E-Paper

ట్రాజెడీ కింగ్ రియల్ లైఫ్ డ్రామా.. ఆ ఒక్క తప్పుకు భార్య కాళ్ళు బాలీవుడ్ స్టార్ హీరో !

ట్రాజెడీ కింగ్ రియల్ లైఫ్ డ్రామా.. ఆ ఒక్క తప్పుకు భార్య కాళ్ళు బాలీవుడ్ స్టార్ హీరో !
Advertisement

Dilip Kumar: దిలీప్ కుమార్…ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా..బాలీవుడ్ లో ట్రాజెడీ కింగ్ గా పేరొందిన స్టార్ హీరో. అలా సిల్వర్ స్క్రీన్ పై అతని సినిమాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో, రియల్ లైఫ్ లో కూడా జరిగిన కొన్ని సంఘటనలు అంతే సంచలనం స్ప్రుష్టించాయి.అన్నింటికన్నాముఖ్యంగా 1966 అక్టోబర్ 11న తనకంటే 22 ఏళ్లు చిన్నదైన సైరా బానును ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు అదొక పెద్ద సంచలనం.

1982లో జరిగిన ఒక అనుకోని సంఘటన

మోఘల్-ఎ-ఆజం (1960), రామ్ ఔర్ శ్యామ్ (1967) వంటి చిత్రాలతో అప్పట్లో తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించిన దిలీప్ కుమార్, సైరా బానుల బంధం బాలీవుడ్‌లో ఒక సూపర్ హిట్ సినిమాలా సక్సెస్ అవుతుందని అనుకున్నారంతా .అయితే  బంధంలోకి అడుగుపెట్టిన 16 ఏళ్ల తర్వాత, అంటే 1982లో జరిగిన ఒక అనుకోని సంఘటన వీరి కాపురాన్ని కాకావికలం చేసేసింది.అదే సైరా బానుకు అస్సలు తెలియకుండా, దిలీప్ కుమార్ హైదరాబాద్‌కు చెందిన అస్మా రెహమాన్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకోవడం.అవును ఈ సంఘటనే అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం స్ప్రుష్టించింది.

1982లో దిలీప్ కుమార్ వివాహం

Advertisement

అయితే ఈ రెండో పెళ్లి వెనుక పెద్ద కథే నడిచింది. దిలీప్ కుమార్ అక్కాచెల్లలకు సైరా బాను అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. ఈ క్రమంలోనే ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అస్మా రెహమాన్‌ను దిలీప్ కుమార్‌కు ఆయన సోదరీమణులే పరిచయం చేశారు. ఆ తర్వాత దిలీప్ కుమార్ ఎక్కడికి వెళ్లినా ఆమె అక్కడ ప్రత్యక్షమయ్యేలా పరిస్థితులను సృష్టించారు. చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి, కొన్ని డ్రామాటిక్ సిచ్యుయేషన్స్ మధ్య 1982లో దిలీప్ కుమార్ ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే, ఈ విషయం సైరా బానుకు ముందే తెలియదు.

ఎనిమిదో నెలలో బాబును కోల్పోయిన సైరా భాను 

ఒకరోజు ఉదయం న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను చూసి ఆమె షాక్ గురయ్యారు. దిలీప్ కుమార్ ప్రాణంగా ప్రేమించిన భార్యకు ఈ వార్త కోలుకోలేని దెబ్బనే అని చెప్పాలి.అప్పట్లో ఈ వ్యవహారంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. 1972లో సైరా బాను ఎనిమిదో నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఒక బాబును కోల్పోయారని, ఆ తర్వాత వారికి పిల్లలు కలగలేదని, అందుకే వారసుడి కోసమే దిలీప్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.

Advertisement

also read :మళ్లీ థియేటర్లలో ‘ఆల్ ఈజ్ వెల్’.. రెండు దశాబ్దాల తర్వాత ‘3 ఇడియట్స్’ మ్యాజిక్!

