E-Paper
Advertisement

US Failures: హిస్టరీ రిపీట్స్.. ఇరాన్ విషయంలో ట్రంప్ చేస్తున్న పొరపాటు కెన్నెడీ నాటిదేనా?

US Failures: హిస్టరీ రిపీట్స్.. ఇరాన్ విషయంలో ట్రంప్ చేస్తున్న పొరపాటు కెన్నెడీ నాటిదేనా?

US Failures: అమెరికా అంటే అగ్రరాజ్యం, ప్రపంచానికి పెద్దన్న, తిరుగులేని సైనిక శక్తి.. లాంటి అనేక ఎలివేషన్లు ఇప్పటికే మనం వినేశాం. కానీ.. అవన్నీ పేరుకే. అమెరికా గొప్పలకే! హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తున్నట్లుగా.. ప్రపంచంలో ఎక్కడ ఆపద వచ్చినా.. అమెరికా సైన్యం అలా దిగిపోయి.. చిటికెలో సమస్యని పరిష్కరిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ, వాస్తవ చరిత్రను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఆ సూపర్ పవర్ ఇమేజ్ వెనుక అనేక ఘోర పరాజయాలు, అవమానకరమైన వెనకడుగులు దాగి ఉన్నాయ్. కేవలం ఆయుధ సంపత్తి, డాలర్ల బలం మాత్రమే యుద్ధాలను గెలవలేవని.. చరిత్రలో కొన్ని పేజీలు, కీలక ఘట్టాలు మనకు గుర్తు చేస్తాయ్. అగ్రరాజ్యం అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి, గడగడలాడించిన ఆ చిన్నదేశాల కథలేంటో.. ఇప్పుడు చూద్దాం.

అగ్రరాజ్యానికీ అడ్డుకట్టలు

కేవలం సైనిక శక్తి ఒక్కటే విజయానికి హామీ ఇవ్వలేదని చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా.. దేశాధినేతలు ఓ దేశ సంకల్పాన్ని తక్కువ అంచనావేసినప్పుడు.. ఇది బాగా వర్తిస్తుంది. ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేస్తున్న వేళ.. అగ్రరాజ్యం గత పరాభవాలు చర్చకు వస్తున్నాయ్. 1950ల ప్రారంభంలో జరిగిన కొరియా యుద్ధం నుంచి 1954 గ్వాటెమాలన్ తిరుగుబాటు, 1958 లెబనాన్ సంక్షోభం వరకు.. అమెరికా హస్తం ప్రతి చోటా ఉంది. అమెరికా ఓ అగ్రరాజ్యంగా, ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిని కలిగి ఉన్నా.. వియత్నాం వార్, ఇరాక్ యుద్ధం, అప్ఘానిస్థాన్‌లో చూసినట్లు.. గతంలో చాలా వరకు ఘోరంగా విఫలమైన విషయాన్ని గమనించాలి. ఈ ఘర్షణల్లో అమెరికా లక్ష్యం నెరవేరకుండానే పోయింది. అమెరికా మద్దతుతో జరిగిన దండయాత్రలో.. ఆ దేశానికి అత్యంత వేగవంతమైన ఓటమి క్యూబాలోని బే ఆఫ్ పిగ్స్‌లో ఎదురైంది.

అమెరికాకు ఎదురైన చేదు పరాజయాలు

అమెరికా సైనిక చరిత్రలో అతిపెద్ద మాయని మచ్చ వియత్నాం యుద్ధం. అత్యాధునిక యుద్ధ విమానాలు, రసాయన ఆయుధాలు, భారీ ట్యాంకులతో బరిలోకి దిగిన అమెరికాను.. కేవలం గెరిల్లా యుద్ధ తంత్రంతో వియత్ కాంగ్ సైన్యం మట్టికరిపించింది. కమ్యూనిజాన్ని అణచివేసే నెపంతో వియత్నాంలో వేలు పెట్టిన అమెరికాకు అక్కడి దట్టమైన అడవులు, వియత్నాం ప్రజల పట్టుదల శాపంగా మారాయి. ఈ యుద్ధంలో దాదాపు 58 వేల మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఏమీ సాధించలేక, 1975లో సైగాన్ నగరం నుంచి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసి, హెలికాప్టర్లలో పారిపోవాల్సి వచ్చింది. ఇది అగ్రరాజ్యానికి తగిలిన అతిపెద్ద దెబ్బ. 1993లో సోమాలియా అంతర్యుద్ధంలో వేలు పెట్టిన
యూఎస్ దళాలకు ఊహించని షాక్ తగిలింది.

