Jeevan Reddy: నిన్నటి వరకు స్వపక్షంలో విపక్షంలా, కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన జగిత్యాల మాజీ ఎమ్మల్యే, సీనియర్ మోస్ట్ నాయకుడు జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఆ పెద్దాయన ఉన్నప్పటి కంటే, బయటకు వెళ్లిన తర్వాతే పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణుల్లో గుబులు కనిపిస్తోంది. ఇంతకీ జీవన్‌రెడ్డి అలకలతో ఆయనను పట్టించుకోవడం మానేసిన కాంగ్రెస్ పార్టీ ఎందుకంత ఆందోళన పడుతోంది? అసలు జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నారు..?
ఉమ్మడి కరీంనగర్ జల్లా జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జగడం కొత్త టర్న్ తీసుకుంది. దాదాపు రెండేళ్లుగా ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువగా సొంతపార్టీని ఇరుకునపెట్టేలా వ్యవహరించిన సీనియర్ నేత జీవన్ రెడ్డి మొత్తానికి పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నానని ప్రకటించనప్పటికీ, ఆయన ఏమి చేయబోతున్నారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కలవర పెడుతోందంట. టీడీపీ ఆవిరర్భావంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జీవన్‌రెడ్డికి.. దాదాపు నలభై ఐదేళ్ల నుంచి జగిత్యాల ప్రాంతంలో మంచి పట్టుకలిగిన నేతగాపేరుంది… ఒకప్పటి జగిత్యాల నియోజక వర్గంలోని మండలాలు 2009లో డీలిమిటేషన్ తర్వాత ప్రస్తుత చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలోకి వెళ్లాయి. అయినా ఇప్పటికీ ఆ మండలాల్లో జీవన్ రెడ్డి పట్టు అలాగే కొనసాగుతోంది.
కాంగ్రెస్‌కు రాజీనామా సందర్భంగా జరిగిన సమావేశానికి జగిత్యాల ఒక్కటే కాకుండా చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు.. తన వర్గీయులను ఉద్దేశించి జీవన్ రెడ్డి మాట్లాడుతూ పల్లె పల్లెకు తిరిగి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తానని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన పల్లెబాట జగిత్యాల నియోజకవర్గం పరిధి వరకే సాగుతోందా..? పక్కన ఉన్న ఆ రెండు నియోజకవర్గాల్లోకి వెళ్తుందా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిద్దరూ కూడా జీవన్ కి అత్యంత సన్నిహితులే కాకుండా శిష్యులు కూడా.
అయినా అత్త మీది కోపం దుత్త మీద చూపినట్టు పార్టీ మీద ఉన్న కోపాన్ని జీవన్ రెడ్డి వారిపై చూపి ఆ రెండు నియోజకవర్గాల్లో క్యాడర్‌ను డిస్ట్రబ్ చేస్తారా..? అనే గుబులు మొదలైందట. కాంగ్రెస్ నేతల్లో… ఇప్పటికే జీవన్ రెడ్డి తో పాటుగా కాంగ్రెస్‌కి రాజీనామా చేసినవారిలో ధర్మపురి నియోజకవర్గం కి చెందిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ లీడర్లు ఉండడం తో ఆ ఎఫెక్ట్స్ నియోజకవర్గం లొ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరతారా..? బీజేపీలో చేరతారా అనే ఆసక్తికర చర్చలు.. ఊహాగానాలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు జీవన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం వారి సూచనల మేరకే పెద్దాయన పల్లె ప్రచారబాట కార్యక్రమం చేపట్టారట. అయితే బీఆర్ఎస్ లో చేరి పోరాటం చేస్తే పొలిటికల్ గా అంతగా మైలేజీ రాదనే భావనలో జీవన్ ఉన్నారట కొద్ది రోజులపాటు క్యాడర్ తో ప్రజల్లోకి వెళ్లి వీలైన మేరకు కాంగ్రెస్ పునాదులు కదిలించాలనే ఆలోచనలో ఉన్నారట.. విడిగా ఉంటూ విధ్వంసం సృషించాలని… అది జీవన్ ఒంటరిగా వెళ్తేనే సాధ్యం అవుతుందని ఇతర పార్టీల్లోకి వెళితే అనుకున్న మైలేజీ రాదని పెద్దాయన భావిస్తున్నారంట..
తాను చేపట్టిన పల్లె ప్రచార బాట కార్యక్రమం పొలిటికల్ యాత్ర అవుతుందనే సొంత అజెండాతో ముందుకు సాగాలని ఫిక్స్ అయ్యారంట. కాంగ్రెస్ కూడా జీవన్ అడుగులను నిశితంగా గమనించిన తర్వాతే నిర్ణయానికి రావాలని డిసైడ్ అయిందట ఆయన తమ క్యాడర్‌ను డిస్ట్రబ్ చేస్తే ఊరుకోకుండా కౌంటర్ అటాక్ చెయ్యాలి చూస్తున్నారట హస్తం నేతలు ఆయనకు అనేక అవకాశాలను ఇచ్చాం అధికారం కోసం పార్టీ మారారు. చివరి వరకు తాము బుజ్జగించామని అయినా ఆయన సొంత లెక్కలతో ఎందుకు పార్టీని వీడారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తూనే…జీవన్‌రెడ్డి ప్రభుత్వంపై పొలిటికల్ అటాక్ మెదలు పెట్టాలని చూస్తున్నారు. జీవన్ ప్లాన్ ఫీల్డ్ లో వర్కౌట్ అవుతుందా? ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో? అనేది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది.
Also Read: Anti Cancer Foods: మీరు రోజూ తినే ఆహారంతోనే క్యాన్సర్‌ను నిరోధించవచ్చు.. ఆ సూపర్ ఫుడ్స్ ఇవే