E-Paper
Advertisement

Tillu Square @ Rs 100 Crore Collections: టిల్లు గాడు చెప్పి మరీ కొట్టాడుగా..? రూ. 100 కోట్ల క్లబ్ కి దగ్గరలో టిల్లు

Tillu Square @ Rs 100 Crore Collections: టిల్లు గాడు చెప్పి మరీ కొట్టాడుగా..? రూ. 100 కోట్ల క్లబ్ కి దగ్గరలో టిల్లు
Tillu Square Collections
Tillu Square Collections

Tillu Square Verge to Hit Rs 100 Crore Mark: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఎన్నో అంచనాల నడుమ మార్చి 29 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సిద్దును పూర్తిగా టిల్లుగా మార్చేసింది. ఏ సినిమా కానీ, ఐపీఎల్ కానీ టిల్లుగాడిని ఆపలేకపోయింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ. 91 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. సిద్దు యాక్టింగ్, అనుపమ అందాలు, నేహాశెట్టి గెస్ట్ రోల్.. వన్ లైన్ పంచ్ లు.. సాంగ్స్.. ఇలా టిల్లు స్క్వేర్ ను విజయపథం వైపు నడిచేలా చేసాయి.

టిల్లు స్క్వేర్ రిలీజ్ అవ్వకముందే నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒక మాట చెప్పాడు. కచ్చితంగా ఈ సినిమా రూ. 100 కోట్ల రికార్డ్ ను క్రియేట్ చేస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే వారం రోజుల్లోనే టిల్లుగాడు రూ. 100 కోట్లు కొట్టేలా ఉన్నాడు. చెప్పి మరీ రికార్డ్ సృష్టించాడు అన్నమాట.

Also Read: Sri Satya: మొన్న బజ్జీల పాప.. నేడు బిగ్ బాస్ పాప.. ఎంతమందికి అన్యాయం చేస్తారు

టిల్లు అభిమానులకు ఎంత నచ్చింది అంటే.. ఈ సినిమాలో కొన్ని తప్పులు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా సినిమా చూసేశారు. నెగెటివ్ రిమార్క్ లు ఎక్కడా కనిపించలేదు అంటే అప్పుడే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సిద్దు కెరీర్ లో మొట్టమొదటిసారి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు. ఇక టిల్లును సిద్దు వదిలేలా లేడు. ఇప్పటికే ఈ సినిమాకు 3 పార్ట్ కూడా ప్రకటించారు. మరి ముందు ముందు టిల్లుగాడు ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×