20 ఏళ్ల యుద్ధం… ఫలితం శూన్యం

మొగదిషు యుద్ధంలో సోమాలియా తిరుగుబాటుదారులు అమెరికాకు చెందిన అత్యాధునిక బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చారు. యూఎస్ సైనికుల మృతదేహాలను రోడ్లపై ఈడ్చుకెళ్లారు. దాంతో.. ఏమీ చేయలేక అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది అగ్రరాజ్యం. మన కళ్ల ముందు అమెరికాకు జరిగిన మరో ఘోర పరాభవం అప్ఘానిస్థాన్. 2001లో వార్ ఆన్ టెర్రర్ పేరుతో అప్ఘాన్ గడ్డపై కాలు మోపిన అమెరికా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాటో దళాలను నడిపించింది. దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసి, 20 ఏళ్లు పోరాడితే దక్కిన ఫలితం శూన్యం. 2021 ఆగస్టులో అమెరికా సైన్యం కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఏమీ సంబంధం లేనట్లుగా వెనక్కి వచ్చేసింది. అమెరికా ఏ తాలిబన్లనైతే అంతం చేయాలనుకుందో, అదే తాలిబన్ల చేతికి అధికారాన్ని వదిలేసి రావాల్సి వచ్చింది.

కెన్నెడీ కాలంలో ఘోర వైఫల్యం

అమెరికా మద్దతిచ్చిన సైన్యం 72 గంటల్లోనే లొంగిపోయిన ఘట్టం.. అగ్రరాజ్యపు అత్యంత అవమానకరమైన ఓటముల్లో ఒకటిగా మిగిలిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెన్నెడీ ఉన్నప్పుడు.. క్యూబా నాయకుడు, విప్లవకారుడైన ఫిడెల్ కాస్ట్రో పాలనని కూల్చేందుకు చేసిన విఫల దండయాత్ర ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది. 1961వ సంవత్సరంలో.. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఓ మిషన్ మీద ఉంది. అప్పుడు దాని టార్గెట్ ఒకటే.. క్యూబాలో కాస్ట్రో పాలన స్థానంలో అమెరికాకు మరింత ఆమోదయోగ్యమైన మరో పాలనని తీసుకురావడం. కానీ, అమెరికా జోక్యం చేసుకున్నట్లు ఏమాత్రం అనిపించకూడదు. అయితే, అప్పటికే ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో అమెరికా అపఖ్యాతి పాలైంది. పైగా అది.. కోల్డ్ వార్ టైమ్. ఆ కమ్యూనిస్ట్ దేశంలో, అమెరికా ప్రత్యక్షంగా సైనిక జోక్యం చేసుకుంటే, 1960లలో అమెరికా బద్ధ శత్రువైన సోవియట్ యూనియన్‌తో ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే, వాషింగ్టన్ ఓ సీక్రెట్ ఆపరేషన్‌ని ఎంచుకుంది. అందులో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలోకి.. అమెరికా అదనంగా 7 వేల మంది సైన్యాన్ని, మెరైన్ దళాలను మిడిల్ ఈస్ట్‌లో దించుతోంది. అందుకే, ఆ కాలంలో విఫలమైన దండయాత్ర గురించి ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది.

అమెరికాకు కొత్త తలనొప్పి

1950ల చివరలో జరిగిన విప్లవంతో.. క్యూబాతో అమెరికా శత్రుత్వం మొదలైంది. 1959లో, ఫిడెల్ కాస్ట్రో, అతని గెరిల్లా యోధులు.. అమెరికా మద్దతున్న జనరల్ ఫుల్జెన్సియో బాటిస్టాను కూలదోశారు. విప్లవానికి ముందు.. క్యూబాలో అమెరికన్ కంపెనీల యాజమాన్యంలో.. భారీ షుగర్ ఫార్మ్స్, గనులు, శుద్ధి కర్మాగారాలు, హోటళ్లు ఉండేవి. కాస్ట్రో వీటన్నింటిని వేగంగా మార్చేశాడు. అతను ఆ భూములను, వ్యాపారాలను స్వాధీనం చేసుకున్నాడు. కొత్త కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ద్వేషించిన చాలా మంది సంపన్నులు.. ఫ్లోరిడాకు పారిపోయారు. ఆ తర్వాత.. అతి తక్కువకాలంలోనే కాస్ట్రో సోవియట్ యూనియన్‌కు మరింత దగ్గరయ్యాడు. అమెరికాకు.. ఇదొక పెద్ద ముప్పుగా పరిణమించింది. సోవియట్ యూనియన్‌తో సన్నిహిత సంబంధాలున్న కమ్యూనిస్ట్ దేశం.. తమ పొరుగున ఉండటం, అమెరికా గొంతుపై కత్తి పెట్టినట్లు అనిపించింది. పైగా, ఫిడెల్ కాస్ట్రో ఎంతగానో ప్రభావశీలుడైన నాయకుడు కావడంతో, కమ్యూనిజం లాటిన్ అమెరికా అంతటా వ్యాపిస్తుందనే భయంతో.. అమెరికా వీలైనంత త్వరగా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

బ్రిగేడ్ 2506 ఎలా ఏర్పడింది?

