OG Movie: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సుజీత్ (Sujeetj)కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా(OG Movie) విషయంలో నిర్మాతలు డివివి ఎంటర్టైన్మెంట్(DVV Entertainments) వారికి ఊహించని షాక్ తగిలింది. ఇలా నిర్మాతలకు మల్లేష్ యాదవ్(Mallesh Yadav) లీగల్ నోటీసులు జారీ చేశారు. డివివి నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేయడం ఏంటి అసలేం జరిగింద సినే విషయానికి వస్తే… ఇటీవల ఓజీ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రాలో కూడా ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జీవో జారీ చేశారు. అయితే ఈ సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టును సంప్రదించారు.
ఇలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సినిమా టికెట్ల ధరల విషయంలో కోర్టు నుంచి ఊహించని తీర్పు వచ్చింది. అయితే కోర్ట్ తీర్పు రాత్రి 11:30 లకు వస్తే అంతకుముందే డివివి నిర్మాణ సంస్థతను అధికారక ఎక్స్ ఖాతాలో మల్లేష్ యాదవ్ కు నైజాం ఏరియాలో ఎక్కడైనా ఓజీ సినిమా టికెట్ ధర కేవలం రూ 100 కే ఇస్తాము అంటూ పోస్ట్ పెట్టారు . అయితే ఈ పోస్ట్ పట్ల మల్లేష్ యాదవ్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా డివివి నిర్మాణ సంస్థ తన గురించి అధికారక ఎక్స్ ఖాతా ద్వారా ఇలాంటి పోస్ట్ చేయడం అంటే తనని పూర్తిగా అవమానపరచడమేనని ఈయన వెల్లడించారు.
రాజ్యాంగ పరంగా తాను కోర్టులో పిటిషన్ వేసినందుకు తనను కించపరుస్తూ అవమానకరంగా పోస్టులు పెట్టి హీరో అభిమానుల చేత నన్ను ట్రోల్స్ చేయించడం చట్టపరంగా పూర్తిగా విరుద్ధమని తెలిపారు. నా విషయంలో ఇలా చేసినందుకు నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులను పంపిస్తున్నానని, నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసును నమోదు చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ వెల్లడించారు. మరి ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల డివివి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోసం భారీ స్థాయిలో టికెట్ల రేట్లు పెంచుతూ రెండు రాష్ట్రాలు అనుమతులు తెలిపిన సంగతి తెలిసిందే.
ఓజీ నిర్మాతలపై కోర్టు ధిక్కరణ కేసు #OGMovie #Og #Pawankalyan #Sujeeth @PawanKalyan @Sujeethsign pic.twitter.com/vBdRVxeJFa
— BIG TV Cinema (@BigtvCinema) September 28, 2025
ఇకపోతే తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి అనుమతి లేకుండా సినిమా టికెట్ల రేట్లు పెంపుకు జీవో విడుదల చేశారంటూ ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇకపై తెలంగాణలో ఏ సినిమాలకు కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదంటూ తెలియజేశారు. ఇక ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు రోజులు అవుతున్న నేపథ్యంలో కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయి. OG సినిమా పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా పరవాలేదనిపించుకుంది.
Also Read: Euphoria: నేటి తరం యువత కోసమే గుణశేఖర్ యుఫోరియా.. స్టోరీ లైన్ ఇదేనా!