Big Stories

Janasena Party Symbol: గ్లాజుగ్లాస్ పోయినట్టేనా..? జనసేన చేస్తున్న తప్పేంటి..?

Janasena Lost Symbol of Glass..?
Janasena Lost Symbol of Glass..?

Janasena Party Symbol: గాజుగ్లాస్.. అంటే జనసేన.. పవన్‌ కల్యాణ్‌ పుణ్యమా అని జనంలోకి సక్సెస్‌ఫుల్‌గా వెళ్లింది ఈ సింబల్. పవన్‌ సినిమా ట్రైలర్‌లో అయినా.. పవన్‌ ప్రసంగాల్లో అయినా.. ఎక్కడైనా కనిపించేది.. వినిపించేది.. గాజుగ్లాస్. లెటెస్ట్‌గా రిలీజైన ఉస్తాద్ భగత్‌సింగ్ ట్రైలర్‌లో కూడా.. పగిలేకొద్ది పదునెక్కుతుంది అంటూ డైలాగ్‌ కూడా పేల్చారు పవన్. పనిలో పనిగా అటు సినిమాకు, ఇటు పార్టీకి పనికి వస్తుంది. మరి అలాంటి గ్లాస్‌.. జనసేనకు కాకుండా పోతుందా? ఇన్నాళ్లు పవన్‌ చేసుకున్న ప్రచారమంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఇంతకీ గాజుగ్లాస్‌ పంచాయితేంటి? అందులో నిజాలేంటి?

- Advertisement -

నిన్నటి నుంచి జరుగుతుంది ఈ రచ్చ.. జనసేనకు గాజుగ్లాస్‌ సింబల్ దక్కలేదు. గాజుగ్లాస్‌ ఫ్రీ సింబల్‌ లిస్ట్‌లో ఉంది. ఇది నిజంగా జనసేనకు షాక్. పవన్‌కు మరో తలనొప్పి మొదలైంది.. ఇలా జరుగుతోంది ప్రచారం.కానీ అసలు నిజాలు వేరే ఉన్నాయి. కాస్త డిటెయిల్‌గా చూస్తే ఇందులోని అసలు విషయాలు బయటపడతాయి.

- Advertisement -

ఏప్రిల్ ఫస్ట్.. అంటే ఈ మంత్ ఫస్ట్‌ రోజున ఏపీ గవర్నమెంట్‌ ఓ గెజిట్ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. అందులో మెన్షన్ చేసింది ఈ డిటేయిల్స్. ఈ లిస్ట్‌లో గుర్తింపు పొంది జాతీయ, ప్రాంతీయ పార్టీలు.. ఎట్ ది సేమ్ టైమ్ గుర్తింపులేని పార్టీల లిస్ట్‌ను కూడా రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఇందులో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు జాబితాలో టీడీపీ, వైసీపీ ఉన్నాయి. టీడీపీకి సైకిల్.. వైసీపీకి ఫ్యాన్‌ సింబల్‌ను అలాట్ చేసింది. జనసేన జస్ట్‌ రిజిస్టర్ జాబితాలో ఉంది కాబట్టి.. గాజుగ్లాస్‌ను ఫ్రీసింబల్స్‌లో జాబితాలో ఉంచింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి పోలింగ్‌ పర్సెంటేజ్ తక్కువగా రావడంతో రిజిస్టర్ పార్టీగానే మిగిలిపోయింది జనసేన. ఇక్కడ మొదలైంది అసలైన పంచాయితీ. సో ఇప్పుడు మళ్లీ ఫ్రెష్‌గా జనసేన పార్టీ సింబల్‌ కోసం అప్లై చేసుకోవాలి. కాంపిటిషన్‌కు ఎవరైనా వస్తే.. గాజు గ్లాస్ దక్కవచ్చు.. లేదా.. దక్కకపోవవచ్చు.

Also Read: దర్శిలో డాక్టర్స్ వార్.. ఓటర్ పల్స్ చిక్కేనా ?

అయితే ఇక్కడే ఓ చిన్న తిరకాసు ఉంది. GAD విడుదల చేసిన గెజిట్‌లో.. ఎలక్షన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా 15 మే 2023లో రిలీజ్‌ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ గెజిట్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఇయర్ జనవరిలో కూడా ఎలక్షన్ కమిషన్‌ ఓ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. దీన్ని నోటిఫికేషన్‌ అనడం కంటే ఏపీ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు రాసిన లెటర్‌ అంటే కరెక్టేమో.. ఇందులో క్లియర్‌గా మెన్షన్‌ చేసింది ఏమనంటే.. జనసేన పార్టీకి వచ్చే ఎన్నికలు అంటే.. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గాజు గ్లాస్‌ గుర్తునే కేటాయించండి అని. సో 2023లో రిలీజైన నోటిఫికేషన్‌ కంటే.. 2024లో విడుదల చేసిన ఆదేశాలే లెటెస్ట్ కాబట్టి.. దీన్నే పరిగణలోకి తీసుకోవాలి. కానీ స్టేట్ ఎలక్షన్‌ కమిషన్ మాత్రం 2023 నోటిఫికేషన్‌ ఆధారంగానే గాజుగ్లాస్‌ను ఫ్రీసింబల్స్‌లో పెట్టింది. ఇప్పుడిదే పెద్ద కన్‌ఫ్యూజన్‌కు కారణమైంది.