అయితే, పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే దిలీప్ కుమార్ తను ఎంత పెద్ద తప్పు చేశాడో గ్రహించారు. అస్మాతో వివాహం కేవలం ఒక పథకం ప్రకారం జరిగిందని తెలుసుకుని, తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో సైరా బాను ప్రదర్శించిన ఓపిక నిజంగా మెచ్చుకోతగ్గది.దిలీప్ కుమార్ తన తప్పును ఒప్పుకుంటూ, ఈ సమస్యను చట్టపరంగా పరిష్కరించుకోవడానికి తనకు కొంత సమయం కావాలని సైరాను వేడుకున్నారు. ఆయనపై ఉన్న అమితమైన ప్రేమతో సైరా బాను ఆ క్లిష్ట సమయంలోనూ ఆయనకు తోడుగా నిలిచారు. ఆ తర్వాత దిలీప్ కుమార్ చట్టపరమైన ప్రక్రియల ద్వారా అస్మా రెహమాన్‌కు విడాకులు ఇచ్చి, మళ్లీ సైరా బాను దగ్గరికి చేరారు. అంతేకాదు, భవిష్యత్తులో తాను ఎప్పటికీ మళ్లీ రెండో పెళ్లి ప్రస్తావన తీసుకురానంటూ సైరా తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఒక అఫీషియల్ గా పేపర్ పై కూడా సంతకం చేసి ఇచ్చారు.

 కన్నుమూసే వరకు తోడుగా నిలిచిన సైరా బాను 

అయితే ఈ వివాదం చల్లారినప్పటికి, అస్మా రెహమాన్ జీవితం మాత్రం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. నిరంతరం వెంటాడే మీడియా ఫోకస్, సమాజం నుండి వచ్చిన విమర్శలను తట్టుకోలేక ఆమె తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. 1983లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన గురించి మీడియాలో వచ్చిన వార్తల్లో 95 శాతం అబద్ధాలేనని, ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను కూడా ఊహించుకుని కథనాలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రశాంతత కరువైందని భావించిన ఆమె, తన కుటుంబ సభ్యులు ఉన్న కెనడాలోని వాంకోవర్ నగరానికి శాశ్వతంగా వలస వెళ్ళిపోయారు. అక్కడ కూడా మీడియా హడావుడి తనను వెంటాడిందని, ఎక్కడికి వెళ్లినా ప్రైవసీ లేకుండా పోయిందని ఆమె బాధపడ్డారు.

also read :Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

దిలీప్ కుమార్ తన చివరి రోజుల్లో రాసుకున్న ‘ది సబ్స్టాన్స్ అండ్ ది షాడో’ అనే ఆత్మకథలో ఈ సంఘటనని స్వయంగా ప్రస్తావించారు. సైరా బానుకు తాను చేసిన అన్యాయాన్ని, ఆమె నమ్మకాన్ని వమ్ము చేయడాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, తనను తాను క్షమించుకోలేనని అందులో రాసుకున్నారు. ఈ చేదు అనుభవం తర్వాత వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. దేవదాస్ (1955), క్రాంతి (1981) వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన ఈ మహానటుడు, 2021 జూలై 7న కన్నుమూసే వరకు సైరా బాను ఆయనకు నీడలా తోడుగా నిలవడం విశేషం.

Related News

ఆ 93 వీడియోలే టార్గెట్.. యూట్యూబర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మాలీవుడ్ బ్యూటీ!

అమ్ముడుపోయిన మీడియాకు నా ఆహ్వానం.. ధర్మస్థల వివాదంపై ప్రకాష్ రాజ్ లైవ్..

హీరోయిన్ రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ట్విస్ట్ .. ముగ్గురు అరెస్ట్..

Bandla Ganesh : నిజంగా బండ్లన్న పవన్ భక్తుడే.. నిరంజన్ కుటుంబానికి భారీ ఆర్థిక సాయం..

ఢిల్లీకి సీఏం విజయ్.. ‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Monal Gajjar : సినిమాలకు బిగ్ బాస్ బ్యూటీ గుడ్ బై.. త్వరలోనే అతనితో పెళ్లి..?

గట్టిగా చెప్పమన్న ప్రభాస్.. అరిచి మరీ చెప్పిన నాగ్ అశ్విన్.. వీడియో వైరల్!

Big Stories

×