BigTV English

Nagarjuna replacement demand: బిగ్ బాస్ నాగార్జునను రీప్లేస్ చేయాలని పెరుగుతున్న ఒత్తిడి.. మళ్లీ ఎన్టీఆర్ రావాలని డిమాండ్

Nagarjuna replacement demand: బిగ్ బాస్ నాగార్జునను రీప్లేస్ చేయాలని పెరుగుతున్న ఒత్తిడి.. మళ్లీ ఎన్టీఆర్ రావాలని డిమాండ్

Big boss host Nagarjuna replacement with NTR demand from public: ఎన్నో అంచనాల మధ్య బిగ్ బాస్ 8 సీజన్ మొదలు కానుంది. ఆల్ మోస్ట్ ఇప్పటికే సీజన్ కు సంబంధించిన కంటెస్టెంట్ల వివరాలన్నీ గోప్యంగా ఉంచారు.ఇప్పటిదాకా ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కు ఎంటరయింది. 2017లో మొదలైన ఈ షోకు తొలి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ అలరించారు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, కంటెస్టెంట్లను హుషారెత్తించడంలో మంచి యాక్టివ్ గా వ్యవహరించారు. దీనితో బుల్లితెర వీక్షకులు రెండో సీజన్ కూడా ఎన్టీఆర్ వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తపరిచారు చాలా మంది. అయితే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ తనకున్న బిజీ షెడ్యూల్ ను ఎడ్జెస్ట్ చేయలేక బిగ్ బాస్ 2 ఛాన్స్ వదిలేసుకున్నారు. దీనితో ఆ అవకాశం హీరో నానిని వరించింది. నాని కూడా బాగానే మెప్పించాడు. కానీ ఎన్టీఆర్ అంతగా మెప్పించలేకపోయాడని అసంతృప్తిని వ్యక్తం చేశారు వీక్షకులు.


నాగ్ తో విసిగిపోయారా?

మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున కంటిన్యూగా హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 8వ సీజన్ కూడా హోస్ట్ గా రాబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల చేస్తున్నారు. అయితే మూడో సీజన్ లో చాలా యాక్టివ్ గా కనిపించిన నాగార్జున నాలుగయిదు సీజన్ల వద్దకు వచ్చేసరికి ఫేస్ లో గ్లూమింగ్ తగ్గిందనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా నాగార్జున కనిపించేసరికి వీక్షకులలో ఓ రకమైన మొనాటినీ వచ్చిందంటున్నారు. పైగా నాగార్జున కంటెస్టెంట్లతో ఆడించే ఆటలన్నీ రొటీన్ గా ఉంటున్నాయని..కొత్తగా ఏమీ ట్రై చేయడం లేదని విమర్శిస్తున్నారు. వారాంతరంలో శని, ఆదివారాలు కనిపించే నాగార్జును శనివారం మొత్తంలో సగానికి పైగా శుక్రవారం ఎపిసోడ్లు చూపించి కాలక్షేపం చేస్తున్నారని..ఒకరిద్దరికి క్లాసులు తీసుకునేసరికి టైమ్ కాస్తా అయిపోతోందని అంటున్నారు.


రేటింగ్ తగ్గితే పరిస్థితి ఏమిటి?

కంటెస్టెంట్లు తప్పు చేస్తే గట్టిగా నిలదీయలేకపోతున్నారని..వారిపై ప్రశ్నలు సంధించలేకపోతున్నారని నాగ్ పై విమర్శకులు విరుచుకుపడుతున్నారు. అయితే రేటింగ్ కూడా సీజన్ సీజన్ కూ పడిపోవడంతో నాగ్ ను ఎలాగైనా తప్పించే యోచన చేస్తున్నారు నిర్వాహకులు. అయితే బహుశా ఈ సీజన్ కాకపోవచ్చు. వచ్చే సీజన్ 9కి ఎవరైనా అగ్ర హరోకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందనే డిమాండ్ ఊపందుకుంది. అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.

ఎన్టీఆర్ రావాలని ..

ఇప్పటిదాకా బిగ్ బాస్ హోస్ట్ లుకా నిర్వహించిన నాని, నాగార్జున కన్నా ఎక్కువ శాతం జూనియర్ ఎన్టీఆర్ నే కోరుకుంటున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ సీజన్ లోనే రేటింగ్ పడిపోయినట్లయితే వెంటనే జూనియర్ ని లైన్ లో పెట్టాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దేవర మూవీ కంప్లీట్ చేసే మూడ్ లో ఉన్న ఎన్టీఆర్ తర్వాత మూవీ ఇంకా అప్ డేట్ అవ్వలేదు. ప్రశాంత్ నీల్ తో మూవీ అని ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాప్ లో బిగ్ బాస్ హోస్ట్ గా ఒప్పిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.

 

Related News

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 రాకకు సర్వం సిద్ధం… లాంచింగ్ ఎపిసోడ్ ఆరోజే!

Bigg Boss 9: అగ్నిపరీక్ష ప్రోమో రిలీజ్.. బలపరీక్షలో కసితీరా?

Bigg Boss 9 Telugu : జానీ మాస్టర్ అసిస్టెంట్ కు పోటీగా వెంకీ గర్ల్ ఫ్రెండ్..రచ్చ రచ్చే..

Navadeep: తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఐయామ్ సారీ అంటూ నవదీప్ వీడియో

Bigg Boss telugu: నన్ను దూరం పెట్టారు.. అతడే జడ్జ్ గా ఎందుకు?

DMart Offers: ఆ వస్తువులు సగం ధరలకే, డిమార్ట్ వినాయక చవితి బంపర్ ఆఫర్!

Big Stories

×