ఫిడెల్ కాస్ట్రోని తొలగించేందుకు అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ డ్వైట్ డి ఐసెన్‌హోర్ ప్రణాళిక రచించారు. 1960లో కాస్ట్రోని తొలగించేందుకు ప్రణాళిక రచించమని ఆయన సీఐఏని ఆదేశించారు. తమ జాడ బయటపడకుండా ఉండేందుకు, ఫ్లోరిడాలోని మయామిలో నివసిస్తన్న క్యూబన్ ప్రవాసులను నియమించుకునేందుకు.. అమెరికా సీఐఏని పురికొల్పింది. వాళ్లు.. తమ దేశాన్ని తిరిగి కోరుకున్నారు. అమెరికా, వారికి గ్వాటెమాల, నికరాగ్వాలలోని రహస్య శిబిరాల్లో.. తుపాకులు, పడవలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చింది. సీఏఐ సుమారు 1400 మంది యోధులతో ఓ దశాన్ని తయారుచేసి, దానికి బ్రిగేడ్ 2506 అని పేరు పెట్టింది.

రెండు దశల ప్లాన్… మధ్యలోనే దెబ్బ

ఈ ప్లాన్‌లో రెండు పార్ట్‌లున్నాయ్. మొదటిది, కాస్ట్రో విమానాలను నాశనం చేసేందుకు క్యూబా ఎయిర్‌పోర్టులపై బాంబులు వేయడం., రెండోది.. క్యూబన్ ప్రవాసులను ఓ సముద్ర తీరంలో దించి, క్యూబాలో పెద్ద తిరుగుబాటు రేకెత్తించడం. క్యూబాపై దాడి చేసే ప్లాన్ రెడీ అవుతున్న సమయంలో, అమెరికాలో నాయకత్వ మార్పు జరిగింది. 1961లో జాన్ ఎఫ్ కెన్నడీ ప్రెసిడెంట్ అయ్యారు. 3 నెలల తర్వాత.. ఆపరేషన్ మొదలుపెట్టారు. 3 క్యూబన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసింది అమెరికా. బాంబులు కొన్ని విమానాలను దెబ్బతీశాయ్ గానీ, చాలా విమానాలకు తగల్లేదు. తన సొంత వైమానిక దళమే తనకు వ్యతిరేకంగా మారిందన్న వాదనని కాస్ట్రో నమ్మలేదు. అమెరికా పన్నాగం ప్రపంచానికి తెలిసిపోతుందేమోనన్న ఆందోళనతో.. కెన్నెడీ రెండో బాంబు దాడిని రద్దు చేశారు.

సహాయం లేక నిలిచిపోయిన సైన్యం

క్యూబాపై వైమానిక దాడి జరిగిన మూడు రోజుల తర్వాత.. దక్షిణ తీరంలోని బే ఆఫ్ పిగ్స్‌లో భూతల దండయాత్ర ప్రారంభమైంది. ఐదు నౌకలు సైనికులను, ట్యాంకులను, సామాగ్రిని మోసుకొచ్చాయ్. విమానాల నుంచి పారాట్రూపర్లు దిగారు. మొదట, ఆ ప్రవాసులు స్థానిక మిలీషియాను వెనక్కి నెట్టారు. బీచ్‌ని స్వాధీనం చేసుకొని, కొన్ని మైళ్ల దూరం లోపలికి వెళ్లారు. కాస్ట్రో కూడా ట్యాంకులు, యుద్ధ విమానాలు, వేలాది మంది సైనికులను పంపాడు. ఆక్రమణదారుల దగ్గర మందుగుండు సామాగ్రి త్వరగా అయిపోయింది. క్యూబన్ ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా.. వారి సరఫరా నౌకలు చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. సముద్ర తీరం నుంచి అమెరికా సాయం కోరారు. కానీ, కెన్నెడీ మరిన్ని ఎయిర్ స్ట్రైక్స్‌ని నిరాకరించారు. ఎందుకంటే, దానివల్ల అమెరికా, క్యూబా మధ్య బహిరంగ యుద్ధం చెలరేగేది. ఈ ఓటమి అమెరికాకు అవమానకరంగా మారిపోయింది.

ఇరాన్‌లో అమెరికాకు కొత్త సవాలు

కానీ, ట్రంప్‌లా కాకుండా, కెన్నడీ ఆ వైఫల్యానికి బహిరంగంగా బాధ్యత వహించారు. అమెరికా దండయాత్ర.. కాస్ట్రోని మరింత గొప్ప వీరుడిగా మార్చింది. శత్రువుని తక్కువ అంచనా వేయడంలో ప్రమాదాన్ని క్యూబా అప్పుడే అర్థమయ్యేలా చెప్పింది. కానీ, ఇరాన్ విషయంలో ట్రంప్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు.. అమెరికా దళాలు మధ్యప్రాచ్యం వైపు కదులుతున్న తరుణంలో.. మరోసారి అవే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఒకవేళ, భూతల దండయాత్ర నిజంగా జరిగినా, అది ఇరాన్‌లో పెద్దగా మార్పు తీసుకొచ్చే అవకాశం లేదు. ఇరాన్ బలమైన ప్రతిఘటనతో దెబ్బతిన్న ట్రంప్, పరువు నిలుపుకునేందుకు మరింత గట్టిగా దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. కానీ, చరిత్ర.. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించినప్పుడు, వికటించే అవకాశం ఉందని చెబుతోంది. ఇప్పుడు గనక అగ్రరాజ్యం తప్పు చేస్తే.. ఇరాన్ దశాబ్దాల పాటు దానిని వెంటాడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

Story by: Anup, Big Tv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×