BigTV English

Hyderabad Weather: హైదరాబాదీలకు అలర్ట్.. నాలుగు రోజులు వర్షాలే

Hyderabad Weather: హైదరాబాదీలకు అలర్ట్.. నాలుగు రోజులు వర్షాలే

IMD Predicts Heavy Rains for Hyderabad: రెండురోజులు హైదరాబాద్ లో కాసిన ఎండలు వేసవిని గుర్తుచేశాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. తాజాగా భారత వాతావరణ విభాగం హైదరాబాదీలకు కూల్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజులపాటు నగరంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ రోజు నుంచి ఆగస్టు 17వ తేదీ వరకూ నగరంలో అక్కడక్కడా జల్లులు పడతాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.


హైదరాబాద్ లోనే కాదు.. తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, హన్మకొండ, ములుగు, ఎం. మల్కాజిగిరి, జనగాం, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు సైతం ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అత్యధికంగా మహబూబాబాద్ లో 93.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ లోని మారేడ్ పల్లిలో అత్యధికంగా 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ తెలిపింది. ఐఎండీ అంచనా ప్రకారం.. రానున్న నాలుగు రోజుల్లో హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


Related News

Rain update: అత్యంత భారీ వర్షాలు.. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండండి..!

KTR Bandi Sanjay Meet: బండి సంజయ్, కేటీఆర్‌లను కలిపిన వరద.. ఇద్దరి మాటలు వింటే నవ్వులే నవ్వుల్

Pocharam Dam: డేంజర్‌లో పోచారం డ్యామ్.. 10 ఊర్లు ఖతమ్..!

Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

Kamareddy floods: తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం, రెసిడెన్షియల్ విద్యార్థులు సేఫ్

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Big Stories

×