E-Paper
Advertisement

Highcourt on DBT Funds: జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. ఆ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. కానీ..?

Highcourt on DBT Funds: జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. ఆ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. కానీ..?
Advertisement

High Court on DBT Funds Release: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కీలక పరిణామమే ఇప్పుడు ఏపీలోనూ జరిగింది. సరిగ్గా ఎన్నికలకు ముందు తెలంగాణలో రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ.. ఒక్కరోజూలోనే పూర్తి చేయాలని షరతు విధించింది. ఇదంతా ఒక్కరోజులో జరిగే పనికాదంటూ బీఆర్ఎస్ నిధుల విడుదలను ఆపివేసింది.

ఇప్పుడు ఏపీలో కూడా డీబీటీ నిధుల విడుదలపై ఇదే పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల తర్వాతే నిధులను విడుదల చేయాలని ఈసీ ఆదేశించగా.. దానిపై హైకోర్టు ఒక్క రోజు స్టే విధించింది. శుక్రవారం ఒక్కరోజే డీబీటీ (Direct Benefit Transfer) నిధుల విడుదలకు అనుమతినిచ్చింది. ఒక్కరోజులోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు విడుదలకు అనుమతిస్తూనే.. కొన్ని షరతులు కూడా పెట్టింది.

Advertisement

59 నెలలుగా ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న విద్యార్థులు, మహిళలకు హై కోర్టు తీర్పు ఊరటనిచ్చింది. నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్న పథకాలను ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి ఆపివేయాలనడంపై వైసీపీ కోర్టుకు వివరణ ఇచ్చింది. ఇన్ని నెలలుగా లబ్ధి పొందుతున్నవారు ఇప్పటి వరకూ ప్రలోభాలకు గురికాకుండా.. ఈసారి నిధుల విడుదలతో ప్రలోభానికి ఎలా గురవుతారని వైసీపీ ప్రశ్నించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. వైసీపీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.

Also Read: ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు, జగన్, చంద్రబాబు, ఆపై ఫిల్మ్ ఇండస్ట్రీ

Advertisement

ఆసరా, చేయూత, వసతి దీవెన, లా నేస్తం, రైతు భరోసా పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ.. ఈ పథకాల పేర్లను ప్రచారానికి వాడటానికి వీల్లేదని హైకోర్టు షరతు విధించింది. ఏదేమైనా.. ఏపీలో పోలింగ్ కు ముందు హైకోర్టు ఇలాంటి తీర్పునివ్వడం వైసీపీకి పెద్ద రిలీఫే.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు, హైదరాబాద్‌లో అయితే..

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×