E-Paper
Advertisement

GHMC: ఈ- వేస్ట్ సేకరణకు స్పెషల్ కౌంటర్లు.. బయో వేస్ట్ సేకరణకు త్వరలో స్పషల్ డ్రైవ్!

GHMC: ఈ- వేస్ట్ సేకరణకు స్పెషల్ కౌంటర్లు.. బయో వేస్ట్ సేకరణకు త్వరలో స్పషల్ డ్రైవ్!

GHMC:  తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: పర్యావరణం, మానవాళికి ముప్పు కల్గించే ఈ-వేస్ట్ పై జీహెచ్ఎంసీ స్పషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పాత కంప్యూటర్లు, మోనిటర్లు, ఏసీలు, తదితర ఎలక్ట్రానిక్ వేస్టేజీతో ముప్పుు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ ఇదివరకే ఈ-వేస్ట్ రహిత గ్రేటర్ హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ వేస్ట్ ను సేకరించింది. గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ- వేస్ట్ భారీగా వస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించేందుకు, ఈ వేస్ట్ కల్గి ఉన్న వారు స్వచ్చందంగా ముందుకొచ్చి అప్పగించేలా చర్యలు చేపట్టింది. ఈ వేస్ట్ ను స్వీకరించేందుకు వీలుగా పార్కులు, చెరువుల వద్ద స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే మాసాబ్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కులో ఈ కౌంటర్ ను ఏర్పాటు చేశారు.

ఈ – వేస్ట్ తో  ముప్పు

అంతేగాక, పాతబస్తీలో హైడ్రా ఇటీవలే పునరుద్దరించి, సర్వ హంగులతో అభివృద్ది చెందిన భమృక్ ఉద్దౌలా చెరువు వద్ద కూడా రెండు రోజుల క్రితం ఈ కౌంటర్ ను ఏర్పాటు చేశారు. మంచి ఫలితాలు వస్తుండటంతో వర్కింగ్ వేళల్లో ఆ వేస్ట్ ను స్వీకరించేందుకు మరిన్ని కౌంటర్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇంట్లో పేరుకుపోయే వ్యర్థాల్లో ఈ – వేస్ట్ తో చాలా ముప్పు పొంచి ఉందన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించి, వారు స్వచ్ఛంధంగా అప్పగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుంది. తొలి దశగా రెండు చోట్ల ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ మున్ముందు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలీ, గచ్చిబౌలీ ఐటీ కారిడార్ లో కూడా ఈ కౌంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ వేస్ట్ సేకరణకు సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలి

ఐటీ కారిడార్ లోని పలు ఐటీ సంస్థల్లో పేరుకుపోయిన ఈ వేస్ట్ ను సేకరించేందుకు వీలుగా స్థానిక శానిటేషన్ సిబ్బంది ఐటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కోర్ అర్బన్ రీజియన్ లోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో డైలీ అమలవుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ చేసిన జీహెచ్ఎంసీ ఈ కార్యకమం కింద అన్ని ఏరియాల్లో ఈ వేస్ట్ సేకరణకు సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని కమిషనర్లు ఫీల్డు లెవెల్ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. దీనికి తోడు ఈ వేస్ట్ కన్నా ఇంకా ప్రమాదకరమైన బయో వేస్ట్ ను కూడా సేకరించేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

Also Read: Panchayat Raj: పంచాయతీ రాజ్‌లో కదలని ఫైళ్లు.. ఇన్‌ఛార్జుల పాలనలో కీలక నిర్ణయాలకు బ్రేక్!

ఈ వేస్ట్ ఇచ్చే వారికి ప్రోత్సాహాకాలు

స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ వేస్ట్ ఇచ్చే ప్రజలకు ప్రోత్సాహాకాలు కూడా ఇచ్చే యోచనలో జీహెచ్ఎంసీ ఉన్నట్టు తెలిసింది. ప్రజలిచ్చే ఈ వేస్ట్ పరిమాణాన్ని బట్టి దానికి తగిన విధంగా షాపింగ్ కూపన్లు, నిత్యావసర వస్తుల ధరల కొనుగోలు చేసిన సూపర్ మార్కెట్ కూపన్లు, సెల్ ఫోన్ రీ ఛార్జ్ కూపన్లు వంటివి ఇచ్చే యోచనలో జీహెచ్ఎంసీ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్థికంగా జీహెచ్ఎంసీ పరిస్థితి బాగా లేనందున, ఈ వేస్ట్ ఇచ్చే ప్రజలకు కూపన్లను జారీ చేసే ప్రక్రియకు సంబంధించి కార్పొరేషన్ పై భారం పడకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద పలు బహుళజాతి కంపెనీలతో ఇప్పించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీకి చెందిన అన్ని ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ), విష్పర్ వ్యాలీలో మహాప్రస్థానం స్మశానవాటిక నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఫొనెక్స్ సంస్థతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చెరువులను సీఎస్ఆర్ కింద నిర్వహణ బాధ్యతలను చేపట్టిన ఇతర ప్రైవేటు సంస్థలతో ఈ వేస్ట్ ఇచ్చే ప్రజలకు ప్రోత్సాహాకాలిప్పించేందుకు జీహెచ్ఎంసీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.

బయో వేస్ట్ పై స్పెషల్ ఫోకస్

మహానగరంలో వేల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్ లో ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్న బయో వేస్ట్ ను కూడా ఓ పద్దతి ప్రకారం సేకరించి, సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లలోని బయో వేస్ట్ ను ఆస్పత్రి నిర్వాహకులే సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయాలన్న నిబంధన ఉన్నా, అది సక్రమంగా అమలు కావటం లేదన్న విషయాన్ని జీహెచ్ఎంసీ హెల్త్ వింగ్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. సాధార చెత్తాచెదారంతో కలిసి బయో వేస్ట్ చాలా సార్లు నగరంలోని చెత్త ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు, శివారులోని డంపింగ్ యార్డుకు వచ్చినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ త్వరలోనే హాస్పిటల్ లలో బయో వేస్ట్ సైంటిఫిక్ డిస్పోజ్ అంశంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Also Read: Psychological horror thriller : ఎదుటివాడి మైండ్‌తో ఆడుకునే సైకో దెయ్యం… నవ్వుతూ చచ్చే మనుషులు… జడిపించే సీన్లు

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×