BigTV English

Mr. Idiot Teaser: రవితేజను అచ్చుగుద్దినట్లు దింపేసిన కొడుకు.. టీజర్ అదిరిపోయింది!

Mr. Idiot Teaser: రవితేజను అచ్చుగుద్దినట్లు దింపేసిన కొడుకు.. టీజర్ అదిరిపోయింది!

Ravi Teja’s Nephew Mr. Idiot Teaser Out Now: మాస్ మహారాజా రవితేజ తన స్వయంకృషితో స్టార్ గా ఎదిగాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారి.. ఇప్పుడు మాస్ మహారాజాగా కొనసాగుతున్నాడు. ఇక రవితేజ ఇద్దరు తమ్ముళ్లు సైతం హీరోలుగా మారడానికి ప్రయత్నించారు కానీ, అది అవ్వలేదు. దీంతో ఇప్పుడు తమ్ముడు కొడుకును హీరోగా దించుతున్నాడు మాస్ మహారాజా. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు మిస్టర్. ఇడియట్.


రవితేజకు ఇడియట్ ఎంత పేరు తీసుకొచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాధవ్ కూడా పెదనాన్న హిట్ సినిమా టైటిల్ నే తీసుకొని టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మిస్టర్. ఇడియట్ నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

టీజీర్ మొత్తం ఇడియట్ సినిమానే తలపిస్తుంది. పెదనాన్న రవితేజను మాధవ్ డిట్టో దింపేశాడు. ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కనే అమ్మాయి సత్య. ఆ కాలేజ్ లో టాలెంట్ లో అయినా.. అందంలో అయినా ఆమెకు సాటి ఎవరు ఉండరు. కొంచెం పొగరు కూడా ఉండడంతో మిగతావారందరూ ఆమె పొగరు దించే అబ్బాయి రావాలని కోరుకుంటారు. ఇక ఆ సమయంలోనే మాధవ్ కాలేజ్ లో అడుగుపెడతాడు. సత్యను ఆటపట్టిస్తూ ఆమెతో గొడవపడుతూ ఉంటాడు. చివరికి ఇద్దరు ప్రేమలో పడతారు. మరి వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు ఎలా సాల్వ్ అవుతాయి. చివరికి ఈ జంట ఒక్కటి అవుతుందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Also Read: Jyothi Rai: మొగిలయ్యకు సాయం చేసిన బుల్లితెర నటి

మాధవ్ ను చూస్తే రవితేజ కచ్చితంగా గుర్తుకు వస్తాడు. ఇడియట్ లోని ఐకానిక్ పోజ్ హీరోయిన్ నడుమును మోకాళ్ళ మీద హీరో పట్టుకోవడం, రవితేజ వాకింగ్ స్టైల్ ను మాధవ్ రీక్రియేట్ చేయడం హైలైట్ అని చెప్పొచ్చు. మిక్కీ జే మేయర్ సంగీతం ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినీరంతో మాధవ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×