BigTV English

Telangana Group 4 Jobs : మొదలైన ఉద్యోగాల జాతర..9,168 గ్రూప్-4 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్..

Telangana Group 4 Jobs : మొదలైన ఉద్యోగాల జాతర..9,168 గ్రూప్-4 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్..


Telangana Group 4 Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు ఇదో పెద్ద శుభువార్త. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను మంత్రి హరీషరావు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ రిలీజ్ అవనుందని, పోస్టులు భర్తీ చేయమని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశాలు జారీ చేశామన్నారు హరీష్ రావు. తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర ఇప్పటికే మొదలైంది. లక్షల మంది ప్రిలిమ్స్‌కు క్వాలిఫై అయి దేహదారుడ్య పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. రెండు, మూడు వారాల్లో పోలీస్ ఫిజికల్ టెస్ట్ ఎక్జామ్ స్టార్ట్ కానుంది.

టీఎస్పీఎస్ గ్రూప్-4లో మొత్తం 9,168 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఆర్ధిక శాఖ పోస్టులను భర్తీ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో మరో రెండు వారాల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో 25 శాఖల్లో 91 విభాగాల్లో ఉన్న 6వేల859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, పురపాలక శాఖలో 1862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థిక శాఖలో 429 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అడిట్ విభాగంలో 18 జూనియర్ ఆడిటర్ల పోస్టులను ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయునున్నారు.


గ్రూప్ 4లో ఉన్న ఉద్యోగాలు ఇవే..

జూనియర్ అసిస్టెంట్లు : 6,859
పురపాలక వార్డు అధికారులు : 1,862
జూనియర్ అకౌంటెంట్లు : 429
జూనియర్ ఆడిట్ అధికారులు : 18

ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని. ప్రజల సేవే లక్ష్యంగా ఆయన భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తున్నారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గ్రూప్ 4, పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండడంతో తెలంగాణలో ఉద్యోగ జాతర ఇక మొదలైనట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×