BigTV English
Advertisement

Balakrishna: ఫ్యాన్స్ కి షాక్ … ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసిన బాలయ్య!

Balakrishna: ఫ్యాన్స్ కి షాక్ … ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసిన బాలయ్య!

Balakrishna: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు? ఈయన చివరిగా డాకు మహారాజ్ (Daku Maharaj)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక త్వరలోనే ఆఖండ 2 (Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.


ఆంధ్ర కింగ్ గా బాలయ్య..

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసి. ఈ సినిమా NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకోబోతోంది. ఇకపోతే తాజాగా బాలకృష్ణకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బాలయ్య ఏకంగా రెండు సినిమాలను రిజెక్ట్ చేశారని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. మరి బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవి అనే విషయానికి వస్తే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా”(Andhra King Taluka). మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.. ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ పాత్రలో ముందుగా బాలయ్యను సంప్రదించారట.

జైలర్ 2 నుంచి తప్పుకున్న బాలకృష్ణ..

ఈ సినిమాలో నటించడానికి బాలకృష్ణ కూడా ఆసక్తి కనబరిచినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలో ఈ సినిమా నుంచి బాలకృష్ణ తప్పుకోవడంతో ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ పాత్రలో కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra) నటించారు. ఇక ఈ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న జైలర్ 2 (Jailer 2)సినిమాని కూడా బాలకృష్ణ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. నిజానికి జైలర్ పార్ట్ 1 సినిమాలోని బాలకృష్ణను భాగం చేయాల్సి ఉండేది. అప్పుడు ఇది కార్యరూపం దాల్చలేదు. దీంతో పార్ట్ 2లో బాలకృష్ణను భాగం చేయడం కోసం దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. అందుకు బాలకృష్ణ కూడా మొదట్లో ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.


ద్విపాత్రాభినయంలో బాలయ్య..

ఈ విధంగా బాలకృష్ణ జైలర్ 2, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాల నుంచి తప్పుకోవడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే బాలకృష్ణ సినిమా పనులతో పాటు రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమాల నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 పనులలో బిజీ కాబోతున్నారు. ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో బాలయ్య ద్వి పాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఇక సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Also Read: Nagarjuna: తెలంగాణ డిప్యూటీ సీఎంతో నాగార్జున భేటీ…అదే కారణమా?

Related News

Raviteja: అప్పుడు హరీష్ శంకర్, ఇప్పుడు భాను భోగవరపు, రవితేజ మళ్ళీ ఆదుకుంటాడా?

Vijay Sethupathi: మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతి.. అప్పుడే షూటింగ్!

Mani Ratnam: మణిరత్నం ను రిజెక్ట్ చేసిన శింబు, థగ్ లైఫ్ ఎఫెక్ట్

Telugu industry : పచ్చళ్ళ పాప రియాలిటీ షో కంటెస్టెంట్, పూసల పాప హీరోయిన్ అంతా సోషల్ మీడియా పుణ్యమే

Akhanda 2  Update: అఖండ ఫస్ట్ సింగిల్ సిద్ధం, దీని కోసమే తమన్ రాజా సాబ్ పక్కన పెట్టేసాడా? 

Kamal Hassan -Rajinikanth: ఇట్స్ ఆఫీసియల్.. కమల్ రజనీకాంబో సినిమా ఫిక్స్.. పోస్ట్ వైరల్!

Pawan Kalyan: స్టైలిష్ పొలిటీషియన్, ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే ఈ లుక్స్?

Big Stories

×