BigTV English
Advertisement

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Bigg Boss 9: బిగ్ బాస్ 9 లో ప్రతివారం నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ అందరికీ క్లాసు పీకుతారు అనే విషయం తెలిసిందే. యాక్చువల్ గా ఇలా క్లాస్ తీసుకోవడం కూడా జరగాలి ఎందుకంటే బయట ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరు ఏ విధంగా చూస్తున్నారు అనే క్లారిటీ అప్పుడే హౌస్ మేట్స్ కి వస్తుంది. నాగార్జున వచ్చినప్పుడు చాలా ఎనర్జీ గా షో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కంటెస్టెంట్లు గురించి మాట్లాడటం మొదలుపెడతారు అప్పుడు చిన్నగా ఒక్కొక్కరికి భయం మొదలవుతుంది.


 

అలానే ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అయిపోతారు అనే సంగతి కూడా తెలిసిందే. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొంత మేరకు భయం కలిగిస్తుంది. అయితే ఈ వారం కూడా నాగార్జున చాలామందికి వార్నింగ్స్ ఇచ్చారు. వీడియోలు చూపించి మరి క్లారిటీ ఇచ్చారు.


రోడ్ రోలర్ వీడియో 

ఒక విషయంలో సంజనాకు మరియు దివ్యకి గొడవ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరుణంలో రోడ్డు రోలర్ లాగా నా మీద వచ్చి పడిపోతుంది అని సంజన దివ్యాన్ని ఉద్దేశిస్తూ అంది. ఈ విషయం దివ్యకి తెలియదు నేడు నాగార్జున వీడియో చూపించి సంజనకు వార్నింగ్ ఇచ్చారు.

సంజనా దానికి సమాధానంగా సర్ నేను కూడా అలానే ఉన్నాను. కదా నేను వేరే ఉద్దేశంతో అనలేదు అంటూ చెప్పింది. చాలాసార్లు ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నావు అమ్మ అంటూ నాగార్జున సర్ది చెప్పారు. అయితే తను మాట్లాడిన విషయంలో సారీ చెప్పింది సంజన.

సారీ యాక్సెప్ట్ చేయను – దివ్య

మరోవైపు సంజన సారీ చెప్పిన కూడా సార్ నేను దానిని యాక్సెప్ట్ చేయను ప్రస్తుతానికి ఆవిడ సారీ అని చెప్పేస్తారు కానీ తర్వాత మళ్లీ అవే మాటలను అంటుంటారు. అసలు నేను ఆవిడతో బాండింగ్ కంటిన్యూ చేయను అన్నట్లు మాట్లాడింది.

వెంటనే నాగార్జున దానికి కౌంటర్ గా మేము కొంచెం సాఫ్టుగా ఆడాలి ఆర్టిస్టులు కదా అని ఇమ్మానుయేల్ తో చెప్పిన మాటలను నువ్వు బయట ఎలా చెప్పావో తెలుసా అంటూ నాగార్జున దివ్య వీడియో ప్లే చేశారు.

వీడియో చూసిన వెంటనే సార్ నేను క్లాస్ అనే పదాన్ని మాత్రమే ఎక్కువగా పరిగణలోకి తీసుకొని సరిగ్గా కన్వే చేయలేకపోయాను ఆ విషయంలో నాది తప్పు అని ఒప్పుకుంది. మీ మధ్యలో బాండింగే లేదు అంటూ నాగార్జున దివ్యకి కూడా వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Related News

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ గుట్టు రట్టు చేసిన నాగ్.. షాక్ లో తనూజ

Bigg Boss 9: రాము విషయంలో తనూజకు ఫుల్ క్లాస్, వీడియోలతో కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న నాగ్

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Duvvada Madhuri: ఒక్క వారంలో ఊహించని మార్పు, అంత తనూజ దయ

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 యాజమాన్యంలో ఎంత మార్పు వచ్చిందో, దెబ్బకు అలా చేయడం ఆపేశారు

Bigg Boss 9 Promo: నువ్వు తోపు అయితే.. అది ఇక్కడ కాదు, మాధురికి నాగ్‌ వార్నింగ్

Ramya Moksha: తనూజ వల్లే రమ్య అవుట్.. పిక్కిల్స్‌ పాప ఎలిమినేషన్‌ కి కారణాలివే!

Big Stories

×