E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 31st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఫ్యామిలీని వెళ్లగొట్టిన శివనారాయణ        

Karthika Deepam 2 Serial Today Episode August 31st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఫ్యామిలీని వెళ్లగొట్టిన శివనారాయణ        
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  మాలిని కృష్ణమూర్తి ఫోటో ముందు నిలబడి అబద్దం చెప్పానని అనుకున్నావా.? కానీ అలా చెప్పాల్సి వచ్చింది.. అంటూ ప్లాష్‌ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. కాంచనకు కాళ్లు పోవడానికి తానే కారణం అని దశరథను చంపేసి సుమిత్రను తీసుకొచ్చి తన అన్నకు ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం. అన్ని గుర్తు చేసుకుంటుంది. మాలినిని కృష్ణమూర్తి తిట్టిన విషయం పోలీసులు అరెస్ట్‌ చేస్తారన్న భయంతో కృష్ణమూర్తిని భయపెడుతుంది.

కృష్ణమూర్తి ఈ విషయాలన్నీ నాన్నకు ( దక్షిణమూర్తికి) చెప్తానంటే.. రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకుంటానని మీరు నోరు విప్పితే.. తాను తన బిడ్డ బతకమని.. దశరథను చంపేసి సుమిత్రను తీసుకొచ్చి మా అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేయాలి. అందకు మీరే నాకు సాయం చేయాలి అంటూ ఈ ప్లాన్‌ అంతా ఎవరికి చెప్పినా చనిపోతానని బెదిరించి వెళ్లిపోతుంది మాలిని. మాలిని వెళ్లిపోయాక అదే రివాల్వర్‌తో కృష్ణమూర్తి సూసైడ్‌ చేసుకుంటాడు. అదంతా గుర్తు చేసుకున్న మాలిని. నీ చావు సుమిత్ర వల్లే జరిగిందని నీ తండ్రిని, నీ కొడుకును నమ్మించడానికి నేను చాలా కష్టపడ్డాను కృష్ణమూర్తి అంటూ ఫోటో ముందు నిలబడి మట్లాడుతుంది.

Advertisement

హాస్పిటల్‌లో ఉన్న సుమిత్ర పరిస్థితి ఎలా ఉందని డాక్టర్‌ను శివనారాయణ అడిగితే.. సుమిత్ర కండీషన్‌ సీరియస్‌గానే ఉందని.. సమయానికి మీరు హాస్పిటల్‌కు తీసుకురాకపోయి ఉంటే చనిపోయేది. ఆవిడను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తను షో కేసులో పెట్టుకున్న బొమ్మ లాంటిది. ఈసారి ఇలా స్ట్రోక్‌ వస్తే సుమిత్ర గారిని కాపాడటం చాలా కష్టం అంటూ చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్‌. సుమిత్ర ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఎవరని కాంచనను శివనారాయణ అడిగితే.. ఆ మాలిని అంటూ చెప్పగానే.. కాదు నీ కొడుకు కార్తీక్‌, నీ కొడలు దీప అంటూ మనం వాళ్లను పూర్తిగా మర్చిపోయాము.. కానీ దక్షిణామూర్తి మొదటిసారి మన ఇంట్లో అడుగుపెట్టడానికి కారణం నీ కొడుకు కార్తీక్‌.

సూరజ్‌ మన ఆఫీసులో అడుగుపెట్టడానికి కారణం ఎవరు నీ కోడలు దీప. వాళ్లిద్దరూ ఎవరో తెలుసుకోకుండా తీసుకొచ్చింది వీళ్లిద్దరూ.. అంటూ కార్తీక్‌, దీపలను శివనారాయణ తిడతాడు.. మీరు ఇక్కడ లేకపోతేనే మీ వదిన బతుకుతుంది. మీకు దండం పెడాతాను అంటూ రెండు చేతుల ఎత్తి మొక్కుతుంటే.. మా వల్ల మీరు బాధపడింది చాలు ఇక మేము వెళ్లిపోతాము నాన్న.. ఏవండి వెళ్దాం పదండి అంటూ కాంచన వాళ్లు వెళ్లబోతుంటే.. మిమ్మల్ని మేము చూడాలనుకోవడం లేదు..  అనగానే.. కాంచన, శ్రీధర్‌, కార్తీక్‌, దీప వెళ్లిపోతారు. వాళ్ల వెనకాలే దశరథ వెళ్తాడు. జ్యోత్స్నను తీసుకుని పారిజాతం ఇంటికి వెళ్తుంది.

Advertisement

సూరజ్‌ ఆలోచిస్తూ ఉంటే.. మాలిని వెళ్లి జరిగిన విషయాల్లో తనకు ఎలాంటి సంబధం లేకపోయినా.. నేను ఏ తప్పు చేయకపోయినా అందరూ నన్నే తప్పు పట్టారు. కానీ ఎవరు ఏమనుకున్నా నేను ఏమీ అనుకోను కానీ నా కొడుకు నన్ను ఏం అనుకుంటున్నాడో అది నాకు కావల్సింది. చెప్పు సూరజ్‌ నువ్వు నా గురించ ఏం అనుకుంటున్నావా..? అంటూ అడగ్గానే.. నువ్వేమైనా తప్పు చేశావా అమ్మా.. అంటూ సూరజ్‌ ప్రశ్నిస్తే.. ఆరోజు ఏం జరిగిందో నీకు మొత్తం తెలియాలి అంటూ సూరజ్‌కు అబద్దం చెప్తుంది. ఇప్పుడైనా నువ్వు నన్ను నమ్ముతున్నావా..? అని మళ్లీ అడిగితే.. నేనేదీ మనసులో మోయనమ్మా అంటూ సూరజ్‌ వెళ్లిపోతాడు.

హాస్పిటల్‌ లో ఒక మూలకు వెళ్లిన కూర్చున్న కార్తీక్‌, దీప శివనారాయణ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. సూరజ్‌ను తిట్టుకుంటారు. మనం ఆట అర్థం చేసుకునే లోపే సూరజ్‌ ఆట ముగించేశాడు. తప్పు మనదే ఎందుకంటే సూరజ్‌ను తీసుకొచ్చింది మనమే. మనం అవకాశం ఇవ్వకపోతే సూరజ్‌ అనే వాడు ఎక్కడుంటాడు. మనం చోటు ఇచ్చిన చోటే మనం నిలబడటానికి చోటు లేకుండా చేశాడు. అంటూ ఇద్దరూ బాధపడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన మిథిలేష్.. నిజమవుతుందా?

బ్రేకప్ గురించి బయటపెట్టిన మిథిలేష్.. ఆ అమ్మాయికి నో చెప్పేశాడా?

బిగ్‌బాస్‌కి మళ్లీ పిలిచినా వెళ్లను.. మిథిలేష్ షాకింగ్ కామెంట్స్!

4 నెలల నుంచి దుష్ప్రచారం.. మొదటిసారి స్కామ్ ఆరోపణలపై స్పందించిన నందన!

ఆ అమ్మాయి ఎవరంటే .. ప్రేమ గురించి మనసు విప్పిన ఉప్పల్ బాలు!

నవదీప్ ఒక చిల్లరగాడు ..ఉప్పల్ బాలు షాకింగ్ కామెంట్స్

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!

ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Big Stories

Advertisement
×