Bigg Boss 9 Day 48 Promo 2: బిగ్ బాస్ వీకెండ్ వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ కి కొదువే ఉండదు. వీకెండ్ అంటే నాగార్జున వచ్చేస్తారు. హౌజ్లో వారమంత కంటెస్టెంట్స్ ఏం చేశారు, ఏం ఆడారంటూ ఆరా తీస్తు వారికి వార్నింగ్ ఇస్తుంటాడు. ఇక వారి తప్పొప్పులపై మాట్లాడుతూ గట్టి కొట ఇస్తుంటాడు. ఇక అందరు ఎదురుచూస్తున్న మరో వీకెండ్ వచ్చేసింది. మరి ఈ శనివారం ఎపిసోడ్లో నాగార్జున కంటెస్టెంట్స్తో ఎలా ఆడుకున్నాడో చూపిస్తూ ప్రొమో వదిలారు. ఈ వీకెండ్ ఎపిపిసోడ్కి సంబంధించిన పెకండ్ ప్రొమో తాజాగా విడుదలైంది. ఇందులో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ తప్పొప్పులు తెల్చుతూ వారి లెక్కలు తెల్చాడు.
బోర్డులో ఉన్న పదాలు హౌజ్‌లో ఎవరికి చెందుతుందో కంటెస్టెంట్స్ మెడలో వేసి వివరించాలని చెప్పాడు. దీంతో రమ్య మోక్ష మాధురికి ఫేక్ అనే బోర్డు వేసింది. హౌజ్‌లోకి వచ్చినప్పుడు తను ఎవరితో ఎలాంటి బాండ్ పెట్టుకోనని చెప్పింది.. కానీ, ఇప్పుడు అవే బాండ్స్‌లోకి వెళుతుంది అనిపిస్తుంది అంటూ మాధురికి ఫేక్ బోర్డు తగిలించింది. ఆ తర్వాత డిమోన్.. పవన్కి ఇమ్మేచ్చుర్ బోర్డు వేశాడు. ఎవరినైనా తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు మెచ్చ్యురిటీతో అర్థం చేసుకుని క్షమించాలని. తనకి ఏం జరిగిందో వివరిస్తున్నప్పటికీ పదే పదే అదే మాట్లాడుతూ ఇప్పటికీ మోసం చేశావు అంటూ మాటలతో పొడుతున్నాడు. ఇలా ఇమ్మెచ్చుర్ బిహెవియర్తో ఉన్నాడు అంటూ డిమోన్ వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత రీతూ.. మాధురిక ఫౌల్ మౌతర్డ్ బోర్డు వేసింది. మొన్న టాస్క్లో జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాను, నీ బిహెవియర్ బాగోదు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడిందంటూ నాగార్జున కంప్లైంట్ ఇచ్చింది రీతూ. దీంతో నాగార్జున మాధురిపై ఫైర్ అయ్యారు.
నేను బయట అయితే ఇలా చేసేదాన్ని అని మాత్రమే అన్నానంటూ వివరణ ఇచ్చుకుంటుండగా.. మాధురి చివరి సారిగా చెబుతున్నా.. బయట నువ్వు తోపు అయితే బయటే చూసుకోమ్మా.. బిగ్బాస్ హౌజ్లో కాదంటూ మాధురిపై సీరియస్ అయ్యారు. అలాగే కళ్యాణ్ కూడా ఇమ్మాన్యుయేల్ దగ్గర తనూజని నామినేట్ చేస్తానని చెప్పి.. స్లిప్ తీసుకున్నావ్ కదా.. ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. ప్రొమో చూస్తుంటే ఈ రోజు నాగార్జున ఫుల్ ఫైర్లో ఉన్నట్టు కనిపించారు. కంటెస్టెంట్స్ మిస్టెక్స్ గురించి ఆరా తీసి వారికి తనదైన స్టైల్లో క్లాస్ పీకారు. ఇక హౌజ్లో తనే బిగ్ బాస్ అన్నట్టు వ్యవహరిస్తున్న మాధురిని ఒక్క మాటతో చెక్ పెట్టినట్టు కనిపిస్తోంది. చూస్తుంటే శనివారం ఎపిసోడ్ ఫుల్ రసవత్తరంగా ఉండేలా కనిపిస్తుంది. మరి అసలేం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read: Ramya Moksha: రమ్య మోక్ష ఎలిమినేషన్కి తనూజ కారణం.. అసలేం జరిగిందంటే!