Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో ఎన్నో జిమిక్స్ జరుగుతున్నాయి. ఐదు వారాలు జరిగిన వెంటనే ఆరుగురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. ఆరుగురు బయటికి వెళ్లిపోయిన తర్వాత వైల్డ్ గార్డ్ ఎంట్రీ ద్వారా ఇంకో ఆరుగురు వచ్చారు. అయితే బయట నుంచి వచ్చిన ఆరుగురు కంటెస్టెంట్లు గేమ్ చూశారు కాబట్టి అందరి పైన ఒక అవగాహన ఉంటుంది.
వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో వచ్చిన వాళ్ళలో నలుగురు సెలబ్రిటీలు ఉన్నారు. ఇద్దరూ కామన్ పీపుల్ ఉన్నారు. దువ్వాడ మాధురి, రమ్య మోక్ష ఇద్దరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు కాబట్టి వాళ్లను వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపించారు. అయితే వెళ్ళిన తర్వాత రెండు రోజుల వరకు అందరూ బానే ఉన్నారు. మళ్లీ బంధాలు బాంధవ్యాలతో హౌస్ మేట్స్ తో ఇరుక్కుపోయారు. వాళ్లలో వాళ్లే గొడవలు ఆడుకోవడం మొదలుపెట్టారు.
బిగ్బాస్ లో ప్రతి శనివారం నాగార్జున వస్తారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు గురించి బయట ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో దానిని దృష్టిలో పెట్టుకొని నాగార్జున మాట్లాడుతూ ఉంటారు. కేవలం నాగార్జున మాట్లాడడం మాత్రమే కాకుండా కొంతమంది ఆడియన్స్ కూడా బిగ్ బాస్ కి వస్తుంటారు.
బిగ్ బాస్ యాజమాన్యం కొంతమంది ఆడియన్స్ ను తీసుకొచ్చినప్పుడు చాలా జిమిక్స్ చేయడం మొదలుపెట్టింది. ఆడియన్స్ లో మొదటగా ఒకరు అమెరికా నుంచి వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత దుబాయ్ నుంచి ఒకరు వచ్చారు అని చెప్పారు. అయితే దుబాయ్ నుంచి వచ్చిన ఆవిడ అబద్ధం చెప్పింది అని అందరికీ అర్థం అయిపోయింది.
ఇంస్టాగ్రామ్ లో డబుల్ మీనింగ్ కంటెంట్ చేసిన ఆవిడని తీసుకొచ్చి దుబాయ్ అని చెప్పారేంటి అని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. బహుశా ఇది బిగ్ బాస్ దృష్టికి కూడా చేరి ఉంటుంది. అందుకే ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో కేవలం లోకల్ వాళ్ళని పిలిచినట్లున్నారు. వేరే దేశం నుంచి వచ్చాము అనే ట్రిక్ వాడటం మానేశారు.
అయితే ముందు ముందు కూడా దీనిని ఆపుతారా, లేకపోతే ఇలానే కొనసాగేలా చేస్తారా అనేది వేచి చూడాలి. కానీ ఇలా జెన్యూన్ గా ఆపడం అనేది కొంతమేరకు మంచి మార్పు అని చెప్పాలి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో కాబోయే రోజుల్లో అర్థమవుతుంది.
Also Read: Mari Selvaraj: నేను అలాంటి సినిమాలే తీస్తాను దయచేసి నన్ను వదిలేయండి