BigTV English

Bajaj Chetak 2901 EV: అధిక మైలేజీ అందించే బజాజ్ చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు అదుర్స్!

Bajaj Chetak 2901 EV: అధిక మైలేజీ అందించే బజాజ్ చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు అదుర్స్!

Bajaj Chetak 2901 Electric Scooter at Rs 95,998 in India: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్కూటర్ తయారీ సంస్థ బజాజ్‌కి మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. కొత్త కొత్త ఈవీ స్కూటర్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తన కంపెనీని మరింత విస్తరించేందుకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా మార్కెట్‌లో దించింది. ఈ మేరకు బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో కొత్త ‘చేతక్ 2901’ని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల రైడర్‌లను ఆకట్టుకునే విధంగా బలమైన మెటల్ బాడీ, అధునాతన టెక్నాలజీను ఈ స్కూటర్‌లో అందిస్తుంది.


దీని ధరను రూ. 95,998 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. కాగా ఈ కొత్త ‘చేతక్ 2901’ రోజువారీ ఉపయోగం కోసం రూపొందించబడిందని కంపెనీ పేర్కొంది. ఇది 123km (ARAI- సర్టిఫైడ్) ఆకట్టుకునే పరిధిని అందిస్తోంది. కంపెనీ దీనిని రెడ్, వైట్, బ్లాక్‌తో సహా లైమ్ ఎల్లో, అజూర్ బ్లూ షేడ్స్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. చేతక్ 2901లో కలర్ డిజిటల్ కన్సోల్, అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే మోడల్ మంచి పరిమాణ 2.88kWhతో వస్తుంది. అంతేకాకుండా గరిష్ట వేగం గంటకు 63కిమీకి పరిమితం చేయబడింది.

వీటితో పాటు హిల్ హోల్డ్, రివర్స్, స్పోర్ట్, ఎకానమీ మోడ్‌లు, కాల్, మ్యూజిక్ కంట్రోల్, ఫాలో మి హోమ్ లైట్లు, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను జోడించే TecPacతో రైడర్‌లు తమ అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. బజాజ్ ఆటో అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ మాట్లాడుతూ.. ‘‘చేతక్ 2901 స్కూటర్ కస్టమర్ల బడ్జెట్‌ను పెంచకుండా పెట్రోల్ స్కూటర్ కస్టమర్‌లను ఆకర్షించేలా డిజైన్ చేయబడింది.


Also Read: బజాజ్ తొలి CNG బైక్ లాంచ్‌కు సిద్ధం.. 50 శాతం ఇంధన ఖర్చు ఆదా.. ధర చాలా తక్కువ..!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు జూన్ 15 నుండి రిటైల్ ప్రారంభమవుతుంది’’ అని తెలపారు. భారతదేశంలోని 500 షోరూమ్‌లు ఇప్పుడు చేతక్ స్కూటర్‌లను అందిస్తున్నాయి. అందేవల్ల మంచి ఫీచర్లు, మైలేజీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తక్కువ ధరలోనే కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇదే బెస్ట్ ఛాయిస్‌గా చెప్పుకోవచ్చు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×