E-Paper
Advertisement

కొత్త ఇల్లు కొనబోతున్నారా? ఈ తప్పులు చేయకండి.. కొనేముందు ఇవి తప్పక చెక్ చేయాలి

కొత్త ఇల్లు కొనబోతున్నారా? ఈ తప్పులు చేయకండి.. కొనేముందు ఇవి తప్పక చెక్ చేయాలి
Advertisement

Home buying tips| చాలామందికి సొంత ఇల్లు అనేది జీవితంలో ఒక పెద్ద కల. ఎన్నో ఏళ్ల కష్టం, పొదుపు తర్వాత ఆ కలను నెరవేర్చుకునేందుకు అడుగు వేస్తారు. అయితే పెద్ద ఇల్లు కొంటేనే మంచి నిర్ణయం అవుతుందా? అసలు కాదు. ఇంటి సైజు కంటే మీ జీవితం, సౌకర్యం, భవిష్యత్తుకు అది ఎంత ఉపయోగపడుతుందో చూడటం ముఖ్యం.
చాలామంది ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ముందుగా చదరపు అడుగు ధరను పరిశీలిస్తారు. ఈ లెక్క సులభంగా ఉంటుంది. అయితే ఇంటి అసలు విలువను కేవలం చదరపు అడుగు ధరతో నిర్ణయించలేం. ఒకే సైజులో ఉన్న రెండు ఇళ్లకు వేర్వేరు ధరలు ఉండవచ్చు. ప్రాంతం, నిర్మాణ నాణ్యత, డిజైన్, గోప్యత, సౌకర్యాలు, నిర్వహణ వంటి అంశాలు ఇంటి ధరను ప్రభావితం చేస్తాయి. అందుకే చూడడానికి పెద్ద ఇల్లుగా కనిపించినా కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు పెట్టించినా, మెరుగైన విలువను ఇవ్వకపోవచ్చు.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న ఇళ్ల ధరలు

దేశంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఔరం ప్రాప్ టెక్ (Aurum PropTech)కు చెందిన Q2 2026 నివేదిక ప్రకారం.. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో (రెసిడెన్షియల్) సగటు చదరపు అడుగు ధర రూ.10,153కు చేరింది. ఈ ధర వరుసగా రెండో త్రైమాసికంలో రూ.10,000 మార్కును దాటింది. అయితే ఇదే సమయంలో నివాస గృహాల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 6.1 శాతం తగ్గాయి. దీంతో కొనుగోలుదారులు ఖరీదైన ఇళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. వారు ఖర్చు చేసే ప్రతి రూపాయికి సరైన విలువ లభిస్తుందా అని పరిశీలిస్తున్నారు.

చదరపు అడుగు ధర ఒక్కటే ప్రమాణం కాదు

Advertisement

మరో ప్రముఖ రియల్ ఎస్టేస్ కంపెనీ అరాట్ డెవలపర్స్ (Aratt Developers) మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ విన్సెంట్ టోనీ ప్రకారం.. కొనుగోలుదారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. చదరపు అడుగు ధర ఎంత అని మాత్రమే అడగకుండా, అదనపు ధరకు ఏమి లభిస్తుందో తెలుసుకోవాలి. మెరుగైన కనెక్టివిటీ, నిర్మాణ నాణ్యత, మంచి డిజైన్, సౌకర్యాలు అధిక ధరను సమర్థించవచ్చు. భవిష్యత్తులో రోడ్లు, ప్రజా రవాణా వంటి మౌలిక సదుపాయాలు పెరిగితే ప్రాంతం విలువ కూడా పెరుగుతుంది.

మంచి ప్రాంతం మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది

ఆఫీసులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజా రవాణాకు దగ్గరగా ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో నివసించడం వల్ల ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని అలయన్స్ సిటీ డెవలపర్స్ (Alliance City Developers) సీఈఓ అంకితా లుహారుకా కూడా ప్రాంత భవిష్యత్తును పరిశీలించాలని సూచిస్తున్నారు. మీరు కొంచెం ఎక్కువ ఖరీదు చేసే ఇల్లు అయినా పర్లేదు అని భావిస్తే ముందుగా ఆ ప్రాంత కనెక్టివిటీని చెక్ చేయాలి. భవిష్యత్తులో ఆ ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ వల్లే విలువ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కువ స్థలం ఉంటేనే ఎక్కువ విలువ కాదు

