Bigg Boss 9 Telugu Day 48 Episode: వీకెండ్ ఎపిసోడ్ అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ శనివారం ఎపిసోడ్ కి హోస్ట్ నాగార్జున వచ్చిన హౌజ్ మేట్స్ ఉన్న భేదాభిప్రాయాలు తీసేశారు. అంతేకాదు అనవసరం నోరు పారేసుకుంటున్న వారి నోటిక తాళం వేశారు. స్నేహితుల మధ్య మనస్పర్థలు తీసేశారు. స్నేహితులు అంటూ చెప్పుకుని వెన్నుపోటు పొడుస్తున్నవారి బండారం బయటపెట్టారు. ఇలా నేటి ఎపిసోడ కూల్ గా సింగిల్ టాస్క్ తో సాగింది.
బిగ్ బాస్ కి బాండ్స్ కోసం రాలేదంటూనే పిక్కిల్స్ పాప రమ్య మోక్ష బాండ్స్ కోసం చూస్తోంది. మాధురిని మీరు నాతో ప్రేమ ఎందుకు చూపించడం లేదంటే.. బాండ్స్ కోసం రాలేదుగా.. ఆట ముఖ్యం కదా వెళ్లి సాయితో ఆడుకో అంటుంది. అలాగే సాయి.. తనూజ, రమ్యలతో మాధురి మాట ఎందుకు వింటున్నారని చెప్పాడట. ఈ విషయం తెలిసి మాధురి సాయిని మొఖం మీదే అడిగేసింది. సాయికి ఎప్పుడు నేరుగా కాకుండా వెనకా చెప్పడం అలవాటేమో అంటూ వెంటనే బయట పెటేసింది. అలా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని సాయి, అలా లేకపోతే వెనకాల మాటలేంటని మాధురి ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. ఆ నాగార్జున వచ్చేసారు. ఎవరిపై ఎలాంటి అభిప్రాయం, హౌజ్ లో వారి తీరు ఏంటన్నది బోర్డుపై ఉన్న పదాలతో వెల్లడించమని చెప్పాడు.
ఈ టాస్క్ ని రమ్య మోక్షతో మొదలైంది. వచ్చినప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా ఉందంటూ మాధురికి ఫేక్ బాండ్స్ బోర్డు వేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు ఒక స్టాండ్ పై ఉండదు.. అందరిని ప్రభావం ( ఇన్ప్లూయేన్స్) చేయాలని చూస్తుందంటూ రమ్యకు మానిప్లేటర్ బోర్డు వేసింది తనూజ. ఆ తర్వాత డిమోన్.. పవన్ ఇమ్మెచ్చ్యుర్ బోర్డు వేశాడు. ఆ తర్వాత ఇమ్మాన్యేల్.. కళ్యాణ్ కి ఫ్లిప్పర్ బోర్డు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందంటూ రీతూ..మాధురికి ఫౌల్ మౌథర్డ్ బోర్డు వేస్తుంది. జుట్టపట్టి నెలకేసి కొడతా అంటూ రీతూపై నోరుపారేసుకున్న మాధురికి నాగ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. బయట నువ్వు తోపు అయితే బయట చూసుకో అమ్మా.. బిగ్ బాస్ హౌజ్ లో కాదని ఫైర్ అయ్యారు. తర్వాత రాము రోథోడ్ నిఖిల్ కి బోర్ బోర్డు వేశాడు. ఆ తర్వాత సంజన.. మాధురికి ఇన్సెక్యూర్ (అభద్రత భ భావం) బోర్డు, సుమన్ శెట్టి.. రాము రాథోడ కి స్టాంట్చ్యూ, కళ్యాణ్, తన శక్తి ఏంటో తెలుసుకోకుండ ఇంకా గేమ్ లో పూర్తి రాలేదు, వచ్చి ఆడాలంటూ నిఖిల్ కి ఇన్విజుబుల్ (కనిపించడం లేదు) బోర్డుని వేశాడు.
