E-Paper
Advertisement

Alien Existence: ఏలియన్స్ భూమి మీద ఎంట్రీ ఇస్తే.. జరగబోయేది ఇదేనా!

Alien Existence: ఏలియన్స్  భూమి మీద ఎంట్రీ ఇస్తే.. జరగబోయేది ఇదేనా!

Alien Existence: ఏలియన్స్‌పై ఎన్నో ఊహాగానాలున్నాయ్. వాళ్లు.. ఇప్పటికీ ఓ మిస్టరీనే. గ్రహాంతరవాసులకు, గుర్తుతెలియని ఎగిరే వస్తువుల లాంటి వాటితో.. అమెరికాలోని ఏరియా 51కి బలమైన లింక్స్ ఉన్నాయనే ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. దీనిపై.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా.. ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏదో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉండే ఉంటారనే విషయాన్ని.. తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. కానీ.. ఏలియన్స్‌ని, ఏరియా 51లో అమెరికా నిర్బంధించిందనే ఊహాగానాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. పదేళ్ల కిందట.. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ రీపర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్స్‌లో.. మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై ఏలియన్స్ ఉనికి కనిపించిందని అనేక రిపోర్టులు వచ్చాయి. ఇప్పుడు.. వాటిపైనే ఒబామా స్పందించారు. గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన అనేక రికార్డులు, అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తాను అధికారంలో ఉన్న సమయంలో కూడా సమాచారం లేదన్నారు.

ఒబామా వ్యాఖ్యలతో మళ్లీ రగిలిన విశ్వ రహస్యం!

ఈ సువిశాల విశ్వంలో మనమే కాకుండా.. ఇతర జీవులు ఉన్నాయా? అనే ప్రశ్నకు.. దశాబ్దాలుగా సమాధానం దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో.. ఒబామా చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో.. ఇదే ట్రెండ్ అవుతోంది. ఇదే సమయంలో.. అమెరికాలోని నెవాడలో ఉన్న ఏరియా 51పైనా చర్చ జరుగుతోంది. ఇది.. అత్యంత రహస్యమైన ప్రాంతం. ఇక్కడ అమెరికా సైన్యం, సైంటిస్టులు.. ఆయుధాలు సహా వివిధ టెక్నాలజీలను టెస్ట్ చేస్తారు. సైనిక శిక్షణ కూడా ఇస్తారు. ఈ స్థావరాన్ని.. 1955లో ఏర్పాటు చేశారు. నెవాడ ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఏరియా 51. ఇక్కడ.. గతంలో లాగ్ హీడ్ మార్టిన్ యూ-12 నిఘా విమానాలను టెస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి సీక్రెట్ ఫైటర్ జెట్ల పనితీరుని ఇక్కడే అంచనా వేశారు. ఈ ప్రాంతం.. చాలాకాలంగా ఏలియన్స్, UFO సైటింగ్స్‌తో ముడిపడి ఉంది. అయితే, అమెరికా ప్రభుత్వం 2013 వరకు ఈ స్థావరం ఉనికిని అధికారికంగా అంగీకరించలేదు. ఇప్పుడు దానిని తొలగించారు.

అన్‌ఐడెంటిఫైడ్ అనోమలస్ ఫినామినా పై ఆసక్తి

అన్‌ఐడెంటిఫైడ్ అనోమలస్ ఫినామినా పట్ల ఆసక్తి పెరుగుతున్న క్రమంలో.. ఒబామా కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయ్. ఇందుకోసం.. పెంటగాన్ ఆల్-డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సంఘటనల గురించి ప్రభుత్వం మరింత సమాచారాన్ని బయటపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ చట్టాలను ఆమోదించింది. అయితే.. భూమికి ఆవల జీవం ఉందని నిర్ధారించగల కచ్చితమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ, శాస్త్రవేత్తలు ఒక ఆధారాన్ని కనుగొనే ఆశతో, అనంత విశ్వంలోని విస్తారమైన ప్రాంతాలను స్కాన్ చేస్తూనే ఉన్నారు. అయితే.. ఏలియన్స్ ఉనికిని కనుక్కునేందుకు రీసెర్చ్ చేస్తున్న క్రమంలో మొదలుపెట్టిన క్రౌడ్ సోర్స్ ప్రాజెక్ట్ కారణంగా.. ఇటీవలే శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు.

21 ఏళ్ల డేటాలో దాగున్న రహస్యాలేమిటి?

