Bandi Sanjay: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనపై కేంద్రం మంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా ఎన్ని పార్టీలు అయినా పెట్టుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మంచి చేస్తే ఏ పార్టీని అయినా ప్రజలు స్వాగతిస్తారని స్పష్టం చేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఆయన.. దాని డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు.
కాళేశ్వరం కూలిపోవడానికి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీనే బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఇంతవరకూ కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని సైతం బండి సంజయ్ తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. వారిద్దరు కలిసే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
కవిత పార్టీ పెట్టడంపై బండి సంజయ్ కామెంట్స్
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చన్న కేంద్ర మంత్రి
Bandi Sanjay Comments on Kavitha Launching a Party
Union Minister States That Anyone Can Start Any Number of Parties in a Democracy https://t.co/hXZQR6jZra pic.twitter.com/Xp4LaOqGqz
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2026
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి.. ఉత్తరాది రాష్ట్రాల నాయకుడు కాడు’ అంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రికి ఎన్నికల ముందు గుడ్లు, గాడి గుడ్లు గుర్తుకు వస్తాయని మండిపడ్డారు. ఎలక్షన్స్ అయిపోయాక తొండలు, తొక్కేయడాలు గుర్తువస్తాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి.. డైలాగ్స్ చెప్పడం మాని ఆరు గ్యారంటీలపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ సూచించారు. వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని పట్టుబట్టారు. కేంద్రం ఏమిస్తున్నదో తెలంగాణ ప్రజానీకానికి తెలుసుని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఏమాత్రం బాగాలేదని బండి చెప్పుకొచ్చారు.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశం తెరపైకి రాగానే సీఎం రేవంత్ టెన్షన్ పడుతున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్
ఎన్నికలు రాగానే గుండ్లు, గోరీల రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు మాత్రం గుర్తుకు రావడం లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు pic.twitter.com/AmqXBV7Ojr
— ChotaNews App (@ChotaNewsApp) March 28, 2026
Also Read: Noida Airport: అందులోబాటులోకి ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్, అమ్మో.. ఎన్ని సౌకర్యాలో!