E-Paper
Advertisement

ఓట్లు రాలేదు కానీ కోట్లు ఖర్చయ్యాయి.. తెలంగాణ బీజేపీ నేతలకు ‘ఢిల్లీ’ చెమటలు!

ఓట్లు రాలేదు కానీ కోట్లు ఖర్చయ్యాయి.. తెలంగాణ బీజేపీ నేతలకు ‘ఢిల్లీ’ చెమటలు!

Telangana BJP: భారతీయ జనతా పార్టీలో ఏ ఎన్నికలు జరిగినా గెలుపుపోటముల కంటే నేతల్లో టెన్షన్ రేపే అంశం ఆర్ధిక లెక్కలు.. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపధ్యంలో ఎన్నికల నిధుల ఆడిటింగ్ కాషాయపార్టీలో మళ్లీ దుమారం రేపుతోందంట.. ? ఓట్లు పెరగలేదు.. ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు.. ఎన్నికల ఫండ్ ఎక్కడికి పోయిందని పార్టీ అధిష్టానం ఎంక్వైరీ మొదలు పెట్టడంతో కాషాయ క్యాంప్‌లో ఆడిట్ టెన్షన్ పీక్స్‌కు చేరిందంట.. ఇంతకు బీజేపీ ఓడిపోయిందా..? లేకపోతే సొంత పార్టీ నేతలే నిధులు మింగేసి పార్టీని ఓడించారా? అని కాషాయ శ్రేణుల సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి

తెలంగాణ బీజేపీలో కలకలం

తెలంగాణ బీజేపీలో నేతలకు కొత్త సమస్య వచ్చి పడిందట. గత స్థానిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం, నిధులు మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవడం.. ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తుందట. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ఎన్నికల లెక్కలు, ఖర్చుల ఖాతాలు, నేతల పనితీరు అన్నీ స్కానింగ్ అవుతున్నాయట. ఒకరకంగా చెప్పాలంటే ఇది సాధారణ స్కానింగ్ రివ్యూ కాదు పొలిటికల్ ఫోరెన్సిక్ ఆడిట్ అన్నట్టుగా ఉందట. అందుకే ఎన్నికల ఫలితాల సంగతి దేవుడెరుగు కానీ, ఎన్నికల పేరుతో ఖర్చు పెట్టిన పార్టీ ఫండ్ పై జాతీయ నాయకత్వం చేస్తున్న సర్జికల్ స్కానింగ్‌తో రాష్ట్ర బీజేపీ కీలక నేతలకు టెన్షన్ పట్టుకుందట.

ఎన్నికల ఫలితాల షాక్

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసిన నాయకత్వం, తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలతో మరింత సీరియస్ అవుతోందంట. హైకమాండ్ ఒక సారిగా అంత సీరియస్ మోడ్‌లోకి వెళ్లడంతో రాష్ట్ర ఎన్నికల ఫండ్స్ పంపిణీ విషయంలో కీరోల్ పోషించిన నేతలు హైరానా పడుతున్నారంట. డిల్లీ పెద్దలు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫండ్స్ వినియోగంపై కూడా పోస్ట్‌మార్టం మొదలు పెట్టారన్న ప్రచారం ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద రచ్చే రేపుతోందంటున్నారు.

బీజేపీ హైకమాండ్ ఫైర్ మోడ్‌లో!

కోట్లు ఖర్చు పెట్టాం, కానీ ఫలితాలు ఎందుకు రాలేదు.? ఫండ్స్ పంపించాం, ఓట్లు ఎందుకు రాలేదు..? అని సీరియస్‌గా హైకమాండ్.. గత ఎన్నికల్లో పార్టీ ప్రణాళికలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలు, నేతలు, ఇంచార్జుల వ్యవహార శైలీ, బూత్ స్థాయి పరిస్థితులు వంటి అంశాలపై నేరుగా రాష్ట్ర నేతలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలో గ్రౌండ్ లెవల్లో పెట్టిన ఖర్చులకు సంబంధించిన నివేదికలకు, పార్టీ రికార్డులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు తేలిందంట. ఎన్నికల ఫండ్‌కు భారీగా పక్కదారి పట్టినట్లు హై కమాండ్ చేస్తున్న స్కానింగ్ లో బయటపడినట్టుగా తెలుస్తోంది.