ఈ ప్రాజెక్ట్ పేరు.. సెటీ ఎట్ హోమ్. ఇది.. 1999లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాలంటీర్లుగా పాల్గొన్నారు. ప్యూర్టో రికోలోని అరేసిబో అబ్జర్వేటరీ నుంచి వచ్చిన డేటాలో అసాధారణ రేడియో సంకేతాలను గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2020లో కేబుల్ ఫెయిల్యూర్ కారణంగా.. భారీ రేడియో టెలిస్కోప్ కూలిపోయింది. ప్రాజెక్ట్ అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే.. 21 సంవత్సరాల డేటాలో.. 12 బిలియన్లకు పైగా ఇంట్రస్టింగ్ సిగ్నల్స్‌ని గుర్తించారు. పరిశోధకులంతా.. ఇప్పుడు ఆ ఫలితాలను తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం చైనా FAST రేడియో టెలిస్కోప్‌ని ఉపయోగించి తిరిగి పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగేళ్ల కిందట కూడా UAP, UFO గురించి ఒబామా మాట్లాడారు. ఆకాశంలో వింతగా ప్రయాణించే వస్తువుల వీడియోలు, రికార్డులు ఉన్నాయని, అవి ఎలా, ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయో మనకు అర్థం కాదని అప్పట్లోనే ఆయన అంగీకరించారు.

అసలు వారు మనకంటే ఎంత ముందున్నారు?

ఏలియన్స్ అనే పదం వింటే చాలు.. ఆటోమేటిక్‌గా ఓ ఉత్కంఠ మొదలవుతుంది. అంతకుమించిన డౌట్స్ మెదడులో మెదులుతాయ్. విశ్వం ఎంత అనంతమైనదో, అందులో దాగున్న రహస్యాలు కూడా అంతే అపరిమితం. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా.. ఆకాశంలో మనం వివరించలేని, గుర్తించలేని ఆబ్జెక్ట్స్ తిరుగుతున్న మాట నిజమన్నారు. ఇది విన్నాక.. సైంటిస్టులకే కాదు సామాన్యులకు కూడా అంతుచిక్కని ప్రశ్నలు మొదలయ్యాయ్. అసలు.. ఏలియన్స్ మనకంటే ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉండి ఉంటారు? వారు ఎందుకు మనల్ని కలవట్లేదు? ఒకవేళ వారు వస్తే ఏం జరుగుతుంది?

మనం ఇంకా టైప్-0 లోనే ఉన్నామా?

ఈ విశ్వం వయసు దాదాపుగా 14 బిలియన్ సంవత్సరాలు. భూమి పుట్టింది.. కేవలం 4.5 బిలియన్ ఏళ్ల క్రితమేననే అంచనాలున్నాయి. అంటే.. మనకంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందే.. వేరే గ్రహాలపై జీవం ఆవిర్భవించి ఉండే అవకాశం ఉందనే వాదన బలంగా ఉంది. ఒకవేళ.. అదే నిజమైతే.. వారి టెక్నాలజీ మన ఊహకు కూడా అందనంత స్థాయిలో ఉంటుంది. దీనిని అర్థం చేసుకునేందుకు.. కార్దషేవ్ స్కేల్ అనే సిద్ధాంతాన్ని వాడతారు. టైప్ వన్ సివిలైజేషన్‌లో.. తమ గ్రహం మీద ఉన్న మొత్తం శక్తిని వాడుకోగలరు. అదే.. టైప్ 2 సివిలైజేషన్‌లో.. సూర్యుడి లాంటి నక్షత్రాల నుంచి వచ్చే మొత్తం శక్తిని గ్రహిస్తారు. టైప్ 3 సివిలైజేషన్‌లో.. మొత్తం గెలాక్సీలోని శక్తిని కంట్రోల్ చేయగలరు. మనం ఇంకా టైప్ 1 స్థాయికి కూడా చేరుకోలేదు. ఒకవేళ.. ఏలియన్స్ భూమిని ఇప్పటికే గుర్తించి ఉంటే.. వారు కనీసం టైప్ 2, టైప్ 3 స్థాయికి చెందినవారై ఉంటారు. అంటే, వారి దగ్గర కాంతి వేగంతో ప్రయాణించే స్పేస్‌క్రాఫ్ట్స్ గానీ, వార్మ్ హోల్స్ ద్వారా సెకన్లలో ప్రయాణించే టెక్నాలజీ గానీ ఉండొచ్చంటున్నారు.

ఫెర్మి పారడాక్స్ ఇచ్చే షాకింగ్ నిజాలు!

