Bowling Action: జెంటిల్ మెన్ గేమ్ గా పేరుపొందిన క్రికెట్ లో ఆటగాళ్లు రకరకాల విన్యాసాలకు పాల్పడుతుంటారు. ఈ క్రికెట్ లో కొంతమంది బౌలర్ల బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. రనప్ తో పాటు బంతిని సంధించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాంటి బౌలర్లకు సంబంధించిన బౌలింగ్ వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
Also Read: WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్
అయితే మనం అలా ప్రపంచంలో ఎన్నో బౌలింగ్ యాక్షన్లు చూసాం. బౌలింగ్ వేసేటప్పుడు ఒక్కొక్క బౌలర్ శైలి ఒక్కోరకం. లాంగ్ రన్ తీసుకుని బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు అయినా.. తక్కువ రనప్ తో వేసే స్పిన్నర్లు అయినా.. ఎవరికి వాళ్ళదే ప్రత్యేకమైన శైలి. ఇలా క్రికెట్ లో విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ తో, విభిన్నమైన శైలితో ఎంతోమంది సక్సెస్ అయ్యారు. అయితే తాజాగా ఓ క్రికెట్ టోర్నమెంట్ లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ శైలితో ఆకట్టుకున్నాడు.
విచిత్రమైన బౌలింగ్ యాక్షన్:
విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ తో ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అతడు ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో బ్యాటర్లకు అర్థం కావడం లేదు. ఈ తికమక బౌలింగ్ తో బాల్ ని అంచనా వేయలేక బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నారు. దీంతో ఈ యువ బౌలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఎడమ చేతితో బాల్ తీసుకున్న ఈ బౌలర్.. చేతులను వెనుకకు, ముందుకు తిప్పుతూ.. ఓ చేతి నుంచి మరో చేతికి మార్చి.. చివరికి తన కుడి చేతితో బౌలింగ్ వేశాడు. ఇదంతా గమనించిన బ్యాటర్ కి ఏం అర్థం కాకపోవడంతో ముందుకి వెళ్లి ఆ బంతిని భారీ షాట్ ఆడెందుకు ప్రయత్నించి వెంటనే స్టంప్ అవుట్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. నిజానికి ఇతడు వేసే బౌలింగ్ స్టైల్ చూస్తే నవ్వి నవ్వి పొట్ట పగిలిపోవడం ఖాయం. ఈ బౌలింగ్ యాక్షన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజెన్లు ఈ బౌలర్ బౌలింగ్ యాక్షన్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: pak vs sa match: గల్లీ క్రికెట్ లాగా మారిన పాకిస్తాన్ మ్యాచ్… బంతి కోసం 30 నిమిషాలు వెతికార్రా !
లెజెండరీ బౌలర్లను మించిపోయాడు:
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, హర్భజన్ సింగ్, అజంతా మెండీస్, అనిల్ కుంబ్లే వంటి బౌలర్లకు డిఫరెంట్ బౌలింగ్ స్టైల్ ఉంది. కానీ వీరందరినీ ఒక మనిషిలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇతడి బౌలింగ్ వీక్షించాల్సిందే. అంతేకాకుండా అతడు బాల్ ని తన చేతి వేళ్ళ నుంచి వదిలే విధానం కూడా మరో రకంగా ఉంది. అసలు ఇలా కూడా బౌలింగ్ చేస్తారా..? ఈ బౌలింగ్ ఎక్కడ నేర్చుకున్నావు..? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. అతడిని నెట్టింట పొగడ్తలతో ముంచేస్తున్నారు. మీరు కూడా అతడి బౌలింగ్ యాక్షన్ పై ఓ లుక్కేయండి.
🚨 MURALI + HARBHAJAN + WARNE + KUMBLE 🚨
– The best bowling action ever! I thought he was a left-hand bowler and then delivered the ball with his right-hand 😅
– Batter got confused, even umpire is shocked 😵💫
– A must watch video 😆pic.twitter.com/FaCWQxI8EX
— Richard Kettleborough (@RichKettle07) November 5, 2025