BigTV English

Bigg Boss 9: అగ్నిపరీక్ష ప్రోమో రిలీజ్.. బలపరీక్షలో కసితీరా?

Bigg Boss 9: అగ్నిపరీక్ష ప్రోమో రిలీజ్.. బలపరీక్షలో కసితీరా?

Bigg Boss 9:బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో కొత్త సీజన్ సిద్ధమయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 5 మంది సామాన్యులను హౌస్ లోకి పంపించబోతున్నారు.. అయితే హౌస్ లోకి వెళ్లే ముందు.. వీరి క్యారెక్టర్ పొరలను తొలగిస్తూ.. వీరేంటో ప్రజలకు తెలిసేలా చేసి ఆ తర్వాత హౌస్ లోకి తీసుకోబోతున్నామని ఇటీవల అగ్నిపరీక్ష జడ్జెస్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ అగ్ని పరీక్ష షోకి సంబంధించి ఏడవ ఎపిసోడ్ రెండవ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకులను ఇప్పుడు ఆకట్టుకుంటుంది.


అగ్నిపరీక్ష లేటెస్ట్ ప్రోమో రిలీజ్..

తాజాగా అగ్నిపరీక్ష ఏడవ ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ ప్రోమో విషయానికి వస్తే.. ఇందులో చూపుడువేలు సహాయంతో తాడుకు వేలాడదీసిన మట్టి కుండలను హ్యాండిల్ చేయాలి అని శ్రీముఖి టాస్క్ గురించి వివరిస్తుంది. ఆమె మాట్లాడుతూ.. “ఇక్కడ ఒకటి నుంచి 11 నంబర్లు కలిగిన కుండలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో కుండను చూపుడువేలు సహాయంతో హ్యాండిల్ చేయాలి. బరువు మోయలేని వారు కుండను కింద పడేయాలి. అప్పుడు పగిలిన కుండలో ఉండే ఫోటోని ప్యానెల్ బోర్డు పై నుండి తొలగించడం జరుగుతుంది” అంటూ టాస్క్ వివరిస్తుంది. అలా ఒక్కొక్కరు అతి కష్టం మీద కుండలను మోసి చివరికి మోయలేక ఒక్కొక్కటిగా పగలగొడతారు. అయితే ఇక్కడ కుండలను వీరు పగలగొట్టిన తీరు చూస్తే ఈ అగ్ని పరీక్షలో బలపరీక్ష చాలా గట్టిగా సాగుతోంది.. కసి తరా కుండలను పగలకొడుతూ టాస్క్ విన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే వీళ్ళు సామాన్యులు కాదు.. అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి వ్యక్తులు హౌస్ లోకి వెళ్తే అక్కడ ఇంకెలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.


అగ్నిపరీక్ష షో విశేషాలు..

అగ్నిపరీక్ష షో విషయానికి వస్తే.. దాదాపు 20వేలకు పైగా అప్లికేషన్లు బిగ్ బాస్ సీజన్ హౌస్ లోకి వెళ్లడానికి సామాన్యుల నుంచి వచ్చాయి. అందరిని పలు టెస్టుల ద్వారా ఫిల్టర్ చేసి 45 మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు వీరికి అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది ఈ కార్యక్రమం. దీనికి బిగ్ బాస్ మాజీ విన్నర్స్ బిందు మాధవి, అభిజిత్ తో పాటు బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ నవదీప్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా పలు రకాల టెస్టులు పెట్టి ఈ 45 మందిలో ఐదు మందిని ఎంపిక చేసి హౌస్ లోకి పంపించబోతున్నారు. మరి ఈ అగ్ని పరీక్షలో అగ్నిపరీక్షను నెగ్గి హౌస్ లోకి వెళ్లే ఆ 5 మంది అదృష్టవంతులు ఎవరో చూడాలి.

also read:Pa.Ranjith: ఆస్కార్ ఎంట్రీ పొందిన పా.రంజిత్ మూవీ.. తొలి సినిమాగా రికార్డ్!

Related News

Duvvada Madhuri : పడుకుంటున్న సీజన్ లేపడానికి వచ్చిన దేవత, ఎవరిని విడిచిపెట్టని దువ్వాడ మాధురి

Bigg Boss 9 Promo: మొదలైన నామినేషన్స్ రచ్చ.. ఎలిమినేషన్ వారి చేతుల్లోనే!

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ హౌస్‌కు నిప్పు పెట్టిన దివ్వెల.. రచ్చ చేసి.. ఏడ్చేసి.. వామ్మో మహానటి!

Bigg Boss 9 Telugu : మొదటి రోజే హౌస్ లో పచ్చళ్ళ పాప రచ్చ.. ఇలా అయితే కష్టమే..!

Bigg Boss 9: నాన్న ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయా..రమ్య ఎమోషనల్!

Bigg Boss 9: 5 వారాలకు గానూ.. ఫ్లోరా, శ్రీజ దమ్ము ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss Buzzz Srija : నేను గ్రూపు దగ్గర కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోయే వాళ్ళు, ప్లాన్డ్ గా లవ్ యాంగిల్ నడిపాడు

Bigg Boss 9 Wild Card : తమిళ్ బిగ్ బాస్ లో 65 రోజులు ఉన్నా, ఈ లోపు నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో…

Big Stories

×