IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కంటే ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందే సమూల మార్పులు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ టోర్నమెంట్ లో కొత్త రూల్ తీసుకువచ్చింది. కచ్చితంగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లను ఆడించాలని… నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అండర్ 16 ఉన్న ప్లేయర్లు ఐపిఎల్ ఆడేటప్పుడు… కచ్చితంగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఒకటైన ఆడి ఉండాలని.. కండిషన్ పెట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకపోయినా… అతన్ని ఐపిఎల్ ఆడించకూడదని వెల్లడించింది. ఇక మిగతా ప్లేయర్లకు ఎలాంటి రూల్స్ లేవని తేల్చి చెప్పింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ రూల్స్ ఐపీఎల్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇందులో సెలెక్ట్ అయి ఒక్క మ్యాచ్ ఆడితే చాలు ఆ క్రికెటర్ స్టార్ అయిపోతాడు. అలా చాలామంది స్టార్లై ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంను తేలుతున్నారని చెప్పవచ్చు. అభిషేక్ శర్మ, అర్ష్ దీప్, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంషి, గిల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా… టీమిండియాలోకి వచ్చారు. ఐపిఎల్ లో రాణిస్తే చాలు నేరుగా టీమిండియాలోకి వస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్న యువ క్రికెటర్లకు… ఊహించని షాక్ ఇచ్చింది భారత క్రికెట్. అండర్ 16 ఉన్న ప్లేయర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడాలంటే కచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల్సిందేనని తాజాగా కొత్త రూల్ తీసుకువచ్చిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. అంటే అండర్ 16 ఉన్న ప్లేయర్ కచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఒకటైన ఆడాలి. అప్పుడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్.. వేలం లేదా మ్యాచ్లో ఆడవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మార్చి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 84 మ్యాచులు నిర్వహించనున్నారు. ఎప్పటిలాగే శనివారం, ఆదివారం రోజున రెండు మ్యాచ్లు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో ఒకే ఒక్క మ్యాచ్ జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ముగిసిన తర్వాతే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నెంట్ జరుగనుంది.
🚨 NEW RULE BY BCCI 🚨
– In order to be eligible to play in the IPL, U16 Player must have played at least one First Class match. [Gaurav Gupta] pic.twitter.com/MFubqm7C0m
— Johns. (@CricCrazyJohns) September 28, 2025