Big tv Kissik Talks: సినీ నటి కస్తూరి శంకర్ (Kasturi Shankar)ఒకానొక సమయంలో తమిళ సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె తెలుగులో కూడా నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో నటించారు. తెలుగులో పెద్దగా సినిమాలలో నటించకపోయిన ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. కస్తూరి శంకర్ వెండితెర సినిమాలలో కంటే కూడా తెలుగు బుల్లితెర సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలను పొందారు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో కస్తూరి నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఈ సీరియల్ తర్వాత ఈమె తదుపరి తెలుగులో పెద్దగా నటించలేదు.
ఇలా సినిమాల పరంగా కాకుండా కస్తూరి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అలాగే రాజకీయ అంశాల గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటారు. అయితే తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి శంకర్ కు సినిమాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈమెకు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)అంటే చాలా ఇష్టం అనే సంగతి అందరికీ తెలిసిందే పలు సందర్భాలలో విజయ్ దేవరకొండ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.
ఈ క్రమంలోనే యాంకర్ వర్ష కస్తూరి శంకర్ ను ప్రశ్నిస్తూ .. మీరు అడిగిన దానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి విజయ్ దేవరకొండ సినిమాలో ఆయనకు అక్క పాత్రలో నటించమంటే నటిస్తారా ?అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కస్తూరి సమాధానం చెబుతూ నేను అడిగినదానికంటే ఎంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చిన తాను విజయ్ దేవరకొండకు అక్కగా నటించనని తెలిపారు. మరి విజయ్ దేవరకొండకు జోడిగా ఛాన్స్ వస్తే నటిస్తారా అంటే నాకు ఎవరు ఇస్తారు అండి ఛాన్స్ అంటూ ఎదురు కృష్ణ వేశారు. ఒకవేళ వస్తే ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీనా అంటూ వర్ష ప్రశ్నించడంతో తాను సిద్ధమే అని సరదాగా సమాధానం చెప్పారు.
ఒకవేళ మీ హస్బెండ్ వచ్చి విజయ్ దేవరకొండను బ్రో అని పిలవమంటే పిలుస్తారా? అంటూ వర్ష ప్రశ్నించారు. ఏం చేయమంటారో చెప్పండి నేను భారతీయ నారీమణి అయ్యాను భర్త మాట కంటే మరొక మాట లేదు కదా ఖచ్చితంగా పిలుస్తాను అంటూ విజయ్ దేవరకొండను బ్రో అని పిలవడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నాకు విజయ్ దేవరకొండ ఒక యాక్టర్ గా చాలా ఇష్టమని వెల్లడించారు. నాకు మాత్రమే కాదు నా కూతురికి కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని తెలిపారు. నేను తన కూతురితో చాలా బలవంతంగా గీతగోవిందం సినిమా చూపించాను. కానీ అర్జున్ రెడ్డి చూడమని సలహా ఇవ్వలేదు అంటూ సరదాగా కస్తూరి శంకర్ విజయ్ దేవరకొండ గురించి ఆయన పట్ల ఉండే అభిమానం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: BigKissik Talks: పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై కస్తూరి కామెంట్స్.. సీఎం అయితే ఆపని చేస్తా అంటూ!