TVS Bikes Price Cut: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సామాన్యుడి ఉపశమనం కలుగుతోంది. జీఎస్టీ సవరణతో టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో విక్రయించే బైక్స్, స్కూటర్ల ధరలను తగ్గించింది. 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన మోటార్ సైకిళ్లకు జీఎస్టీ రేట్లను తగ్గించింది కేంద్రం. పండుగ సీజన్ అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ధరలు తగ్గించాయి.
టీవీఎస్ పాపులర్ మోడల్ జూపిటర్ 110, జూపిటర్ 125, ఎన్‌టార్క్ 125, ఎన్‌టార్క్ 150, ఎక్స్‌ఎల్ 100, రేడియన్, స్పోర్ట్, స్టార్‌సిటీ, జెస్ట్, రైడర్ ధరలు తగ్గాయి. జూపిటర్ 110 ఎక్స్-షోరూమ్ ధర గతంలో రూ. 78,881 కాగా ఇప్పుడు రూ.72,400కు తగ్గింది. జీఎస్టీ సవరణలో రూ. 6,481 ధర తగ్గింది. జూపిటర్ 125 ధర రూ. 82,395 నుంచి రూ. 75,600కు తగ్గింది. అంటే కస్టమర్ కు రూ. 6,795 ప్రయోజనం కలగనుంది. ఎన్‌టార్క్ 125 ధర రూ.7,242 తగ్గి రూ. 80,900కి అందుబాటులో ఉంది. ఎన్‌టార్క్ 150 ధర రూ.9,600 తగ్గి రూ. 1,09,400 చేరింది.
XL 100, రేడియన్, స్పోర్ట్, స్టార్ సిటీ, రైడర్, జెస్ట్ మోడళ్లు ధరలు రూ.4,354 నుండి రూ.6,725 వరకు తగ్గాయి. ఎక్స్ ఎల్ 100 రూ.43,400కి, రేడియన్, స్పోర్ట్ ధర రూ.55,100, స్టార్ సిటీ ధర రూ.72,200 చేరాయి. GST సవరణ తర్వాత రైడర్ కొత్త ధర రూ.80,900గా, జెస్ట్ ధర రూ.70,600గా ఉంది.
మోడల్ – ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర-కొత్త ఎక్స్ షోరూమ్ ధర(తగ్గింపు)
తగ్గింపు ధరలు ఎక్స్ షోరూమ్, రిటైల్ షోరూమ్ లో వేరు వేరుగా ఉండొచ్చని టీవీఎస్ తెలిపింది. సవరించిన ధరలు బేస్ వేరియంట్లకు అందుబాటులో ఉన్నాయని, ఇతర స్పెసిఫికేషన్లు లేదా ప్రదేశాలలో ధరలు కాస్త భిన్నంగా ఉండవచ్చని టీవీఎస్ కంపెనీ పేర్కొంది.