Big tv Kissik Talks: సినీనటి కస్తూరి శంకర్ (Kasturi Shankar)తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అలాగే రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఈమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా చివరికి జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాను ఏ విషయాన్ని దాచుకోకుండా తనకు తోచిన అంశం గురించి ముక్కుసూటిగా మాట్లాడటం వల్లే తనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కస్తూరి శంకర్ వెల్లడించారు.. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అంటూ ప్రశ్న వేయడంతో ఇష్టమైన రాజకీయ నాయకుడు కాదు హీరో ఎవరు అని అడగండి చెప్తాను అంటూ తనకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే చాలా ఇష్టం అని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల పరంగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు తమిళనాడులో కూడా చాలా మంచి క్రేజ్ ఉందని కస్తూరి శంకర్ వెల్లడించారు. చెన్నైలో పవన్ కళ్యాణ్ హీరోగా కంటే కూడా రాజకీయ నాయకుడిగా అందరికీ బాగా తెలుసని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మాట చెప్పారంటే అదే మాటపై ఉంటారని ఈమె వెల్లడించారు.
ఇక తాను పార్టీలపరంగా కాదని తనకు రోజా విజయశాంతి వంటి వాళ్లు అంటే చాలా ఇష్టమని తెలిపారు.. ఇకపోతే మీకు కనుక ఒకరోజు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే మీరు ఏది మార్చాలి అనుకుంటారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు కస్తూరి శంకర్ సమాధానం చెబుతూ చెత్త లేకుండా చేయాలని కోరుకుంటానని వెల్లడించారు. మన దేశంలో మేడలు చూస్తే ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి కానీ కింద చెత్త చూస్తే మాత్రం ఎక్కడకక్కడ పేరుకుపోయి ఉంటుందని తెలిపారు. ఇలా చెత్త లేకుండా చేయాలని నిర్ణయాన్ని తీసుకుంటానని అయితే ఇది ఒక రోజులో జరిగే విషయం కాదని ఈమె తెలిపారు.
ఇక పలువురు రాజకీయ నాయకులు గురించి కూడా ఈమె తెలియజేశారు .ప్రస్తుతం తన హోమ్ టౌన్ హైదరాబాద్ అని గుర్తు చేశారు అలాగే హైదరాబాదు రోజురోజుకు ఎంతో బాగా అభివృద్ధి చెందిందని ఇలా హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే అందుకు కారణం ఎంతోమంది ముఖ్య మంత్రుల కృషి అంటూ కూడా ఈమె తెలియజేశారు. హైదరాబాద్ డెవలప్ అయిన విధంగా తమిళనాడు డెవలప్ కాలేదంటూ మాట్లాడటమే కాకుండా ఇది కచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది అంటూ కస్తూరి శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన విజయశాంతి రోజా వంటి వారు రాజకీయాలలోకి రావడం తనకు బాగా నచ్చిందని, వీరిద్దరూ పవర్ ఫుల్ లీడర్స్ అంటూ కస్తూరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: Big tv Kissik Talks: అల్లు అర్జున్ తలరాత.. జైలు జీవితం పై నటి కస్తూరి ఎమోషనల్ కామెంట్స్!