BigTV English
Advertisement

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Nagarjuna: బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది అనేది వాస్తవం. అయితే ఈ షో బోరు కొట్టడం లేదు గానీ ఈ షో చూస్తూ కూడా చాలామంది తిట్టుకుంటున్నారు. ఎవరు జన్యున్ గా ఆడట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఈ కామెంట్ చేయడానికి అయినా షో చూడాల్సి వస్తుంది. ఈ షో తెలుగులో మొదలైనప్పుడు మొదట ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ షో కి ఎక్కువ మంది సెలబ్రిటీలు వచ్చారు.


అయితే సీజన్ మారుతున్న కొద్దీ తెలిసిన సెలబ్రిటీల కంటే కూడా తెలుసుకోవాల్సిన సెలబ్రెటీలు ఎక్కువగా రావడం మొదలయ్యారు. సీజన్ 2 కి నాని హోస్ట్ చేశారు. తరువాత జరిగిన అన్ని సీజన్స్ కి కూడా కేవలం నాగార్జున మాత్రమే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీనిని హోస్ట్ చేసేముందు నాగార్జున కూడా దీని గురించి నెగిటివ్ కామెంట్స్ అప్పట్లో చేశారు. అవి కూడా కాస్త వైరల్ గా మారాయి.

హోస్ట్ గా ఫెయిల్ అయ్యారా.?

బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు చాలామందికి విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కొక్క కంటెస్టెంట్ మీద ఒక్కొక్కరికి ఒక క్లారిటీ వస్తుంది. షో చూస్తున్నప్పుడే ఈవారం నాగార్జున వస్తే వీళ్ళకి కచ్చితంగా ఈ విషయంలో క్లాస్ పీకుతాడు అని ఒకటి చూసి ఆడియన్స్ ఊహించి ఉంటారు.


కానీ నాగర్జున వచ్చిన తర్వాత కంప్లీట్ స్క్రిప్ట్ మారిపోతుంది. కొన్ని విషయాలను చాలా తేలిగ్గా తీసుకొని, అవసరంలేని విషయాన్ని హైలెట్ చేస్తూ ఉంటారు. జుట్టు పట్టుకుని కొడతాను అని దువ్వాడ మాధురి అన్న విషయానికి పెద్దగా క్లాస్ పీకకుండా నువ్వు సైలెంట్ గా ఉంటే అయిపోయేది అని రీతు చౌదరికి చెప్పటం.

హోస్టింగ్ చేసే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు లేవు, ఎప్పుడు ఉండే పద్ధతే, తప్పు నీ తప్పు అని చెప్పట్లేదు అమ్మాయి విషయంలో. అదే అబ్బాయి దగ్గరికి వస్తె నువ్వు గుడ్డోడివ, బొంగులో డాన్సర్ ఇలా అయితే అనేస్తున్నారు అంటూ నాగార్జున ను విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టా.

నెక్స్ట్ సీజన్ కి వద్దు 

అయితే చాలామంది ఊహించిన దానికి భిన్నంగా నాగార్జున హోస్టింగ్ ఉంటుంది. అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఇస్ గా ఫాలో అవ్వడం వలన ఇది జరుగుతుందా? లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది చాలామందికి తెలియని విషయం. కానీ నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ గా వద్దు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Also Read: Dude Director: నేను ఆర్య సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఆర్య 2 చూసి ఉంటే అది జరిగేది

Related News

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ గుట్టు రట్టు చేసిన నాగ్.. షాక్ లో తనూజ

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Bigg Boss 9: రాము విషయంలో తనూజకు ఫుల్ క్లాస్, వీడియోలతో కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న నాగ్

Duvvada Madhuri: ఒక్క వారంలో ఊహించని మార్పు, అంత తనూజ దయ

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 యాజమాన్యంలో ఎంత మార్పు వచ్చిందో, దెబ్బకు అలా చేయడం ఆపేశారు

Bigg Boss 9 Promo: నువ్వు తోపు అయితే.. అది ఇక్కడ కాదు, మాధురికి నాగ్‌ వార్నింగ్

Ramya Moksha: తనూజ వల్లే రమ్య అవుట్.. పిక్కిల్స్‌ పాప ఎలిమినేషన్‌ కి కారణాలివే!

Big Stories

×