BSNL Offers: ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచేస్తూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రతి నెలా భారీ ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ మాత్రం తన కస్టమర్ల కోసం చౌకగా, ఎక్కువ కాలం వాడుకునే ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ చూసిన వెంటనే చాలామందికి ఊరట కలిగింది.
బిఎస్ఎన్ఎల్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ ధర కేవలం రూ.485 మాత్రమే. ఒకసారి రీఛార్జ్ చేస్తే 72 రోజుల పాటు మీరు టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. అంటే రెండు నెలలకంటే ఎక్కువ రోజులు మరోసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సౌకర్యం వల్ల సాధారణ యూజర్లకే కాదు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఎక్కువగా కాల్స్ చేసే వాళ్లకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
డేటా విషయంలో కూడా బిఎస్ఎన్ఎల్ మంచి ఆఫర్ ఇస్తోంది. రోజుకి 2జిబి హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. మొత్తం మూడింట రెండు నెలల్లో కలిపి 144జిబి డేటా వస్తుంది. ఒకరోజు లిమిట్ పూర్తయినా నెట్ ఆగిపోదు, కానీ స్పీడ్ మాత్రం తగ్గుతుంది. రోజువారీ బ్రౌజింగ్, వీడియోలు, సోషల్ మీడియా వాడటానికి ఇది సరిపోతుంది.
Also Read: Jio Offers: 3 నెలల ప్యాక్ ఇంత చౌకా? జియో వినియోగదారులకి గుడ్ న్యూస్
అంతే కాదు, ఈ ప్లాన్‌లో కాల్స్ పరిమితి లేదు. ఏ నెట్‌వర్క్‌కి అయినా ఎన్ని కాల్స్ చేసినా అదనపు ఛార్జీలు ఉండవు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు కూడా అందిస్తారు. దీంతో డేటా, కాల్స్, మెసేజ్ అన్నీ ఒకే సొల్యూషన్ లా ఈ ప్లాన్ కనిపిస్తోంది.
వినోదం కోసం కూడా ఎస్ఎమ్ఎస్ ప్రత్యేకంగా ఆఫర్ ఇచ్చింది. రూ.485 ప్లాన్ తీసుకుంటే ఎస్ఎమ్ఎస్ బిటివి యాక్సెస్ ఉచితంగా వస్తుంది. దీనిలో 300కి పైగా లైవ్ ఛానెల్స్‌తో పాటు కొన్ని ఒటిటి యాప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ పండుగ సీజన్‌కి అనుగుణంగా యూజర్ల కోసం స్పెషల్‌గా ఇచ్చారు.
ఇంకా ఒక అదనపు బెనిఫిట్ కూడా ఉంది. మీరు ఈ రీఛార్జ్‌ను బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేస్తే, 2శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అంటే మీరు తక్కువ డబ్బులో ఎక్కువ సౌకర్యాలు పొందుతున్నట్టే. తక్కువ ఖర్చులో ఎక్కువ రోజులు టెన్షన్ లేకుండా వాడుకోవాలనుకునే వారికి ఇది నిజంగా మంచి ఆఫర్.