E-Paper
Advertisement

Virender Sehwag On Dhoni: “హెలికాప్టర్ షాట్” ధోని అయ్య జాగీర్ కాదు..డ‌బ్బా కొట్ట‌డం ఇక ఆపండి

Virender Sehwag On Dhoni: “హెలికాప్టర్ షాట్” ధోని అయ్య జాగీర్ కాదు..డ‌బ్బా కొట్ట‌డం ఇక ఆపండి
Advertisement

Virender Sehwag On Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు మూడు ఐసీసీ ట్రోఫీలు తెచ్చిన మొనగాడు మహేంద్రసింగ్ ధోని. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని పేరు చెప్పగానే అందరికీ హెలికాప్టర్ షాట్ గుర్తుకు వస్తుంది. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో హెలికాప్టర్ షాట్ కొట్టి ఇండియాకు టైటిల్ అందించాడు ధోని. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని హెలికాప్టర్ షాట్ ఫై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ షాట్ ( Dhoni Helicopter shot ) మహేంద్ర సింగ్ ధోని అయ్య జాగీర్ కాదని మండిపడ్డారు. అసలు దీన్ని కనిపెట్టింది అజారుద్దీన్ అంటూ బాంబు పేల్చారు. కానీ అందరూ మహేంద్ర సింగ్ ధోని కనిపెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక‌పై ఈ త‌ప్పుడు ప్ర‌చారం ఆపండి అంటూ సీరియ‌స్ అయ్యారు వీరూ భాయ్.

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

“హెలికాప్టర్ షాట్” ధోని అయ్య జాగీర్ కాదు

Advertisement

మహేంద్ర సింగ్ ధోని హెలికాప్టర్ షాట్ బాగా ఆడతాడు అన్న సంగతి తెలిసిందే. ఈ షాట్ మహేంద్ర సింగ్ ధోని కనిపెట్టినట్లుగానే ప్రచారం చేస్తూ ఉంటారు ఆయన అభిమానులు. చాలా మందికి అస‌లు విష‌యం తెలియ‌క‌, ధోనీనే ఈ షాట్ కనిపెట్టినట్లు ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే దీనిపై టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. మహేంద్రసింగ్ ధోని కంటే ముందు మహమ్మద్ ఆజారుద్దీన్ ఈ హెలికాప్టర్ షాట్ ను మొట్ట మొదటగా ఆడాడని గుర్తు చేశారు. టెస్ట్ క్రికెట్ లో స్లిప్స్ మీదుగా కూడా మహమ్మద్ అజారుద్దీన్ ఈ హెలికాప్టర్ షాట్ ఆడేవాడని తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. అంతేకాదు పాకిస్తాన్ డేంజర్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ లో కూడా సచిన్ టెండూల్కర్ ఇప్పటికే హెలికాప్టర్ షాట్ ఆడినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు వీరేంద్ర సెహ్వాగ్. తాను కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లో “హెలికాప్టర్ షాట్ష ఆడిన‌ట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ షాట్ ను 1994 కాలంలోనే తాము ఆడామ‌ని వెల్ల‌డించారు. కానీ ఈ విష‌యం తెలియ‌కుండానే, ధోని అయ్య జాగీర్ అన్న‌ట్లు కొంత‌మంది త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు. ఇక పై ధోని గురించి డ‌బ్బా కొట్ట‌డం ఆపండి అంటూ సీరియ‌స్ అయ్యారు. ఈ త‌రుణంలోనే హెలికాప్టర్ షాట్ పై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అయితే, సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య‌లకు ధోని అభిమానులు కౌంట‌ర్ ఇస్తున్నారు.

 

Advertisement

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×