E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఆ 93 వీడియోలే టార్గెట్.. యూట్యూబర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మాలీవుడ్ బ్యూటీ!

ఆ 93 వీడియోలే టార్గెట్.. యూట్యూబర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మాలీవుడ్ బ్యూటీ!
Advertisement

AMMA Controversy: మల్లూ వుడ్ ఇండస్ట్రీ లోని అమ్మ( (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అసోసియేషన్ చుట్టూ తిరుగుతున్న వివాదాలు రోజుకో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి.అవును సీనియర్ నటి, ప్రస్తుతం ‘అమ్మ’ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మీప్రియకు, మరో నటి అన్సిబా హసన్‌కు మధ్య మొదలైన గొడవలు ఇపుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల మెట్లు ఎక్కే వరకు వెళ్లాయి.

మాములుగా సినీ స్టార్స్ మధ్య అడపా దడపా వార్స్ జరగడం కామన్. కానీ ఆ వార్ కాస్తా ఇపుడు లీగల్ వార్ గా మారడం ఇక్కడ గమనార్హం.ఈ ఇష్యూ కేవలం ఇద్దరు నటీమణుల మధ్య వివాదంగానే కాకుండా, యూట్యూబ్ చానెల్స్ క్రియేట్ చేస్తున్న థంబ్‌నైల్స్ థ్రిల్లర్‌గా మారిపోయింది.

పోలీసులకు ఇచ్చిన 93 యూట్యూబ్ వీడియోల లింక్స్ 

Advertisement

ఈ వివాదానికి ప్రధాన కేంద్రంగా మారిన లక్ష్మీప్రియ, జూన్ 13వ తేదీన కొచ్చి సిటీ సైబర్ పోలీసుల వద్ద ఒక కేస్ ఫైల్ చేశారు. కొందరు యూట్యూబర్లు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, అసభ్యకరమైన థంబ్‌నైల్స్ మరియు కంటెంట్‌తో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే సరిగ్గా వారం తర్వాత, అంటే జూన్ 20వ తేదీన ఆమె ఒక సంచలన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనను టార్గెట్ చేసిన 93 యూట్యూబ్ వీడియోల లింకులు, స్క్రీన్‌షాట్లు మరియు పెన్‌డ్రైవ్‌ను పోలీసులకు సాక్ష్యాలుగా అప్పగించినట్లు స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదు వెళ్ళిన వెంటనే కొందరు యూట్యూబర్లు తమ వీడియోలను దాచిపెట్టడం (హైడ్ చేయడం) గమనార్హం. కేవలం తన కోసమే కాకుండా, సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి మహిళ తరపున ఈ పోరాటం చేస్తున్నానని లక్ష్మీప్రియ ప్రకటించడం విశేషం.

also read :ట్రాజెడీ కింగ్ రియల్ లైఫ్ డ్రామా.. ఆ ఒక్క తప్పుకు భార్య కాళ్ళు బాలీవుడ్ స్టార్ హీరో !

లక్ష్మీప్రియపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న అన్సిబా హసన్

Advertisement

మరోవైపు,జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ సరసన ‘దృశ్యం’ మరియు ‘దృశ్యం 2’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన అన్సిబా హసన్ కథ పూర్తిగా భిన్నంగా ఉంది. ‘అమ్మ’ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన అన్సిబా, లక్ష్మీప్రియపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. లక్ష్మీప్రియ తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని, అలాగే త్రిపుణితుర ఉమెన్స్ సెల్ సబ్ ఇన్‌స్పెక్టర్ రేష్మ తనను విచారణ పేరుతో వేధించి, చట్టవిరుద్ధంగా నిర్బంధించారని అన్సిబా వాదిస్తున్నారు. ఈ విషయమై అన్సిబా గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఏసీపీ నివేదిక ప్రకారం లక్ష్మీప్రియపై మరియు సదరు మహిళా పోలీసు అధికారిపై కేసు నమోదు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేశారు.

ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసిన సైబర్ పోలీసులు

పోలీసుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో, నటి అన్సిబా హసన్ ఎర్నాకులం జిల్లాలోని త్రిపుణితుర జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. లక్ష్మీప్రియ మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ రేష్మలపై వెంటనే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. గతంలో ‘కురుక్కన్’, ‘జాన్ హోనాయ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అన్సిబా, ఇలా కోర్టు మెట్లు ఎక్కడం పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. అటు కొచ్చి సైబర్ పోలీసులు లక్ష్మీప్రియ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో ఉన్న వివాదాస్పద కంటెంట్‌ను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు.

also read :Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు కేవలం సినిమా ఇండస్ట్రీ సంక్షేమం కోసం పనిచేసే ‘అమ్మ’ అసోసియేషన్, ఇప్పుడు నటీనటుల ఆధిపత్య పోరాటాలకు వేదికగా మారింది. లక్ష్మీప్రియ సాక్ష్యాలతో సహా సైబర్ పోలీసుల ముందు నిలబడటం, దానికి ప్రతిగా అన్సిబా హసన్ కోర్టు ద్వారా ఎఫ్‌ఐఆర్ కోసం ప్రయత్నించడం మాలీవుడ్‌లో మంటలు పుట్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ లీగల్ వార్ ఎటు వైపు దారితీస్తుందో చూడాలి.

Related News

స్టార్ ప్రొడ్యూసర్ రూ. 1.35 కోట్ల నగలు మాయం.. లగ్జరీ ఫ్యాషన్ జర్నీలో ఊహించని ట్విస్ట్!

ట్రాజెడీ కింగ్ రియల్ లైఫ్ డ్రామా.. ఆ ఒక్క తప్పుకు భార్య కాళ్ళు బాలీవుడ్ స్టార్ హీరో !

అమ్ముడుపోయిన మీడియాకు నా ఆహ్వానం.. ధర్మస్థల వివాదంపై ప్రకాష్ రాజ్ లైవ్..

హీరోయిన్ రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ట్విస్ట్ .. ముగ్గురు అరెస్ట్..

Bandla Ganesh : నిజంగా బండ్లన్న పవన్ భక్తుడే.. నిరంజన్ కుటుంబానికి భారీ ఆర్థిక సాయం..

ఢిల్లీకి సీఏం విజయ్.. ‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Monal Gajjar : సినిమాలకు బిగ్ బాస్ బ్యూటీ గుడ్ బై.. త్వరలోనే అతనితో పెళ్లి..?

Big Stories

×