E-Paper
Advertisement

సమంత నిజంగానే తల్లి కాబోతుందా? ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌ పిక్స్ వెనుక మిస్టరీ !

సమంత నిజంగానే తల్లి కాబోతుందా? ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌ పిక్స్ వెనుక మిస్టరీ !
Advertisement

Samantha Pregnancy: టాలీవుడ్ తెరపై తన నటనతో, గ్లామర్‌తో కోట్లాది మంది గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈమధ్య కాలంలో కాస్త డీలా పడ్డప్పటికీ   పట్టుదలతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి రావడం విశేషం.ముఖ్యంగా జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఆమె సరికొత్త యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

మొదటి రోజే ఏకంగా రూ. 13.15 కోట్ల భారీ వసూళ్లను సాధించి, సమంత స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ ఈవెంట్‌లో సినిమా సక్సెస్ కంటే కూడా సమంత లుక్ గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

సమంత బేబీ బంప్‌తో కనిపిస్తున్న నెటిజన్లు

Advertisement

‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి సమంత చాలావరకు సాంప్రదాయబద్ధమైన శైలిలోనే కనిపిస్తూ వచ్చారు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, పబ్లిక్ అప్పియరెన్స్‌లలో ఆమె ఎక్కువగా చీరలు, లంగా ఓణీలు ధరించి కనువిందు చేశారు. ఎప్పుడూ ట్రెండీ, వెస్ట్రన్, మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోయే సమంత.. ఈ సినిమా కోసం ఇలా పూర్తిగా ట్రెడిషనల్ లుక్‌లోకి మారిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో మాత్రం  ఒక స్టైలిష్ మోడ్రన్ కాస్ట్యూమ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

also read :గూస్‌బంప్స్ తెప్పిస్తున్న “హ్రీం” మూవీ టీజర్.. గ్రాండ్‌గా లాంఛ్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి!

Advertisement

ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఆ దృశ్యాలలో కొన్ని యాంగిల్స్ నుంచి చూసినప్పుడు సమంత బేబీ బంప్‌తో కనిపిస్తున్నారంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

 కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమంత

ఈ ఒక్క కామెంట్‌తో సోషల్ మీడియా వేదికగా “సమంత తల్లి కాబోతోందా?” అనే వార్త వైరల్ అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆమె ప్రెగ్నెన్సీ గురించిన రూమర్స్  ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్న లేటెస్ట్ లుక్ వాటికి మరింత బూస్టప్ ఇచ్చింది. ప్రమోషన్స్ సమయంలో సమంత వరుసగా చీరలు కట్టుకోవడానికి అసలు కారణం ఆ బేబీ బంప్‌ను కవర్ చేయడానికేనంటూ అనాలసిస్ లు చేస్తున్నారు కూడా. గత ఏడాది డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ప్రముఖ ఇషా యోగా సెంటర్‌లో అత్యంత ఆత్మీయుల సమక్షంలో దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె జీవితంలోకి వచ్చిన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమంత, పెళ్లి తర్వాత కొన్నాళ్లు కెమెరాకు దూరంగా ఉన్నారు.

also read :గుడ్‌బై చెప్పేసిన టాలీవుడ్ బ్యూటీ… అసలు కారణం ఇదేనా!

ఆ చిన్న విరామం తర్వాత ఆమె పూర్తి ఎనర్జీతో చేసిన ప్రాజెక్టే ఈ ‘మా ఇంటి బంగారం’. ఒకవైపు సినిమా మంచివసూళ్లతో దూసుకుపోతుండటం, మరోవైపు సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ క్రేజీ అప్‌డేట్ బయటకు రావడం ఫ్యాన్స్ కి మాంచి ఎనర్జీ ఇస్తుంది.అయితే  ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై సమంత పర్సనల్ టీమ్ కానీ, ఆమె భర్త రాజ్ నిడిమోరు కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.చూడాలి మరి ఈ వార్తలపై సామ్ త్వరలో ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో !

Related News

రాజకీయాలపై అక్కినేని కోడలు హాట్ కామెంట్స్!

జిమ్ వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తున్న స్టార్ హీరో తల్లి.. ఎవరంటే?

ప్రదీప్ రావత్ జీవితంలో భయంకరమైన రోజు అదే!

తేజెస్వి మదివాడ రియల్ స్టోరీ.. కన్నీళ్లు తెప్పించే ట్విస్టులు..

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

Big Stories

Advertisement
×