OTT Movie : ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ‘మిత్ర మండలి’. ఒక అమ్మాయి, నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరిగే ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా, నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీపావళి స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమా, నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ ఆకట్టుకోలేక పోయింది. దాదాపు పది కోట్ల బడ్జెట్ తో 20 కోట్లు మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇక ఓటీటీలో రేపటి నుంచి జరిగే డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ఎలా అదరిస్తారో చూడాలి. ఈ సినిమాని ఏ ఓటీటీ సొంతం చేసుకుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘మిత్రమండలి’ (Mithra Mandali) 2025లో విడుదలైన తెలుగు కామెడీ మూవీ. విజయేందర్ ఎస్. దర్శకత్వంలో ప్రియదర్శితో, నిహారిక ఎన్ఎమ్, విష్ణు, రాగ్ మమూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిశోర్ నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 16న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆ సంస్థ అనౌన్స్ కూడా చేసింది.
Read Also : ఒకే మనిషిని పట్టి పీడించే 4 దెయ్యాలు… దెబ్బకు మనోడి లైఫ్ సెట్టు… ఇలాంటి హర్రర్ మూవీని అస్సలు చూసుండరు భయ్యా
చిన్న పట్టణంలో చైతన్య (ప్రియదర్శి), అతని ఫ్రెండ్స్ (రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్) ఉంటారు. వీళ్లు పార్టీలు, తిరుగుళ్ళతో సరదాగా గడిపే గ్యాంగ్. చైతన్యకు స్వేచ్ఛ (నిహారిక) అంటే ఇష్టం. స్వేచ పెద్ద పాలిటీషియన్ నారాయణ (వీటీవీ గణేష్) కూతురు. స్వేచ్ఛ కూడా పార్టీలు, పబ్ లకు తిరిగే పిల్ల. తండ్రి రూల్స్ ను పెద్దగా పట్టించుకోదు. చైతన్యతో పాటు అతని ఫ్రెండ్స్ కూడా ఆమెను ఇష్టపడతారు. ఈ విషయం తెలిసి స్వేచ్ఛ తండ్రి ఆ గ్యాంగ్ పై కోపం పెంచుకుంటాడు. ఇంతలో స్వేచ్ఛ మిస్సింగ్ అవుతుంది. ఆ గ్యాంగ్ పై కేసు కూడా నమోదవుతుంది. దీంతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇక ఈ కేసును సాల్వ్ చేయడానికి వచ్చే మరో పాత్ర వెన్నెల కిశోర్. ఇతగాడి ఎంట్రీతో కథ మరింత కామెడీ తలుపులు తడుతుంది. క్లైమాక్స్ వరకూ ఈ స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. చివరికి స్వేచ్ఛ మిస్సింగ్ వెనుక కారణం ఏమిటి ? స్వేచ్ఛ ఎవరిని లవ్ చేస్తుంది ? వెన్నెల కిశోర్ వెలుగులోకి తెచ్చే నిజాలు ఏమిటి ? అనే విషయాలను, ఈ కామెడీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.