మధ్యలో నాగ్ తనూజకి క్లాస్ పీకాడు. రాము రాథోడ్ మనిషిలా కనిపించడం లేదా.. మెతకగా ఉన్నాడని చూలక అంటూ తను చేసిన తప్పుని వీడియోతో సహా చూపించాడు. వాంటెడ్ పేట టాస్క్ లో తనూజ, సాయి, రీతూ మాట్లాడుకుంటుండగా.. రాము రాథోడ్ మధ్యలో వెళ్లి కూర్చోగానే.. తనూజ అసహనంతో అక్కడి నుంచి రీతూ, సాయిని తీసుకుని వెళ్లి రాముని అవమాన పరుస్తుంది. ఇది కరెక్ట్ కాదని, మనుషులకు వాల్యూ ఇవ్వాలంటూ తనూజ చీవాట్లు పెట్టాడు. ఆ తర్వాత నిఖిల్.. మాధురికి ఇగోస్టిక్ (గర్వం), గౌరవ్, సంజనకు అటెన్షన్ సీకర్ ట్యాగ్. రాము రాథోడ్ కి స్టూపిడ్ ట్యాగ్ బోర్డుని వేసింది దివ్య. ఇక టాస్క్ పూర్తయ్యేసరికి అందరికంటే ఎక్కువ బోర్డ్స్ ఉన్న మాధురికి హౌజ్ మేట్స్ లోనే ఒకరి నుంచి పనిష్మెంట్ ఉండబోతోంది. ఇక ఈ టాస్క్ లో ఒక్క బోర్డు కూడా రాని తనూజ, సాయి, రీతూ, సుమన్ శెట్టి, గౌరవ్ , దివ్యలకు.. దువ్వాడ మాధురి కొల్పోయిన గోల్డెన్ బజర్ పవర్ అస్ట్రా టాస్క్ రేపు జరగనుంది.
ఈ ఆరుగురిలో ఆల్రేడీ ఇమ్యునిటీ పవర్ ఉందని సాయి, గేమ్ పై ఫుల్ క్లారిటీ ఉండాలనే కారణాలతో గౌరవ్ లను తొలగించారు. రేపు ఆదివారం తనూజ, రీతూ, దివ్య, సుమన్ శెట్టిల మధ్య ఈ గొల్డెన్ బజర్ పొందేందుకు టాస్క్ జరగనుంది. అందులో గెలిచిన వాళ్లు ఎక్కువ బోర్డులు వచ్చిన మాధురికి పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే టాస్క్ మధ్యలో సంజననకు నాగార్జున ఫుల్ క్లాస్ పీకారు. బయట ఆడియన్స్ లో ఉన్న తన ఫ్యాన్ తో సంజన ఆట బాగాలేదని చెప్పించి సంజనకు షాకిచ్చాడు. గత వారం దివ్యపై రోడ్ రోలార్, ఫ్యాట్ అంటూ సైగలు చేసిన వీడియో చూపించి అలా కామెంట్స్ అసలు సహించలేనివని, నోరు అదుపులో పెట్టుకోవాలంటూ లైవ్ లోనే దివ్యకు సారీ చెప్పించాడు నాగార్జున. కానీ, దివ్య మాత్రం ఇలాంటివి సరద కాదని, సంజన సారీ తాను యాక్సెప్ట్ చేయనని మొహం మీదే చెప్పేసింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ గుట్టు బయటపెట్టాడు నాగార్జున. నామినేషన్ తర్వాత తనూజ జన్యున్ కాదంటూ కళ్యాణ్ కి వివరిస్తున్న వీడియోని ప్లే చేశాడు. ఇందులో తను ఏంటో చూడు.. ఎన్నో సందర్భాల్లో తనకు స్టాండ్ తీసుకున్నాను. నీళ్లు పోసి చచ్చిపోతున్న మొక్కను బతికించాను. కానీ తను జన్యున్ లేదు, రేపటి నుంచి తన ఆట చూడంటూ కళ్యాణ్ తో అంటున్న వీడియో చూపించి తనూజకు ఇమ్మాన్యుయేల్ నిజస్వరూపం బయటపెట్టాడు. అది చూసి తనూజ షాక్ లో ఉండిపోయింది.