E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న “హ్రీం” మూవీ టీజర్.. గ్రాండ్‌గా లాంఛ్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి!

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న “హ్రీం” మూవీ టీజర్.. గ్రాండ్‌గా లాంఛ్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి!
Advertisement

Hreem Teaser: భారీ బడ్జెట్ చిత్రాలకి ధీటుగా సంచలనాలు స్ప్రుష్టించిన చిన్న సినిమాలు బోలెడు.ఈ క్రమంలోనే మరోసారి సాలిడ్ కంటెంట్ తో సత్తా చాటుతామంటూ వస్తున్న సినిమా “హ్రీం” హారర్ మరియు మిస్టికల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఇదొక నెక్స్ట్ లెవెల్ మిస్టరీ థ్రిల్లర్ కాబోతోందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇందులోని విజువల్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడికి సరికొత్త థ్రిల్‌ను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ రావూరి దర్శకత్వం వహించారు.

Advertisement

ప్రొడ్యూసర్‌గా మారిన జర్నలిస్ట్ శివ మల్లాల

గత 25 సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ మల్లాల, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కేవలం సినిమాపై ఉన్న ప్యాషన్‌తో, ఇండస్ట్రీపై ఉన్న పూర్తి అవగాహనతో ఆయన ఎక్కడా రాజీ పడకుండా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఒక క్రిటిక్‌గా ఎన్నో సినిమాల లోటుపాట్లను విశ్లేషించిన అనుభవంతో, బడ్జెట్ పరిమితుల్లోనే అత్యున్నత నాణ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Advertisement

also read :గుడ్‌బై చెప్పేసిన టాలీవుడ్ బ్యూటీ… అసలు కారణం ఇదేనా!

వరంగల్ సమీపంలోని ‘పెద పెండ్యాల’ అనే గ్రామంలో గెరిల్లా షూటింగ్ పద్ధతిలో అత్యంత సహజత్వానికి దగ్గరగా ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం. కేవలం కాంపాక్ట్ బడ్జెట్‌లోనే దాదాపు 20 నిమిషాల హై-ఎండ్ గ్రాఫిక్స్ (VFX) ఈ సినిమాలో ఉండటం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. డైరెక్టర్ రాజేష్ రావూరి, డీవోపీ అరవింద్ కేవలం రూపాయి ఖర్చు లేకుండా చేసిన 5 నిమిషాల డెమో షూట్ చూసి, ఈ టీమ్ ప్రతిభను నమ్మి శివ మల్లాల ఈ ప్రాజెక్ట్‌ను టేకాఫ్ చేయడం గమనార్హం.

పవర్‌ఫుల్ పాత్రలో నటించిన రాజీవ్ కనకాల 

ఇక పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్, శుభోదయం సుబ్బారావు (రాజశేఖర్) వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రారంభోత్సవానికి కేవలం గెస్ట్‌గా వచ్చిన రాజీవ్ కనకాల, ఈ కథలోని నవ్యత నచ్చి ఇందులో ఒక డిఫరెంట్ అండ్ పవర్‌ఫుల్ పాత్రలో నటించడం విశేషం. ఇక దుబాయ్ నుండి వచ్చిన హీరోయిన్ చమింద వర్మ, కథను నమ్మి ఎలాంటి రెమ్యునరేషన్ ఆశించకుండా ప్రాణం పెట్టి నటించడం సినిమాపై ఆమెకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

సాంకేతిక పరంగా కూడా “హ్రీం” సినిమా సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయబోతోంది. మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) టీజర్‌కే అసలు సిసలైన హైలైట్‌గా నిలిచింది. సౌండ్ డిజైనర్ ప్రేమ్ డేవిడ్, డీవోపీ అరవింద్, ఎడిటర్ శివప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల తమ ప్రతిభతో ఈ మిస్టికల్ థ్రిల్లర్‌ను విజువల్ వండర్‌గా మార్చారు. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ రాజ్ పవన్ ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలను భుజాన వేసుకుని అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు.

also read :ఫస్ట్ టైమ్.. క్లింకార ఫేస్ రివీల్ చేసిన చెర్రీ, ఉపాసన.. ఎంత ముద్దుగా ఉందో!

ఎస్వీ కృష్ణారెడ్డి మరియు అచ్చిరెడ్డి ఈ టీజర్ క్వాలిటీ చూసి ముగ్ధులయ్యారు. హ్రీం అంటే కేవలం టైటిల్ మాత్రమే కాదు, థియేటర్లలో ప్రేక్షకులకు క్రీమ్ లాంటి విందు భోజనం కాబోతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.చూడాలి మరి చిన్నబడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు స్ప్రుష్టిస్తుందో !

Related News

సమంత నిజంగానే తల్లి కాబోతుందా? ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌ పిక్స్ వెనుక మిస్టరీ !

గుడ్‌బై చెప్పేసిన టాలీవుడ్ బ్యూటీ… అసలు కారణం ఇదేనా!

ఫస్ట్ టైమ్.. క్లింకార ఫేస్ రివీల్ చేసిన చెర్రీ, ఉపాసన.. ఎంత ముద్దుగా ఉందో!

స్టార్ ప్రొడ్యూసర్ రూ. 1.35 కోట్ల నగలు మాయం.. లగ్జరీ ఫ్యాషన్ జర్నీలో ఊహించని ట్విస్ట్!

ఆ 93 వీడియోలే టార్గెట్.. యూట్యూబర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మాలీవుడ్ బ్యూటీ!

ట్రాజెడీ కింగ్ రియల్ లైఫ్ డ్రామా.. ఆ ఒక్క తప్పుకు భార్య కాళ్ళు బాలీవుడ్ స్టార్ హీరో !

అమ్ముడుపోయిన మీడియాకు నా ఆహ్వానం.. ధర్మస్థల వివాదంపై ప్రకాష్ రాజ్ లైవ్..

Big Stories

×