Navadeep: నవదీప్(Navadeep) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. హీరోగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈయన అనంతరం మరికొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న నవదీప్ బిగ్ బాస్(Bigg Boss) సీజన్ వన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9)ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈసారి కొత్తగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష (Bigg Boss Agnipariksha)అంటూ కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఎంపికైన వారికి టాస్కులను నిర్వహిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
నోరు జారిన నవదీప్…
ఇక ఈ కార్యక్రమానికి బిందు మాధవి, అభిజిత్ తో పాటు నవదీప్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగవ ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్ దమ్ము శ్రీజ(Dammu Sreeja) విషయంలో నవదీప కాస్త మాట జారారు. ఇందులో భాగంగా ఒక టాస్క్ లో శ్రీముఖి టాస్క్ గురించి సరిగా వివరణ ఇవ్వకపోవడంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీముఖి ఎవరికైనా అన్ ఫెయిర్ అనిపించిందా అనడంతో దమ్ము శ్రీజ చేయి పైకెత్తుతుంది వెంటనే నవదీప్ తనని వేదిక పైకి పిలిచి ఎందుకు అన్ ఫెయిర్ గా అనిపించింది అంటూ ప్రశ్నించారు.
ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్…
ఈ ప్రశ్నకు శ్రీజ తన వివరణ ఇచ్చింది శ్రీముఖి సరిగా వివరించకపోవడం వల్లే అంటూ ధైర్యంగా శ్రీజ సమాధానం చెప్పడంతో నవదీప్ కోపడుతూ.. నువ్వు అతిగా ఆలోచించొద్దు బిగ్ బాస్ చాలా భాషలలో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్ ఫెయిర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు వెళ్లి కూర్చో అంటూ కాస్త చులకనగా మాట్లాడారు. దీంతో నవదీప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఊరి నుంచి వచ్చిన వాళ్లంటే ఎందుకంత చులకన అంటూ చాలామంది విమర్శలు కురిపించారు. అయితే తాజాగా ఈ విమర్శలపై నవదీప్ స్పందిస్తూ తన వివరణ ఇవ్వటమే కాకుండా క్షమాపణలు కూడా తెలియజేశారు.
?igsh=YWJyOTV1c25pa3g=
బిగ్ బాస్ హౌస్లోకి కామన్ మ్యాన్ వెళ్తే వారిపై సెలబ్రిటీలు డామినేట్ చేస్తూ కనీసం వారు ఓటింగ్ కు వెళ్లే అవకాశాన్ని కూడా ఇవ్వరు. అందుకే అగ్ని పరీక్ష అంటూ సామాన్యులను ఇక్కడ మీ అందరికీ పరిచయం చేయటం వల్లే వారి గురించి మీకు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో లాగే ఇక్కడ కూడా టాస్కులు ఇస్తాము. ఈ సమయంలోనే తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి అయితే నేను తప్పుగా మాట్లాడానని అందరూ భావిస్తున్నారు. ఐ యాం సారీ..నేను పల్లెటూరు నుంచి వచ్చావని అనలేదు ఊరు నుంచి వచ్చావు అని మాత్రమే అన్నాను అది ఏ ఊరైన కావచ్చు. ఈ విషయం గురించి ఇంతలా ఆలోచించాల్సిన పనిలేదు. అది ఒక షో మాత్రమే షోలాగే ఎంజాయ్ చేయండి అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Jayammu Nischayammu raa: నాని క్లాస్ లో అలాంటి పని చేసేవాడా..బిగ్ సీక్రెట్ బయటపెట్టిన టీచర్!