BigTV English

Hanuman: ‘హనుమాన్’ అద్భుతః.. ట్రెండింగ్ లో టీజర్..

Hanuman: ‘హనుమాన్’ అద్భుతః.. ట్రెండింగ్ లో టీజర్..


Hanuman: హను-మాన్‌. మామూలుగా లేదు టీజర్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. ఇప్పటికీ ట్రెండింగ్ లో టాప్ 3లో ఉంది. యూట్యూబ్ లో కోటికి పైగా వ్యూస్. నెటిజన్లకు తెగ నచ్చేసింది. సినీ ప్రముఖులను సైతం మెప్పించింది.

డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మపై లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రశంసలు కురిపించారు. హను-మాన్‌ టీజర్‌ చూసిన సింగీతం.. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయన్నారు.


‘హనుమాన్‌ టీజర్‌ చూశా. యానిమేషన్‌, విజువల్స్‌, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌ ఆరంభంలో భారీ ఆకారంలో హనుమంతుడి విగ్రహాన్ని చూస్తుంటే.. నిజంగానే ఆయన్ని చూస్తున్నామా.. అనిపించేలా ఉంది. భక్తిభావం కలుగుతోంది. ప్రశాంత్‌వర్మకు హ్యాట్సాఫ్‌‌. ఇండియన్‌ సినిమాలో ఈ సినిమా ఒక గొప్ప మార్క్‌ సృష్టించనుంది’ అని సింగీతం శ్రీనివాసరావు కొనియాడారు. కోలీవుడ్‌ డైరెక్టర్ అట్లీ కూడా చిత్రబృందం పనితనాన్ని మెచ్చుకున్నారు. విజువల్స్‌ అత్యద్భుతంగా ఉన్నాయని అన్నారు.

అందరూ అంటున్నట్టుగానే హనుమాన్ టీజర్ చాలా బాగుందనే టాక్ తెచ్చుకుంది. విజువలైజేషన్ అయితే హాలీవుడ్ రేంజ్. మ్యూజిక్ సూపర్. ఓపెనింగ్ లోనే రా…రా… అంటూ వచ్చే సౌండ్ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. రాముని స్తోత్రం.. చివర్లో శ్రీరాం అనే నామజపం.. అబ్బో ఎంత చెప్పినా తక్కువే.

టీజర్ ను బట్టి చూస్తే.. యోగ నిద్రలో ఉన్న హనుమంతుడు.. ధ్యానం వీడే సందర్భంలా ఉంది. వీర హనుమాన్ ఓ యువకుడిలో ఆవహించాడో.. లేదంటే ఆ యువకుడే హనుమంతుడి ప్రతిరూపమో. అలా, ఓ విలేజ్ బ్యాక్ డ్రామ్ విలన్లతో హీరో పోరాడే ఘట్టాలతో.. టీజర్ అలరించింది. చివర్లో.. గధ పట్టుకుని.. హీరో అమాంతం గాల్లో ఎగిరిపోవడం.. హైలైట్.

‘జాంబి రెడ్డి’ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యువ నటుడు తేజ సజ్జా కాంబోలో వస్తోన్న సెకండ్ మూవీ ‘హను-మాన్‌’. సూపర్‌హీరో తరహా చిత్రం.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×