ఒక్క జనసేనకు మాత్రమే కాదు.. ఏపీకి చెందిన నీతి నిజాయితీ పార్టీ, ప్రజా ఏక్తా పార్టీ, యుగ తులసీ పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ, రిఫామ్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, సూర్య రేవతి ప్రజా పార్టీ, గోండ్వానా దండకారణ్య పార్టీలకు కూడా గుర్తులను కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్ ఆఫ్‌ ఇండియా. ఈ లెక్కన చూసుకుంటే జనసేన గాజుగ్లాస్‌ గుర్తుకు వచ్చిన నష్టమేమి లేదనే తెలుస్తోంది. కాకపోతే ఈ గెజిట్‌ కాస్త కన్‌ఫ్యూజన్‌కు దారితీసేవే.. కాకపోతే ఇప్పుడు జనసేన నేతలు మళ్లీ ఎలక్షన్‌ కమిషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. మళ్లీ రిక్వెస్ట్ చేయడమో.. గతంలో ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేయడమో చేయాలి. అప్పుడే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

నిజానికి జనసేన గాజుగ్లాస్‌ను కోల్పోవడం ఇదే ఫస్ట్‌ టైమే కాదు. 2023 మేలో కూడా ఇదే సిట్యూవేషన్‌ ఎదురైంది. అప్పుడు కూడా జనసేన పార్టీ గుర్తును కోల్పోయింది. అప్పట్లో జరిగిన బద్వేల్ బైపోల్స్‌లో నవతరం పార్టీకి గాజుగ్లాస్ సింబల్ దక్కింది. అయితే ఆ ఎలక్షన్స్‌లో జనసేన పోటీ చేయలేదు. బీజేపీకి సపోర్ట్ చేసింది.

Also Read: బనగానపల్లిలో కాస్ట్లీ హామీలు.. ఆస్తులు రాసిస్తామంటున్న అభ్యర్థులు

కానీ ఈసారి అలా కాదు.. కూటమిలో 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లు దక్కించుకుంది జనసేన. కూటమి లోగోలో కూడా సైకిల్, కమలం, గ్లాస్‌ దర్శనమిస్తున్నాయి. అదే గ్లాస్‌ బేస్‌గా అనేక డైలాగ్స్‌.. ప్రచారాలు కూడా ప్రజల్లోకి చేరాయి. ఇన్‌ కేస్ ఈ సింబల్‌ను జనసేన కోల్పోతే మాత్రం.. ఓటర్లపై ప్రభావం చూపడం ఖాయం. ఈసీ సింబల్ ఫైనల్ చేయాలి. ఆ సింబల్‌ను మళ్లీ కొత్తగా జనంలోకి తీసుకెళ్లాలి. దాన్ని పబ్లిక్ మైండ్స్‌లో రిజిస్టర్ చేయాలి. కానీ దానికంత సమయం లేదు. ఎలక్షన్స్‌కు కౌంట్‌డౌన్‌ కంటిన్యూ అవుతోంది. షెడ్యూల్‌ ఇప్పటికే వచ్చేసింది. ఇలాంటి సమయంలో వచ్చింది ఈ కుదుపు.

నిజానికి ఇలాంటి సీనే తమిళనాడులో జరిగింది. తమిళనాడులో రిజిస్టర్‌గా పార్టీగా ఉన్న ఓ గుర్తును.. మరో పార్టీకి కేటాయించింది ఎలక్షన్ కమిషన్. దీనికి ఈసీ చెప్పిన రీజన్.. ఎవరు ముందు వస్తే.. వారికే ఇస్తామని. కానీ ఆ పార్టీ న్యాయపోరాటానికి దిగింది. దీంతో పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది. దీంతో ఆ పార్టీకి నష్టం తప్ప మరేం లేదు. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కాబట్టి. సేమ్ ఇదే సీన్‌ ఏపీలో జరిగితే పరిస్థితేంటి? గాజుగ్లాస్‌ను వేరే పార్టీ క్లెయిమ్‌ చేసుకుంటే.. జనసేన అప్పుడు సుప్రీంను ఆశ్రయించినా లాభం ఉండదనే చెప్పాలి. అందుకే జనసేన మేల్కోవాలి.. ఈసీ వద్ద క్లారిఫై తీసుకోవాలి. జనసేనను ఇప్పుడు కాపాడేది.. ఎలక్షన్ కమిషన్‌ జనవరిలో రిలీజ్ చేసిన లెటర్ మాత్రమే. లేదంటే జనసేనకు ఆ పగిలిన గ్లాసే బలంగా గుచ్చుకోవడం ఖాయం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News