CM RevanthReddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ హైదరాబాద్ చేరుకుంది. బుధవారం ఉదయం 12 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్ టీమ్‌కు ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చేపట్టిన టూర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్‌ఖుషీగా ఉన్నాయి. డప్పు చప్పుళ్ల మధ్య పూల బొకేలు, శాలువాలతో ఆయన్ను ముంచెత్తారు. చిరునవ్వులతో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు సీఎం.
తెలంగాణకు పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా ఆగష్టు రెండున సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా, దక్షిణ కొరియాకు బయలుదేరింది. 10 రోజులపాటు అమెరికాలో పర్యటించిన ముఖ్యమంత్రి, వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరికొన్ని కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పర్యటనకు వస్తామని చెప్పారు. దాదాపు 40 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనంతరం అక్కడి నుంచి దక్షిణకొరియా వెళ్లారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తాయని అక్కడి వ్యాపారవేత్తలు చెప్పారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇదేమీ పోటీ పర్యటన కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసమే మా ప్రయత్న మన్నారు. రెండుసార్లు వారు ఫ్లాప్ అయ్యారని, అయినా బుద్ధి రాలేదు. ఇలాగే మాట్లాడితే మరోసారి ఫ్లాప్ అవ్వడం ఖాయమన్నారు. మా పర్యటనలపై బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
ALSO READ: కమలంలో కలహాలు? ఆ పదవి కోసం పంతం, రేసులో కొత్త పేరు
ఫారెన్ టూర్ ఫ్లాప్ షో అన్న బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో కౌంటరిచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు. అమర్ రాజా బయటకు వెళ్తోందని వారికేమైనా చెప్పిందా? అంటూ ప్రశ్నించారు. ఆనాడు ఆ కంపెనీని అక్కడ నుంచి పంపిస్తే.. ఇక్కడకు వచ్చారని, బీఆర్ఎస్ ఏమీ తీసుకురాలేదన్నారు. పరిశ్రమలకు సంబంధించి
అన్ని సదుపాయాలు కల్పిస్తామని, వారికి విశ్వాసం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి. మొత్తానికి రేవంత్‌రెడ్డి టీమ్ ఫారెన్ టూర్ సక్సెస్ అయ్యింది.
Chief Minister Revanth Reddy returns to Hyderabad after foreign visit and received a rousing welcome from his supporters.#TelanganaCM #RevanthReddy received a rousing welcome from his supporters, MPs and MLAs at RGIA airport in #Hyderabad.
Revanth Reddy returned to Hyderabad… pic.twitter.com/LAddAn7EO1
— Surya Reddy (@jsuryareddy) August 14, 2024
బీఆర్ఎస్ రెండుసార్లు ఫ్లాప్ అయ్యింది.. అయినా బుద్ధి రాలేదు.
ఇలాగే మాట్లాడితే మరోసారి ఫ్లాప్ అవ్వడం ఖాయం.
మా పర్యటనలపై బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోంది.
ఇదేమీ పోటీ పర్యటన కాదు.. రాష్ట్ర అభివృద్ధి కోసమే మా ప్రయత్నం.#CMrevanthreddy #MinisterSridharBabu #Congress #RevanthReddy… pic.twitter.com/W1LyuKxvVK
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2024