Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 లో చాలామందికి ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గానే టక్కును గుర్తు వచ్చే పేరు ఇమ్మానుయేల్. అయితే రోజులు గడుస్తున్నకొద్దీ ఇమ్మానియేల్ రంగు కూడా బయటపడిందని చెప్పాలి. ముఖ్యంగా ఇమ్మానుయేల్ చాలా ఇన్ సెక్యూర్ ఫెలో అని చాలామందికి అర్థం అయిపోయింది. భరణి మరియు రాము రాథోడ్ ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు పవర్ అస్త్ర ఉపయోగించి ఒకరిని సేవ్ చేయవచ్చు.
అయితే భరణితో ఇమ్మానుయేల్ కి మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా భరణిని సేవ్ చేస్తాడు అని అందరూ ఊహించరు. కానీ ఆ ఊహలు అన్నిటిని దాటి రాముని సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. దానికి కారణంగా భరణి అన్న మొదటి రెండు వారాలు గేమ్స్ బానే ఆడారు తర్వాత ఎందుకు ఆడటం మానేశారు అని నాకు అనిపించింది ఆ కారణం చేతనే నేను రాముని సేవ్ చేస్తున్న బిగ్ బాస్ అంటూ చెప్పాడు. బయట భరణికి కూడా శివాజీ ఇదే ప్రశ్న అడిగారు. అది ఇమ్మానుయేల్ గేమ్ స్ట్రాటజీ అని చాలా స్పోర్టివ్ గా తీసుకొని భరణి చెప్పాడు.
ఇక నేడు ఎపిసోడ్ కి నాగార్జున వస్తారు అనే సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎవరి గురించి చాటున ఏం మాట్లాడుకున్నారు అనేది నాగార్జున రివిల్ చేస్తారు. కొన్ని విషయాలను సీక్రెట్ రూమ్ కు పిలిచి మరి వీడియోలు చూపిస్తారు.
అయితే మొన్న జరిగిన బెలూన్ టాస్క్ లో ఇమ్మానుయేల్ కి మొత్తం ఆరు టికెట్లు దొరికాయి. ఆ టికెట్ల ద్వారా ఎవరినైనా ఆరుగురిని నామినేట్ చేయొచ్చు. అయితే నామినేట్ చేసే అవకాశం ఇమ్మానుయేల్ కి ఉన్నా కూడా ఆ టికెట్స్ అన్నీ పనిచేసి తను మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు.
అయితే కళ్యాణ్ కి టికెట్ ఇవ్వడానికి కారణం అతను తనుజని నామినేట్ చేస్తాను అని చెప్పడం. కానీ టికెట్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ సంజనాన్ని నామినేట్ చేశాడు. ఈ విషయం మీద వీరిద్దరికి మధ్య తీవ్రమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని గురించి నేడు బిగ్ బాస్ వీడియో చూపించి మరి ప్రస్తావించారు.
నీరు పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్లు అయింది సరే నువ్వు ఈ వీక్ అంతా కూడా గమనించు అని కళ్యాణ్ తో ఇమ్మానుయేల్ చెప్పిన వీడియో ప్లే చేశారు.
తనుజా ను నామినేట్ చేయకపోవడం వల్లనే ఇమ్మానుయేల్ ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. అయితే వారిద్దరి మధ్య ఉన్న సంభాషణ తనుజా కు తెలియదు. నేడు ఆ వీడియో చూసిన తర్వాత తనుజ షాక్ కి గురి అయింది.
Also Read: Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్