ఫండ్స్ ఎక్కడ మాయం అయ్యాయి?

అంతేకాదు ఈసారి ఆడిట్ కేవలం సంఖ్యల, అంకెల గేమ్ లా కాకుండా, సంస్థగత సిస్టమ్ లోపాలపై సర్జికల్ స్ట్రైక్ లా మారిందన్న చర్చ ఆ పార్టీలో జరుగుతుంది. నిధులు నిజంగా ఓటర్లకు చేరాయా..? లేక మధ్యలోనే మాయం అయ్యాయా..? మాయమైతే ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..ఖర్చు చేసిన నిధులు సరైన విధంగా వినియోగించారా?.. అంత ఖర్చుపెట్టినా క్షేత్రస్థాయిలో ఓటర్ కన్వర్షన్ ఎందుకు జరగలేదు..? అన్న అంశాలపై ఇప్పుడు ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకులను నిలదీస్తున్నారంట.

బీజేపీ ఓటమికి అసలు కారణాలివేనా?

పార్టీకి వచ్చిన ఇన్‌పుట్స్ ప్రకారం కొన్ని చోట్ల ఫండ్స్ మళ్లింపులు, కొన్ని చోట్ల గ్రూపిజం, కొన్ని చోట్ల కోఆర్డినేషన్ ఫెయిల్యూర్, మరికొన్ని చోట్ల నేతల మధ్య ఉద్దేశపూర్వక, ఆధిపత్య కుమ్ములాటలు, అధికార, ప్రతిపక్ష పార్టీలతో లాలూచీ, క్యాంప్ రాజకీయాలు జరపడం వంటి అంశాలు రాష్ట్ర బీజేపీని గెలుపుకు దూరం చేసినట్లు హై కమాండ్ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఆధిపత్య పోరే బీజేపీని ఓడించిందా?

అభ్యర్థులు బలంగా ఉన్నా, రిసోర్సులు పుష్కలంగా ఉన్నా, చేతి నిండా ఫండ్ ఉన్నా ఎందుకు ఓడిపోయారు..? ఫలితాలను రాబట్టడంలో ఎందుకు వైఫల్యం చెందారు..? అన్నది ఇప్పుడు బీజేపీలో బిగ్ క్వశ్చన్‌గా మారింది. నేతల మధ్య ఆధిపత్యాల పోరు, పార్టీ కన్నా తమ పదవులను సొంత ప్రయోజనాలకు తాకట్టు పెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారంట. ఆ క్రమంలో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై నితిన్ నబీన్ ఫుల్ ఫోకస్ పెట్టబోతోన్నారన్న టాక్ నడుస్తోంది. రాష్ట్ర పార్టీలో ఈ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై యాక్షన్, పార్టీ కమిటీల్లో భారీ మార్పులు, కొత్త స్ట్రాటజీ ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి.

డిల్లీ ఫోకస్ తెలంగాణపై

ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే రాష్ట్ర నేతల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఉంది. మరోవైపు నితిన్ నబీన్ రాష్ట్ర బీజేపీలో చేస్తున్న నిధుల ఆడిట్ స్కానింగ్ రిపోర్ట్ టీబీజేపీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతోందంటున్నారు. మరి ఢిల్లీ పెద్దల యాక్షన్ ఎలా ఉంటుందో? రాష్ట్ర నేతల ఫేట్ ఎలా మారబోతుందో చూడాలి.

Also Read: వరంగల్ మేయర్ పీఠం.. హస్తం పార్టీలో ‘కుర్చీ’లాట.. గెలిచేది వారసులా? సీనియర్లా?

Story by: Apparao, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×