BigTV English
Advertisement

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

Delhi Air Pollution: దేశ రాజధాని దిల్లీలో రోజు రోజుకు గాలి కాలుష్యం తీవ్రతరమవుతుంది. వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దిల్లీకి సాయం చేసేందుకు చైనా ముందుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా దిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత తీవ్రంగా పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు.


“చైనా కూడా ఒకప్పుడు తీవ్రమైన వాయు కాలుష్యంతో ఇబ్బంది పడింది. కాలుష్యాన్ని నివారించిన మా ప్రయాణాన్ని భారత్ తో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. భారత్ త్వరలో వాయు కాలుష్యం నివారించే స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నాము” అని యు జింగ్ పోస్ట్ పెట్టారు. గాలి నాణ్యతను వృద్ధి చేసేందుకు చైనా కూడా పోరాడుతుందని, కాలుష్యాన్ని నియంత్రించడంలో తన అనుభవాన్ని పంచుకోవడానికి బీజింగ్ సిద్ధంగా ఉందని తెలిపారు.

చైనా నియంత్రణ చర్యలు

‘ఒకప్పుడు పొగమంచుతో ఇబ్బంది పడిన చైనా, గాలి నాణ్యతను గణనీయంగా పెంచుకునే క్రమంలో విజయాలు సాధించింది. చైనా రాజధాని బీజింగ్‌తో పాటు పలు నగరాలు, పారిశ్రామిక కేంద్రాల్లో కాలుష్యం తీవ్రంగా ఉండేది. చైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని నియంత్రణ చర్యలు తీసుకోవడంతో వాయు కాలుష్యం తగ్గింది. చైనా గాలి నాణ్యత ప్రమాణాలను నిర్దేశించి కచ్చితత్వంగా అమలు చేస్తుంది. వాటిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు విధించింది. దీంతో మహానగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది’ అని యు జింగ్ తెలిపారు.


దిల్లీలో గాలి నాణ్యత ప్రమాణాలు

మంగళవారం దిల్లీలో గాలి నాణ్యత ప్రమాణాలు “తీవ్రమైన” స్థాయిలో ఉన్నాయి. నగరంలో గాలి నాణ్యత AQI 420గా నమోదైంది. అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఆనంద్ విహార్ (403), అశోక్ విహార్ (370) ఉన్నాయి. బవానా, బురారి క్రాసింగ్ రెండూ 390 కంటే ఎక్కువ ఏక్యూఐ స్థాయిలను నమోదు చేశాయి. నోయిడాలో గాలి నాణ్యత క్రమంగా తక్కువగా ఉంది. సెక్టార్ 125 కూడా గాలి నాణ్యతలో దిగజారుతుంది. సెక్టార్ 116లో 357, సెక్టార్ 62 ఏక్యూఐ స్థాయి 323కు చేరింది.

Also Read: TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

ఘజియాబాద్‌లో గాలి నాణ్యత మరింత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ “తీవ్రమైన” గాలి నాణ్యత ప్రమాణాలు(AQI) 420గా నమోదైంది. వసుంధరలో 389 , సంజయ్ నగర్ 360, ఇందిరాపురం 334 ఏక్యూఐ నమోదయ్యాయి. న్యూ దిల్లీలో కలుషిత గాలి పీల్చడం వలన శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని వైద్యులు తెలిపారు. కంటి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, ఉబ్బసం లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Related News

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×