E-Paper
Advertisement

ఫస్ట్ టైమ్.. క్లింకార ఫేస్ రివీల్ చేసిన చెర్రీ, ఉపాసన.. ఎంత ముద్దుగా ఉందో!

ఫస్ట్ టైమ్.. క్లింకార ఫేస్ రివీల్ చేసిన చెర్రీ, ఉపాసన.. ఎంత ముద్దుగా ఉందో!
Advertisement

Klin Kaara: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల గారాల పట్టి, మెగా ప్రిన్సెస్ క్లీంకార ముఖాన్ని అభిమానులకు పూర్తిస్థాయిలో పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక బ్యూటిఫుల్ ఫొటో బయటకు వచ్చింది. 2023 జూన్20న జన్మించిన  క్లీంకార ఫొటోలను అప్పుడప్పుడు పంచుకున్నా ఎప్పుడూ ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్తపడిన మెగా ఫ్యామిలీ, ఈసారి మాత్రం పాప ఫుల్ ఫేస్ రివీల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.

మూడో బర్త్ డే సందర్భంగా రివీల్ చేసిన ఈ పిక్చర్‌లో క్లీంకార స్కై బ్లూ కలర్ ఫ్రాక్‌లో ఎంతో క్యూట్‌గా నవ్వుతూ కనిపిస్తుండగా, పక్కనే రామ్ చరణ్, ఉపాసన తమ ముద్దుల కూతురిని చూసి మురిసిపోతున్నారు. ఈ ఫొటో చూసిన మెగా అభిమానులు అచ్చం తండ్రి పోలికలేనంటూ నెట్టింట పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. అపోలో ఆసుపత్రిలో పుట్టినప్పటి నుంచి నేటి వరకు క్లీంకారకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్న సంగతి తెల్సిందే.

Advertisement

క్లీంకార రాకతో మరింత అదృష్టం 

ఇక రామ్ చరణ్-ఉపాసన వివాహం జరిగిన 11 ఏళ్ల తర్వాత జన్మించిన క్లీంకారకు లలితా సహస్రనామం నుంచి ఈ పేరును ఎంపిక చేశారని చెప్పక్కర్లేదు. ప్రకృతి స్వరూపాన్ని,అమ్మవారి అనుగ్రహాన్ని సూచించే ఈ పేరుకు తగ్గట్టే, ఆ పాప రాకతో మెగా ఇంట మరింత అదృష్టం, ఆనందం వెల్లివిరిశాయని కుటుంబ సభ్యులు తరచూ చెబుతుంటారు కూడా. గ్లోబల్ స్టార్‌గా RRR సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ చరణ్, ప్రస్తుతం బుచ్చి బాబు డైరెక్షన్ లో పెద్ది తో అభిమానులని పలకరించిన సంగతి తెల్సిందే. ఇలాంటి వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో కెరీర్ పరంగా సక్సెస్ లో ఉన్న చరణ్, ఇంటికి రాగానే కేవలం క్లీంకార తండ్రిగానే మారిపోతానని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు కూడా.

ఈ ఫేస్ రివీల్ నిజంగానే పెద్ద సర్ ప్రైజ్

Advertisement

ఈ క్యూట్ ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోవడం విశేషం.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మనవరాలిపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు, బాబాయ్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ అండ్ సినిమా బిజీ షెడ్యూల్స్ మధ్యలో కూడా క్లీంకారతో గడిపే ముచ్చట్లు అభిమానుల్లో ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే  ఉంటాయి. గతంలో విమానాశ్రయాల్లో లేదా ప్రైవేట్ ఫంక్షన్లలో క్లీంకారను కెమెరాల కంటికి పడకుండా దాచడానికి ఎంత ప్రయత్నించినా, ఈసారి స్వయంగా ఉపాసన ఈ బ్యూటిఫుల్ పిక్చర్‌తో విషెస్ చెప్పడంతో ఖుషీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ కూతురు కేవలం మెగా వారసురాలిగానే కాకుండా, తమ సొంత పాపలా భావించే అభిమానులందరికీ ఈ ఫేస్ రివీల్ నిజంగానే ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు.

Related News

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×