Bigg Boss 9 Telugu: తెలుగు బుల్లితెరపై టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత సీజన్లో తో పోలిస్తే ఈ సీజన్ సరికొత్తగా ఉండబోతుందంటూ రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమో ను చూస్తే తెలుస్తుంది. ఇక ఇప్పటికే ‘అగ్ని పరీక్ష’ పేరుతో ఆన్‌లైన్ ద్వారా వచ్చిన అప్లికేషన్ల నుంచి 45 మంది సామాన్యులను సెలక్ట్ చేసిన బిగ్ బాస్, అందులో 15 మందిని ఫైనల్ చేసింది.. అందులో నుంచి కేవలం 9 మంది మాత్రమే హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అగ్నిపరీక్ష పై ఇటు నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.. ఇక హౌస్ లోకి రాబోతున్న కంటెస్టెంట్లలో హీరోయిన్లు కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో వెంకీ మామ హీరోయిన్ కూడా ఉందని టాక్.. ఆమె ఎవరు?బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
‘నువ్వు నాకు నచ్చావ్’ వెంకీ గర్ల్ ఫ్రెండ్..
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ఒకటి నువ్వు నాకు నచ్చావు. ఈ మూవీ లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కి ఫ్రెండ్ గా ఆషా నటించింది. ఆషా సైనీ కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కంటెస్టెంట్‌గా రాబోతున్నట్టుగా టాక్ వినబడుతోంది. రాజశేఖర్ ‘మనసున్న మారాజు’, జగపతి బాబు ‘సర్దుకుపోదాం రండి’, శ్రీకాంత్ ‘ఓ చినదాన’, ‘143’ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది ఫ్లోరా సైనీ.. అయితే ఈమె ఈ మధ్య తెలుగులో సినిమాలు చేయలేదు కానీ.. హిందీలో మాత్రం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కొన్ని సాప్ట్ పోర్న్ వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించిన ఆషా సైనీ, మయూరీగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అసలు పేరు ఫ్లోరా సైనీ అంటూ స్క్రీన్ నేమ్ మార్చుకుంది. ఈమె బిగ్ బాస్ లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: లేడీ గెటప్స్ తో నవ్వించే వినోద్ జీవితంలో విషాదం.. సూసైడ్ చేసుకోవాలి ఫిక్స్..
జానీ మాస్టర్ గర్ల్ ఫ్రెండ్ vs ఆషా…
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అసిస్టెంట్ శ్రేష్ట వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జానీ మాస్టర్ గురించి సంచలన ఆరోపణలు చేసిన శ్రేష్టి వర్మ, గత ఏడాది వార్తల్లో నిలిచింది. దీంతో శ్రేష్టి వర్మ, బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.. ఇప్పుడు ఈమెకు పోటీగా ఆషా రాబోతుంది. ఒకరేమో గ్లామర్ క్వీన్.. మరొకరేమో డాన్స్ లో క్వీన్.. వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటే బాగుంటుందని బిగ్ బాస్ అభిమానులు కోరుకుంటున్నారు. అదే కనుక జరిగితే రేటింగ్ మాత్రం ఓ రేంజ్కి వెళ్ళిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు కాంట్రవర్సిటీలను హౌస్ లోకి తీసుకురావడంతో కంటెంట్ లో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని కొందరు ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. అటు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలోని నటీనటులు కూడా ఈ షోలో కంటెస్టెంట్లుగా రాబోతున్నారు. ఈనెల ఆఖరిలో ఈ షోలోకి రాబోతున్న కంటెస్టెంట్ల లిస్టు విడుదల కాబోతుందని సమాచారం…