BigTV English

Akhanda 2 : బాలయ్య అఖండ 2 అప్డేట్… పనిలో పనిగా వారికి థమన్ వార్నింగ్

Akhanda 2 : బాలయ్య అఖండ 2 అప్డేట్… పనిలో పనిగా వారికి థమన్ వార్నింగ్

Akhanda 2: నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu)దర్శకత్వంలో తెరికెక్కిన చిత్రం అఖండ 2(Akhanda 2). టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్ అంటే అందరికీ టక్కున బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ గుర్తుకు వస్తుంది. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో నటించిన చిత్రం అఖండ ఒకటి. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2..

ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల కావాల్సిందిగా ఆ రోజు పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న నేపథ్యంలో వాయిదా పడుతూ డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా సంగీత దర్శకుడు. ఎస్ ఎస్ తమన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన అఖండ 2 గురించి బిగ్ అప్డేట్ తెలియజేశారు.

అఖండ 2 నెక్స్ట్ లెవెల్..

బోయపాటి గారు బాలయ్య కోసం ఈ సినిమా కథను చాలా అద్భుతంగా రాసుకున్నారు అయితే ఆయన కథకు అనుగుణంగానే మేము కూడా మ్యూజిక్ అలాగే హైప్ పెంచుతూ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇక శివతాండవం అంటే బిజిఎం కూడా అదే రేంజిలో ఇవ్వాల్సి ఉంటుందని తమన్ వెల్లడించారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ అవుట్ ఫుట్ వచ్చిందని, సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతుందని తమన్ వెల్లడించారు. ఈ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని ఈయన ధీమా వ్యక్తం చేశారు. ఇలా అఖండ 2 సినిమా గురించి తమన్ హైప్ పెంచుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈయన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా థియేటర్ యాజమాన్యానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు.


స్పీకర్లు బిగించుకోవాల్సిందే..

సాధారణంగా ఏదైనా విపత్తు వస్తుంది అంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంటారు అలాగే బాలయ్య అఖండ 2 సినిమా రాబోతోంది అంటే థియేటర్ యాజమాన్యం మొత్తం థియేటర్లలో స్పీకర్లను బిగించుకోవాలని ఈ సందర్భంగా తమన్ సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో బాలయ్య సినిమాలకు తమన్ బిజిఎంకు స్పీకర్లు పడిపోయిన సంగతి తెలిసిందే.ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున తమన్ ఇలా మాట్లాడారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్ త్వరలోనే ఆఖండ2, రాజా సాబ్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సంయుక్త మీనన్ నటించిన సంగతి తెలిసినదే.

Also Read: OG Movie: ఓజీ నిర్మాతలకు షాక్.. లీగల్ నోటీసులు పంపిన మల్లేష్ యాదవ్!

Related News

Karthik Varma: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. సందడి చేసిన సినీ సెలబ్రిటీలు!

The Raja Saab Business: రాజాసాబ్ బిజినెస్… ఓజీని దాటిస్తుందే?

Chiranjeevi: చరణ్ 18 ఏళ్ల సినీ కెరియర్.. తండ్రిగా ఆ క్షణం మర్చిపోలేను.. చిరు ఎమోషనల్ పోస్ట్!

OG Movie: ఓజీ నిర్మాతలకు షాక్… కోర్టు ధిక్కరణ కేసు

Euphoria: నేటి తరం యువత కోసమే గుణశేఖర్ యుఫోరియా.. స్టోరీ లైన్ ఇదేనా!

Tripti dimri: అతని వల్ల నా లైఫ్ 360° తిరుగుతోంది..నటి ఎమోషనల్ కామెంట్స్!

Rishabh Shetty: ఏంటీ రిషబ్ శెట్టి అసలు పేరు ఇదా.. పేరు మార్పు వెనుక పెద్ద కథే వుందే!

Big Stories

×