్ కూడా పుట్టాయి. ఇది.. ఓ గుర్తు తెలియని వ్యక్తి కొన్నేళ్ల కిందట FBIకి ఇచ్చిన సమాచారం. అయితే, అతడి ఆరోపణలకు ఎలాంటి ఫొటోలు, వీడియోలు ఆధారంగా లభించలేదు. దీంతో దాన్ని ఒక రూమర్‌గా కొట్టిపడేశారు. వాస్తవం ఏమిటనేది కేవలం ఎఫ్‌స్టీన్, గిస్లైన్‌లకు మాత్రమే తెలుసు.
ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ తర్వాత ఓ భయానకమైన ఫొటో కూడా బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక డైనింగ్ టేబుల్ మీద రోస్ట్ చేసిన మనిషి బాడీ ఉంది. దాని పక్కనే ఇద్దరు పిల్లలు, ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. వేరే ఫొటోలు ఇంకా జుగుప్సకరంగా ఉన్నాయి. కొందరు ఈ ఫొటోలను ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు లింక్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఎప్‌స్టీన్ పార్టీల్లో ఇలా మనుషులను తినేవారని చెబుతున్నారు. వాస్తవానికి ఆ ఫొటోలకు, ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. అది ‘థాంక్స్ గివింగ్’ అనే ఫిక్షనల్ హర్రర్ మూవీలోని ఓ సన్నివేశంలోని చిత్రాలు. వాస్తవానికి అమెరికాలో కొంతమంది సైతానిజాన్ని పాటిస్తారు. పార్టీల్లో వారు సైతాన్‌ను ప్రార్థిస్తూ పిల్లలను బలిస్తారని, కొందరు వాటిని తింటారని అంటారు. ఎప్‌స్టీన్ కూడా అలాంటి సాంప్రదాయాలనే పాటించేవాడని కొందరు న్యూస్ క్రియేట్ చేశారు. అది కూడా వాస్తవం కాదని తెలుస్తోంది.
Hey @grok please tell that name who is in that image…
Why is there so much discussion about this….!!!!!!@Real_Vivek2020 pic.twitter.com/E18tlTrozk
— Vivek Kumar (@Real_Vivek2020) February 4, 2026
ఎప్స్టీన్ పార్టీల్లో నరమాంసం తింటారనే రూమర్లు క్రియేట్ చేసింది సోషల్ మీడియా. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదలైన తర్వాత.. అందులో భయానక విషయాలు ఉన్నాయంటూ కథనాలు వచ్చాయి. ఆయా పార్టీల్లో పాల్గొన్న పెద్దలంతా మనుషుల మాంసాన్ని తినేవారంటూ ప్రచారం చేశారు. ఇందుకు కొన్ని ఫొటోలు, వీడియోలను కూడా జతచేశారు. అయితే, అవన్నీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో లేని విషయాలు. 2011లో మరియా ఫార్మర్ అనే మహిళ.. ఎప్‌స్టీన్ ఇంట్లో జరుగుతున్న వ్యవహారాల గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె నరమాంస భక్షణ గురించి కూడా చెప్పింది. దాని ఆధారంగా కూడా కొందరు ఈ కథనాలను అల్లేశారు. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఇవన్నీ కట్టు కథలే అంటూ ఫ్యాక్ట్ చెక్ వార్తలను ప్రచురించాయి.
ఎప్స్టీన్ ఒక కామ పిశాచి. అతడితో పరిచయం ఉన్న సంపన్నులకు అమ్మాయిలను సరఫరా చేసేవాడు. వారిలో 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలు కూడా ఉన్నారు. వర్జీనియా గియుఫ్రే వంటి బాధితులు దీనిపై కేసు వేసి గెలిచారు కూడా. ఎప్‌స్టీన్ ముందుగా అమ్మాయిలకు డబ్బులు ఆశగా చూపించి లోబరుచుకొనేవాడు. ఆ తర్వాత వారి ఫ్రెండ్స్‌ను కూడా పరిచయం చేస్తే మరింత డబ్బు ఇస్తానని చెప్పేవాడు. అలా ఎప్‌స్టీన్ తన నెట్ వర్క్‌ను విస్తరించాడు. తనకు లొంగిన అమ్మాయిలను.. తన గెస్టుల అవసరాలకు సైతం పంపేవాడు. మరికొందరిని అక్రమంగా రవాణా చేసేవాడు. ఇందుకు మాక్స్‌వెల్ కూడా సహకరించేది. అందుకే కోర్టు ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎప్‌స్టీన్ అరెస్ట్ అయ్యే నాటికి అతడి ఆస్తుల విలువ రూ.4,537 కోట్లు అని అంచనా.
Also Read: సంపన్నుల డార్క్ సీక్రెట్.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఏం ఉన్నాయ్, ఆ పెద్దలు ఎవరు?