E-Paper
Advertisement

రెండింతల ఫైన్.. కట్టకపోతే జైల్.. ఇవాళ్టి నుంచి అమల్లోకి షాకింగ్ రూల్!

రెండింతల ఫైన్.. కట్టకపోతే జైల్.. ఇవాళ్టి నుంచి అమల్లోకి షాకింగ్ రూల్!
Advertisement

Indian Railways New Rule 2026: రైలులో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి భారతీయ రైల్వే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై టికెట్ లేకుండా ప్రయాణిస్తే గతం కంటే రెండింతల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. కొత్త నిబంధనలు జూన్ 20 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి  తీసుకొచ్చింది.

జరిమానా, జైలు శిక్ష కూడా..

రైల్వే మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై విధించే కనీస జరిమానాను రూ.250 నుంచి రూ.500కు పెంచారు. టికెట్ లేకుండా ప్రయాణాలు తగ్గించడం, రైల్వే ఆదాయాన్ని కాపాడడం, ప్రయాణికుల్లో క్రమశిక్షణ పెంచడం కోసమే ఈ నిర్ణం తీసుకున్నట్లు రైల్వే ప్రకటించింది.

భారీగా పెరిగిన టికెట్ లెస్ ప్రయాణికుల సంఖ్య

Advertisement

ఇటీవల టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగినట్లు రైల్వే గుర్తించింది. కేవలం మే నెలలోనే సెంట్రల్ రైల్వే జోన్‌లో 4.96 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.40.85 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించింది. జన్ విశ్వాస్ చట్టం-2026లో భాగంగా ఈ సవరణలు తీసుకొచ్చింది. రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 137, 138 కింద కొత్త జరిమానా నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ఎవరైనా సరైన టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తే కేవలం జరిమానా మాత్రమే కాదు, వారు ప్రయాణించిన మొత్తం దూరానికి సంబంధించిన చార్జీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుడు ఎక్కడి నుంచి రైలులో ఎక్కాడో నిర్ధారించలేని పరిస్థితుల్లో, రైలు మొదట బయలుదేరిన స్టేషన్ నుంచి ఛార్జీ లెక్కిస్తారు. అదనంగా కనీసం రూ.500 జరిమానా కూడా విధిస్తారు. అంతేకాదు, ఒకసారి ఉపయోగించిన టికెట్‌ను మళ్లీ ఉపయోగించడం, ఇతరుల టికెట్‌తో ప్రయాణించడం, చెల్లని పాస్‌ తో రైలులో ప్రయాణించడం కూడా నేరంగానే పరిగణిస్తారు.

జరిమానా చెల్లించకపోతే జైలుశిక్ష

జరిమానా చెల్లించడానికి నిరాకరించినా, చెల్లించలేని ప్రయాణికులపై రైల్వే అధికారులు కోర్టును ఆశ్రయిస్తారు. కోర్టు ఆదేశాల మేరకు జరిమానా వసూలు చేయడంతో పాటు, అవసరమైతే ఆరు నెలల వరకు జైలు శిక్ష, అదనపు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.

రైల్వే అధికారుల కీలక సూచనలు

Advertisement

రైల్వే అధికారులు ప్రయాణికులకు తాజాగా కీలక సూచనలు చేశారు. ప్రయాణానికి ముందు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టికెట్ కొనుగోలు చేయాలని, ఆన్‌ లైన్ ద్వారా లేదంటే స్టేషన్ కౌంటర్ ద్వారా టికెట్ తీసుకుని ప్రయాణించాలని సూచించారు. దీంతో జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని తెలిపారు.

తనిఖీలు మరింత కఠినతరం

ప్రస్తుతం రైల్వే శాఖ టికెట్ తనిఖీలను కూడా మరింత కఠినతరం చేస్తోంది. ముఖ్యంగా పండుగలు, సెలవులు, రద్దీ మార్గాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తోంది. ఇలా చేయడం వల్ల టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇకపై రైలులో ప్రయాణించే ముందు మీ దగ్గర సరైన టికెట్ ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే భారీ జరిమానాతో పాటు చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Read Also: హైదరాబాద్ నుంచి క్రేజీ గోవా ట్రిప్.. ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ మీకోసమే!

Related News

జీవితంలో కచ్చితంగా చూడాల్సిన.. 7 పుణ్య క్షేత్రాలు.. పాపాలు పోవాలంటే తప్పదు భయ్యా!

నిద్రలో దిగాల్సిన స్టేషన్ దాటిపోతే.. ఫ్రీగా మరో రైల్లో వెనక్కి వెళ్లొచ్చా?

జంగిల్ సఫారీకి రెడీనా? అయితే, మీ కోసమే IRCTC క్రేజీ టూర్ ప్యాకేజీ రెడీ!

ముందొక రైలు.. వెనుకొక రైలు.. వామ్మో.. రాష్ట్రపతి ప్రత్యేక రైలు ఇలా ఉంటుందా?

ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి వందే భారత్ స్లీపర్ కోసం ఎంపీ లేఖ!

సమయం లేదు మిత్రమా? ఇండిగో బంపరాఫర్.. 20 వేల మందికి ఫ్రీ టికెట్లు

హైదరాబాద్ మెట్రో ఎక్కాలంటే భయం.. ఢిల్లీ తరహాలో కోచ్‌ల సంఖ్య ఎందుకు పెంచడం లేదు?

రైల్లో తలతిక్క వేషాలు.. వీణ్ణి బొక్కలో వేసి మక్కెలు విరగ్గొట్టండి సర్!

Big Stories

Advertisement
×