BigTV English

Akhil Akkineni New Look: అయ్యగారు ఏంటి ఇలా అయిపోయారు.. గుర్తుపట్టలేకుండా ఉన్నామే..?

Akhil Akkineni New Look: అయ్యగారు ఏంటి ఇలా అయిపోయారు.. గుర్తుపట్టలేకుండా ఉన్నామే..?
Akhil Akkineni New Look
Akhil Akkineni New Look

Akhil Akkineni New Look Got Viral in Social Media: అక్కినేని నట వారసుడుగా అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. మొదటి సినిమా ఆశించిన ఫలితం అందివ్వలేకపోయింది.దీంతో నాగార్జున కొడుకును రీ.. రీ లాంచ్ చేస్తూనే వచ్చాడు. అలా మూడు సినిమాలు కూడా అఖిల్ కు అంతగా గుర్తింపు రాలేదు. ఇక 2021 లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ కు ఒక హిట్ పడింది. దీంతో ఈ కుర్రాడి సక్సెస్ కు తిరుగులేదు అనుకున్నారు. ఈ సినిమా తరువాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని ఏజెంట్ సినిమాతో వచ్చాడు. దీని మీద అభిమానులు పెట్టుకున్న ఆశలు, అంచనాలు అంతా ఇంతా కాదు.


పాన్ ఇండియా సినిమా, సురేందర్ రెడ్డి డైరెక్టర్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్.. అఖిల్ మంచి ఛాన్స్ పట్టాడు అనుకున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ రెండేళ్లు కష్టపడి బాడీ పెంచాడు. ఇక ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని చవిచూసింది. తలాతోకా లేని కథనం, సరిగ్గా ఎడిటింగ్ లేకుండా ఉండడంతో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. సరే కనీసం ఓటిటీలోనైనా వస్తే చూడొచ్చు అనుకుంటే.. ఇంకా ఈ సినిమా ఓటిటీ వివాదం నడుస్తూనే ఉంది.

Also Read: Family Star: విజయ్ కన్నా ముందు ఫ్యామిలీ స్టార్ కు అనుకున్న హీరో ఎవరో తెలుసా.. ?


ఇవన్నీ పక్కన పెడితే.. ఏజెంట్ తరువాత గ్యాప్ ఇచ్చిన అఖిల్.. బయట ఎక్కడా కనిపించడం లేదు. ఈ మధ్యనే సలార్ సక్సెస్ మీట్ లో కనిపించిన అఖిల్ తాజా ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఇందులో అఖిల్ ను చూస్తే అస్సలు అతనేనా..? అనే అనుమానం కలుగక మానదు. అంతలా బక్కచిక్కి పోయి.. ముఖం మొత్తం లోపలి వెళ్ళిపోయి సన్నగా కనిపించాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ 6 అనౌన్స్ మెంట్ రేపు రానుందని తెలుస్తోంది. సాహోకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ కుమార్ .. అఖిల్ 6 తో డైరెక్టర్ గా మారనున్నాడు. ఈ సినిమా కోసమే అఖిల్ సన్నబడినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా అయ్యగారు మంచి హిట్ ను అందుకుంటారేమో చూడాలి.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×