Advertisement

పెద్ద ఇల్లు అంటే మంచి ఇల్లు అని చాలామంది భావిస్తారు. కానీ ఇంటి డిజైన్ సరిగ్గా లేకపోతే పెద్ద ఇల్లు కూడా అసౌకర్యంగా ఉంటుంది. మంచి లేఅవుట్ ఉన్న చిన్న ఇల్లు రోజువారీ జీవితానికి మరింత ఉపయోగకరంగా ఉండవచ్చు. సహజ వెలుతురు, గాలి, గోప్యత, నిల్వ స్థలం వంటి అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి.
కేవలం అదనపు చదరపు అడుగుల కంటే ఉపయోగించగల స్థలం ముఖ్యమని కొనుగోలుదారులు గుర్తించాలి.

ఇంటి జీవన ప్రమాణాలను కూడా పరిశీలించాలి

ఇల్లు మొదటిసారి చూసినప్పుడు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ అక్కడ నివసించడం పూర్తిగా భిన్నమైన అనుభవం. అందుకే కొనుగోలు ముందు సూర్యరశ్మి, గాలి, గోప్యత, గదుల అమరికను పరిశీలించాలి. కామన్ ఏరియాల నిర్వహణ, అందుబాటులో ఉన్న సౌకర్యాలను కూడా చెక్ చేయాలి. వైట్ లోటస్ గ్రూపు వ్యవస్థాపకుడు సీఈఓ పవన్ కుమార్ దీర్ఘకాలిక జీవన సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు.

నిర్మాణ నాణ్యత భవిష్యత్తు ఖర్చులను నిర్ణయిస్తుంది

తక్కువ ధర ఉన్న ఇల్లు ముందు మంచి డీల్‌లా కనిపించవచ్చు. కానీ నాసిరకం నిర్మాణం భవిష్యత్తులో వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖర్చులు కూడా పెరిగిపోతాయి. తరచూ మరమ్మతులు చేయాల్సి రావడం, నిర్వహణ సమస్యలు ఎదురవడం యజమానికి భారంగా మారవచ్చు. మంచి నిర్మాణం ఉన్న ఇంటికి ప్రారంభంలో ఎక్కువ ధర ఉండొచ్చు. అయినప్పటికీ దీర్ఘకాలంలో మెరుగైన సౌకర్యాన్ని అందించవచ్చు.

Also Read: రూ.1.3 లక్షల జీతం.. నెల ఖర్చు రూ.15000 మాత్రమే.. అయినా జీవితంలో అసంతృప్తి

ఖరీదైన ఇల్లు ఎప్పుడూ మంచి ఎంపిక కాదు

బ్రాండ్ పేరు లేదా ఎక్కువ సౌకర్యాల కారణంగా కొన్ని ఇళ్ల ధరలు పెరుగుతాయి. అయితే ఆ సౌకర్యాలను నిజంగా ఉపయోగిస్తారా అని కొనుగోలుదారులు ఆలోచించాలి. అదనపు సౌకర్యాల నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో కూడా తెలుసుకోవాలి. అధిక ధర చెల్లించినప్పుడు అది రోజువారీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందా అనేదే అసలు ప్రశ్న.

ఇంటి పరిమాణం కంటే దీర్ఘకాలిక విలువను చూడాలి

మంచి ఇల్లు అంటే తక్కువ ధర ఉన్నదీ కాదు, సైజులో పెద్దదనీ కాదు. స్థానం, డిజైన్, నిర్మాణ క్వాలిటీ, గోప్యత, కనెక్టివిటీ వంటి అంశాలు ధరకు తగిన విలువను అందించాలి. కొనుగోలుదారులు ఇంటి ప్రస్తుత ధరతో పాటు భవిష్యత్తు నిర్వహణ ఖర్చులు, సౌకర్యం, ప్రాంత అభివృద్ధిని కూడా పరిశీలించాలి. చివరికి, ఇంటి పరిమాణం కంటే అది అందించే జీవన నాణ్యత, సౌకర్యం, దీర్ఘకాలిక విలువ ముఖ్యం.

Tags

Related News

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

చదువుతూనే సంపాదన.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారిన లా స్టూడెంట్.. తొలిరోజు సంపాదన ఎంతంటే?

లింక్డ్‌ఇన్ డేటాతో యువతికి వేధింపులు.. జాబ్ కోసం నంబర్ ఇస్తే.. ఇదా పరిస్థితి?

బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోళ్లదారుల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంత?

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

Big Stories

Advertisement
×