ఒకవేళ.. ఏలియన్సే గనక ఉండి ఉంటే.. వాళ్లంతా ఎక్కడున్నారు? ఇంకా మన దాకా ఎందుకు రాలేకపోతున్నారు? అనే ప్రశ్నలు శాస్త్రవేత్తలను వేధిస్తున్నాయ్. దీన్నే.. ఫెర్మి పారడాక్స్ అంటారు. విశ్వం చాలా విశాలమైనది. కాంతివేగంతో వెళ్లినా.. ఓ గెలాక్సీ నుంచి మరో గెలాక్సీకి చేరడానికి వేల ఏళ్లు పడుతుంది. అంత అడ్వాన్స్‌డ్ జీవులకు మనం చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు అనిపించొచ్చు. ఏ నాగరికత అయినా, ఒక స్థాయికి రాగానే ప్రకృతి వైపరీత్యాల వల్లో, యుద్ధాల వల్లో అంతరించిపోతుందేమో అనే చర్చ కూడా ఉంది. దీనినే.. గ్రేట్ ఫిల్టర్ అంటారు. ఒకవేళ.. ఏలియన్స్ గనక నిజంగానే ఉండి.. భూమి మీదకు వస్తే ఏం జరుగుతుంది? ఇదంతా.. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినంత సరదాగా ఉండకపోవచ్చు. అందుకే.. స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావులు ఎప్పుడో హెచ్చరించారు. ఏలియన్స్ గనక మనల్ని వెతుక్కుంటూ వస్తే.. అది కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్లవుతుందన్నారు. దానివల్ల.. అక్కడి స్థానిక ప్రజలకు మంచి జరగదని చెప్పారు. అందుకే.. ఏలియన్స్ ఫ్యాక్టర్.. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ముందున్న అతిపెద్ద సవాల్.

గ్రహాంతరవాసులతో సాంకేతిక విప్లవం

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, మన పాలపుంత గెలాక్సీలోనే వందల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. విశ్వమంతటా ఇలాంటి గెలాక్సీలు మరెన్నో ఉన్నాయి. గణితశాస్త్ర పరంగా చూస్తే, ఎక్కడో ఒకచోట భూమి లాంటి వాతావరణం ఉండి, అక్కడ జీవం ప్రాణం పోసుకోవడానికి అవకాశాలున్నాయి. మన గెలాక్సీలో మనతో కమ్యూనికేట్ చేయగలిగే నాగరికతలు ఎన్ని ఉండొచ్చో అంచనా వేయడానికి.. డ్రేక్ ఈక్వేషన్ ఉంది. దాని ప్రకారం.. ఏలియన్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయ్. ఇక.. ఏలియన్స్ గనక భూమిని కనిపెట్టి, మనల్ని సంప్రదిస్తే ఏమవుతుందనే దానిపై.. భిన్నమైన అంచనాలున్నాయ్. ఒకవేళ.. ఏలియన్స్ గనక భూమికి వచ్చారంటే.. వారి టెక్నాలజీ మనకు అందనంత స్థాయిలో ఉంటుందని అర్థం. వారి నుంచి క్లీన్ ఎనర్జీ, నయం కాని జబ్బులకు చికిత్సలు, టైమ్ ట్రావెల్ లాంటి రహస్యాలను నేర్చుకునేందుకు వీలుంటుందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. భూమిపై ఉన్న వనరులను ఏలియన్స్ ఆక్రమించుకుంటే పరిస్థితేంటి అనే ఆలోచనలు కూడా ఉన్నాయ్. గ్రహాంతరవాసులు గనక భూమిపైకి వస్తే.. ఇక్కడ ఉన్న ఆచారాలు, వ్యవహారాలు, వ్యవస్థలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోతాయ్. మనిషే అత్యంత తెలివైనవాడు అనే అహంకారం పోయి.. విశ్వం మనం చాలా చిన్న వాళ్లం అనే వాస్తవం అందరికీ అర్థమవుతుంది.

నక్షత్రాల అవతల ఎవరున్నారు?

మన శాస్త్రవేత్తలు.. ఏలియన్స్‌ని రేడియో టెలిస్కోపుల ద్వారా అంతరిక్షం నుంచి వచ్చే వింత శబ్దాలను, సిగ్నల్స్‌ని వింటున్నారు. అంతేకాదు.. సుదూర గ్రహాల వాతావరణంలో ఆక్సిజన్, మీథేన్ లాంటి జీవ సంకేతాలు ఉన్నాయేమో పరిశోధిస్తున్నారు. ఏదేమైనా.. ఏలియన్స్ ఇప్పటికే మనల్ని గమనిస్తూ ఉండొచ్చు. మన సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు. సైన్స్, పరిశోధనలు పెరిగేకొద్దీ.. ఈ సస్పెన్స్ వీడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. కాలం పరుగులో మనిషి సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. సముద్ర గర్భాలను శోధించాం, అణవుని విచ్ఛిన్నం చేశాం. చివరకు అంగారకుడిపైనా రోవర్లను దించాం. అయినప్పటికీ.. అనంతమైన విశ్వంలో.. మనం ఒంటరివాళ్లమేనా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం.. ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

Also Read: హంగ్ మున్సిపాలిటీల్లో హైడ్రామా.. పక్కన పెట్టిన సిద్ధాంతాలు.. పంచుకున్న పదవులు!

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×