E-Paper
Advertisement

ఉద్యోగంతో విసిగిపోయారా? రూ. లక్ష ఉంటే చాలు.. ఇంటి నుంచే ప్రారంభించగల వ్యాపారాలు ఇవే!

ఉద్యోగంతో విసిగిపోయారా? రూ. లక్ష ఉంటే చాలు..  ఇంటి నుంచే ప్రారంభించగల వ్యాపారాలు ఇవే!
Advertisement

Business Ideas: సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే రూ.కోట్లలో పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో వాస్తవం లేదు. కేవలం రూ. 1 లక్ష లోపు బడ్జెట్‌తోనే అత్యంత లాభదాయకమైన వ్యాపారాన్ని విజయవంతంగా రన్ చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సొంతంగా వ్యాపారవేత్తగా ఎదగడానికి సహాయపడే ఐదు అద్భుతమైన బిజినెస్ ఐడియాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

1. ఫుడ్ అండ్ క్యాటరింగ్ బిజినెస్

వంట చేయడంపై ఆసక్తి ఉంటే.. ఇంటి నుంచే టిఫిన్ సర్వీస్ స్టార్ట్ చేయెుచ్చు. బ్యాచిలర్స్, ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థులపై ఫోకస్ చేసి దీన్ని స్టార్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వంట పాత్రలు, ప్యాకింగ్ మెటీరియల్స్, ముడి సరుకులు కోసం ఈ వ్యాపారానికి రూ. 20,000 నుండి రూ. 40,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి రావొచ్చు. స్విగ్గీ, జొమాటో (Zomato) వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు.

డిజిటల్ అండ్ స్కిల్ ఆధారిత సర్వీసెస్

Advertisement

డిజిటల్ ప్రపంచంపై అవగాహన ఉంటే.. సర్వీస్-బేస్డ్ బిజినెస్ బెస్ట్ ఆప్షన్. సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, ఎస్ఈఓ (SEO), కంటెంట్ రైటింగ్, కాన్వా (Canva), ఫోటోషాప్ (Photoshop) వంటి టూల్స్ ఉపయోగించి గ్రాఫిక్ డిజైనింగ్ నైపుణ్యాలు ఉంటే స్థానిక వ్యాపార సంస్థలకు సేవలు అందించవచ్చు. మంచి ల్యాప్‌టాప్, హై-స్పీడ్ వై-ఫై, ఆన్‌లైన్ స్కిల్ కోర్సుల కోసం కేవలం రూ. 50,000 నుండి రూ. 70,000 పెట్టుబడితో ఈ వెంచర్‌ను ప్రారంభించవచ్చు. ఇందులో లాభాల మార్జిన్ ఏకంగా 80% వరకు ఉండవచ్చు.

3. ఈ-కామర్స్ అండ్ రీసెల్లింగ్

ప్రస్తుత డిజిటల్ వరల్డ్ లో ఎలాంటి ఫిజికల్ స్టోర్ లేకుండానే ఉత్పత్తులను విక్రయించవచ్చు. సొంతంగా స్టాక్ కొనుగోలు చేయకుండానే షాపిఫై (Shopify), గ్లోరోడ్ (GlowRoad) వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బట్టలు, గాడ్జెట్లు, హోమ్ డెకార్ వస్తువులను అమ్మవచ్చు. వెబ్‌సైట్ సెటప్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్రకటనలు రన్ చేయడానికి రూ. 30,000 నుండి రూ. 50,000 వరకు పెట్టుబడి సరిపోతుంది.

4. కోచింగ్ అండ్ కన్సల్టెన్సీ

Advertisement

జ్ఞానాన్ని పంచే వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కోడింగ్, మ్యూజిక్, లాంగ్వేజెస్ వంటి నిర్దిష్ట సబ్జెక్టులలో నైపుణ్యం ఉంటే పిల్లలకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కోచింగ్ ఇవ్వొచ్చు. అయితే డిజిటల్ బోర్డ్, మైక్రోఫోన్, బేసిక్ సిట్టింగ్ ఏర్పాట్లకు రూ. 10,000 నుండి రూ. 30,000 ఖర్చు కానుంది.

Also Read: జియో సరికొత్త ప్లాన్.. రూ.450కే ఫ్రీ కాల్స్, అపరిమిత 5G.. ఇంకా ఎగిరిగంతేసే బెనిఫిట్స్!

5. సొంతంగా ఉత్పత్తుల తయారీ

తక్కువ ఖర్చుతో సొంతంగా ఉత్పత్తులను తయారు చేయాలనుకుంటే అగర్బత్తీలు, కొవ్వొత్తులు, పేపర్ బ్యాగ్‌ల తయారీ అద్భుతమైన ఆప్షన్. ఇంటిలోని ఒక చిన్న గదిలోనే ఈ ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. ముడి సరుకులు, చిన్న హ్యాండ్-ఆపరేటెడ్ ప్యాకింగ్ మెషీన్ ఖర్చుల కోసం రూ. 40,000 నుండి రూ. 60,000 వరకు పెట్టుబడి సరిపోతుంది. లోకల్ గా ఉండే కిరాణా దుకాణాలు, స్టేషనరీ షాపులు, హోల్‌సేల్ మార్కెట్లలో ఈ ఉత్పత్తులకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.

Also Read: ప్రైవేటు ఆసుపత్రిలో యనమలకు చికిత్స.. ఏమైంది? పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం

Tags

Related News

ఢమాల్.. ఇండియాలో భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు.. టాప్ 5 బ్రాండ్స్ ఇవే

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? హాస్పిటల్ బిల్స్ ఈఎంఐలో చెల్లించవచ్చు.. ఎలాగంటే?

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్.. మీకూ అకౌంట్ ఉందా? వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి

రిటైర్మెంట్ తరువాత నెలవారీ అద్దె ఆదాయం కోసం షాప్ కొంటున్నారా? కొనేముందు ఈ లెక్కలు వేసుకోండి

అప్పట్లో సామాన్యులను లక్షాధిపతులను చేసిన ధీరుభాయ్.. ‘జియో’ IPOతో అది సాధ్యమేనా?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఏం జరిగింది? ఇద్దరు సీనియర్‌ అధికారులపై విచారణ పూర్తి! రేపో మాపో చర్యలు

40 ఏళ్ల వయసు నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్.. ఇలా పెట్టుబడి చేస్తే రూ.3 కోట్ల రాబడి

Big Stories

Advertisement
×