E-Paper

అమ్ముడుపోయిన మీడియాకు నా ఆహ్వానం.. ధర్మస్థల వివాదంపై ప్రకాష్ రాజ్ లైవ్..

అమ్ముడుపోయిన మీడియాకు నా ఆహ్వానం.. ధర్మస్థల వివాదంపై ప్రకాష్ రాజ్ లైవ్..
Advertisement

Prakash Raj : సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల సినిమాల కన్నా కూడా వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయనకు సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలంలో అనుమానాస్పద రీతిలో మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న పారిశుద్ధ్య కార్మికుడు, ముసుగువ్యక్తిగా పేరున్న చిన్నయ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ధర్మస్థల ప్రతిష్ఠకు భంగం కల్పించేందుకు కేరళ నుంచి రూ.200 కోట్లు వచ్చాయి. ఈ విషయం ప్రకాష్ రాజ్ కు కూడా తెలుసు అని చిన్నయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.. ఇదిలా ఉండగా.. తనపై వస్తున్న ఆరోపణలకు లైవ్ కార్యక్రమంలో క్లారిటీ ఇవ్వనున్నట్లు తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏం రాసారో ఒకసారి చూసేద్దాం..

అమ్ముడుపోయిన మీడియా కు నా ఆహ్వానం..

కర్ణాటక ధర్మస్థల వివాదం పై ప్రకాష్ రాజ్ పై వచ్చిన ఆరోపణలకు ఆయన క్లారిటీ ఇవ్వనున్నట్లు ట్వీట్ చేశారు.. ఇవాళ సాయంత్రం 7.30 ప్రశ్న ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పబోతున్నాను. ప్రజలు నిజం తెలుసుకోవాలి అనుకుంటున్న.. అలాగే మీడియా మిత్రులకి నా విశేష ఆహ్వానము.. అలాగే (“కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి” )కూడ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. అమ్ముడుపోయిన మీడియా మిత్రులకి అని ఆయన రాయడం పై మీడియా ప్రతినిధులతో పాటుగా నెట్టిజన్లు కూడా స్పందిస్తూ ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇది మరో వివాదానికి తెర లేపినట్టు తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇది చర్చినీయంశంగా మారింది.. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Advertisement

ధర్మస్థల వివాదంలో నా ప్రమేయం లేదు..

కర్ణాటకలోని ప్రముఖ ఆలయం ధర్మస్థల మరోసారి వార్తల్లో నిలిచింది. 1995 నుంచి 2014 వరకు ఆలయం వద్ద పని చేసిన ఓ కార్మికుడు చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.. అత్యాచారాలకు గురైన మహిళల శవాలను పాతిపెట్టానని, డీజిల్‌తో తగలబెట్టానని ముసుగు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు నటుడు ప్రకాష్ రాజ్ కి కేరళ నుంచి 200 కోట్లు వచ్చాయని ఆ ముసుగు వ్యక్తి ఆరోపించాడు.. దాంతో ఇది సినీ వర్గాల్లో కూడా చర్చలకు దారి తీసింది. చిన్నయ్య చేసిన ఆరోపణలను ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. తాను ఒక్కసారి కూడా ధర్మస్థలకు వెళ్లలేదని, ఆ ఆలయానికి సంబంధించిన వ్యక్తులతో కు పరిచయాలు లేవని రీసెంట్గా విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు మరోసారి లైవ్ లో ప్రశ్నలకి సమాధానం చెప్తానని ఒక ట్వీట్ చేశారు. మరి సాయంత్రం జరగబోతున్న లైవ్ లో ప్రకాష్ రాజ్ ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారు చూడాలి…

Advertisement

Also Read :హీరోయిన్ రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ట్విస్ట్ .. ముగ్గురు అరెస్ట్..

Related News

హీరోయిన్ రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ట్విస్ట్ .. ముగ్గురు అరెస్ట్..

Bandla Ganesh : నిజంగా బండ్లన్న పవన్ భక్తుడే.. నిరంజన్ కుటుంబానికి భారీ ఆర్థిక సాయం..

ఢిల్లీకి సీఏం విజయ్.. ‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Monal Gajjar : సినిమాలకు బిగ్ బాస్ బ్యూటీ గుడ్ బై.. త్వరలోనే అతనితో పెళ్లి..?

గట్టిగా చెప్పమన్న ప్రభాస్.. అరిచి మరీ చెప్పిన నాగ్ అశ్విన్.. వీడియో వైరల్!

మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మళ్లీ ఆ హీరోతోనేనా?

మళ్లీ థియేటర్లలో ‘ఆల్ ఈజ్ వెల్’.. రెండు దశాబ్దాల తర్వాత ‘3 ఇడియట్స్’ మ్యాజిక్!

Big Stories

×